




Best Web Hosting Provider In India 2024

నాని హిట్ 3 సినిమా కలెక్షన్లు.. 9 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా? కొత్త సినిమాల దెబ్బ
నాని హిట్ 3 కలెక్షన్లు: నేచురల్ నాని లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘హిట్ 3’ థియేటర్లలో రన్ అవుతోంది. మే 1న రిలీజైన ఈ మూవీ తొమ్మిది రోజుల్లో ఎన్ని రూ.కోట్ల కలెక్షన్లు రాబట్టిందో చూసేయండి.
అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో, మాస్ యాక్షన్ సీన్స్ తో గత్తరలేపారు హీరో నాని. మునుపెన్నడూ చూడని వైలెన్స్ ను చూపించారు. బీభత్సమైన రక్తపాతంతో, పీక్ యాక్షన్ మోడ్ లో ‘హిట్ 3’ మూవీలో రెచ్చిపోయారు నాని. ఈ నేచురల్ స్టార్ యాక్షన్ కు ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది.
ఎన్ని కోట్లంటే?
మే 1న థియేటర్లకు వచ్చిన నాని ‘హిట్ 3’ మూవీ ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీతో నాని వరుసగా రూ.100 కోట్ల సినిమా హీరోగా మారిపోయారు. ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.105.85 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. తొమ్మిదో రోజైన శుక్రవారం (మే 9) ఈ మూవీకి రూ.2.6 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
నెట్ కలెక్షన్లు ఇలా
రూ.40.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో హిట్ 3 మూవీకి రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి. నాని కెరీర్ లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. ఇక నెట్ కలెక్షన్ల ప్రకారం చూస్తే ఈ మూవీ 9 రోజుల్లో రూ.65.25 కోట్లు రాబట్టిందని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. తొమ్మిదో రోజు ఇండియాలో రూ.1.75 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని ఈ వెబ్ సైట్ అంచనా వేసింది.
ఆ మూవీస్ దెబ్బ
నాని ‘హిట్ 3’ సినిమా కలెక్షన్లను కొత్త సినిమాలు దెబ్బకొడుతున్నాయి. సమంత్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ ‘శుభం’, శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘సింగిల్’ మూవీ శుక్రవారం (మే 9) థియేటర్లకు వచ్చాయి. ఈ సినిమాల ఎఫెక్ట్ హిట్ 3 కలెక్షన్ల మీద పడింది. ఫ్యామిలీ హారర్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ‘శుభం’, ట్రయాంగిల్ కామెడా లవ్ స్టోరీ ‘సింగిల్’ సినిమాలకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
పవర్ ఫుల్ పోలీస్
విజయవంతమైన హిట్ ఫ్రాంఛైజీలో మూడో సినిమాగా హిట్ 3 వచ్చింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ గత రెండు హిట్ చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను ఎప్పుడో దాటేసింది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా నాని హీరోయిజం మరో లెవల్లో ఉంది. ఫుల్ యాక్షన్ మోడ్ లో క్రిమినల్స్ అంతు చూసే పోలీస్ ఆఫీసర్ గా నాని మెప్పించారు. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేసింది.
సంబంధిత కథనం