




Best Web Hosting Provider In India 2024

మలయాళం స్టార్ టొవినో థామస్ నటించిన 8 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూసేయండి.. తెలుగులోనూ ఉన్నాయి
మలయాళం స్టార్ హీరో టొవినో థామస్ ఎన్నో థ్రిల్లర్ సినిమాల్లో నటించాడు. మరి అతడు చేసిన వాటిలో బెస్ట్ మూవీస్ ఏవి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి. వీటిలో కొన్ని తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
టొవినో థామస్.. మలయాళం యువ నటుల్లో ఒకరు. 2012లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో.. ఇప్పటికే 50కిపైగా సినిమాల్లో నటించాడు. వీటిలో థ్రిల్లర్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5లాంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
2018 – సోనీ లివ్ ఓటీటీ
ఈ ఏడాది వచ్చిన ఎల్ 2 ఎంపురాన్, గతేడాది వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఈ 2018. టొవినో థామస్ లీడ్ రోల్లో నటించాడు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తీసిన ఈ థ్రిల్లర్ మూవీ చాలా అద్బుతంగా ఉంటుంది. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
నారదన్ – ఆహా వీడియో ఓటీటీ
నారదన్ 2022లో వచ్చిన థ్రిల్లర్ మూవీ. ఇందులో చంద్రప్రకాశ్ అనే జర్నలిస్ట్ పాత్రలో టొవినో థామస్ నటించాడు. ఎక్కడికి వెళ్లినా తాను, తన న్యూస్ పవరేంటో చూపించుకోవాలనుకునే పాత్రలో అతడు కనిపించాడు. ఈ మూవీ ప్రైమ్ వీడియోతోపాటు ఆహా వీడియో ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఐడెంటిటీ – జీ5 ఓటీటీ
టొవినో థామస్ తోపాటు త్రిష కూడా నటించిన సినిమా ఐడెంటిటీ. ఈ ఏడాది జనవరిలో రిలీజైంది. ఇందులో ఓ స్కెచ్ ఆర్టిస్ట్ పాత్రలో అతడు నటించాడు. అమ్మాయిల నగ్న వీడియోలతో వాళ్లను బ్లాక్‌మెయిల్ చేసే ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ హత్య దర్యాప్తు చుట్టూ ఎన్నో ట్విస్టులతో సాగే మూవీ ఈ ఐడెంటిటీ. జీ5 ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ఫోరెన్సిక్ – నెట్‌ఫ్లిక్స్
ఫోరెన్సిక్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీయే. ఇందులో టొవినో ఓ ఫోరెన్సిక్ నిపుణుడి పాత్రలో నటించాడు. చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని హత్య చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసులో అతడు పని చేస్తుంటాడు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ ఉంది.
వాశి – నెట్‌ఫ్లిక్స్
కీర్తి సురేష్, టొవినో థామస్ భార్యాభర్తలుగా నటించిన మూవీ ఈ వాశి. ఇద్దరూ లాయర్లుగానే కనిపిస్తారు. ఓ యువతిపై అత్యాచారం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా టొవినో, డిఫెన్స్ లాయర్ గా కీర్తి ఈ మూవీలో నటించారు. ఇదో కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. తెలుగులోనూ చూడొచ్చు.
వైరస్ – జీ5 ఓటీటీ
కేరళను వణికించిన నిఫా వైరస్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఈ వైరస్. ఇందులో కుంచకో బొబన్, ఇంద్రజిత్ సుకుమారన్ లతో కలిసి టొవినో థామస్ కూడా నటించాడు. అసలు కేరళలో ఈ నిఫా వైరస్ ఎలా మొదలైందో మూలాలను కనిపెట్టే దిశగా సాగే స్టోరీతో వచ్చిన మూవీ. జీ5 ఓటీటీలో చూడొచ్చు.
అన్వేషిపిన్ కండెతుమ్ – నెట్‌ఫ్లిక్స్
టొవినో థామస్ నటించిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది టాప్ లో ఉంటుందని చెప్పొచ్చు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిల హత్యల కేసులను పరిష్కరించే ఎస్ఐ ఆనంద్ పాత్రలో టొవినో నటించాడు. ఈ మూవీ ఊహకందని ట్విస్టులతో సాగుతుంది.
కానెక్కానే – సోనీ లివ్ ఓటీటీ
కానెక్కానే సోనీలివ్ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉన్న మలయాళం థ్రిల్లర్ మూవీ. ఇందులో సూరజ్ వెంజరమూడు కూడా నటించాడు. తన కూతురిని చావుకు వదిలేసి గర్ల్‌ఫ్రెండ్ ను రెండో పెళ్లి చేసుకున్న అల్లుడిపై ఓ మామ తీర్చుకునే ప్రతీకారం నేపథ్యంలో సాగే మూవీ ఇది.
సంబంధిత కథనం