నిన్ను కోరి మే 9 ఎపిసోడ్: జగదీశ్వరి ఇంట్లో పెద్ద కోడలిగా అడుగుపెట్టిన చంద్రకళ- లగేజ్ సర్దుకున్న వరదరాజులు కుటుంబం

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 9 ఎపిసోడ్: జగదీశ్వరి ఇంట్లో పెద్ద కోడలిగా అడుగుపెట్టిన చంద్రకళ- లగేజ్ సర్దుకున్న వరదరాజులు కుటుంబం

 

నిన్ను కోరి సీరియల్ మే 10 ఎపిసోడ్‌లో వరదరాజులు కుటుంబం ఊరికి వెళ్లడానికి లగేజ్‌లు సర్దుకుని ఉంటుంది. అప్పుడే వచ్చిన చంద్రకళ మెడలో తాళిని చూసి అంతా షాక్ అవుతారు. ఇకనుంచి నువ్ ఆ జగదీశ్వరి కోడలివి అని సుభద్ర చెబుతుంది. జగదీశ్వరి ఇంటికి పెద్ద కోడలిగా చంద్రకళ అడుగుపెడుతుంది.

 
నిన్ను కోరి సీరియల్ మే 10 ఎపిసోడ్‌
 

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో చంద్రకళకు విరాట్ తాళి కడతాడు. ఇప్పుడు ఇది నేను మీ పెద్దనాన్నకు వేస్తున్న శిక్ష అని చెబుతాడు. ఇప్పుడు పరువు, మర్యాదలతో గౌరవంగా బతకమని, ఇప్పుడు మీ పెద్దనాన్న మొహాన్ని ఊరిలో చూపించమని విరాట్ అంటాడు.

 

ద్రోహానికి శిక్ష

ఏంటీ ఇలా చేశారు విరాట్ సర్. పెద్దనాన్న మీద కోపంతో నాకు తాళి కట్టడం ఏంటని అడుగుతుంది. ఇదే మీ కుటుంబానికి, మీరు చేసిన ద్రోహానికి శిక్ష అని విరాట్ అంటాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా చంద్రకళ మెడలో తాళికట్టడం చూసి అవాక్కై చూస్తుంటారు. ఆ తర్వాత గుడి నుంచి విరాట్ వెళ్లిపోతాడు. చంద్రకళ మాత్రం గుడి మెట్ల మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది.

విరాట్ తాళి కట్టడంపై బాధపడుతూ దిగాలుగా కూర్చుని ఉంటుంది చంద్రకళ. మెడలో తాళితో చంద్రకళ గుడిలో ఏకాంతంగా కూర్చొని బాధపడుతుంటే రోడ్డు మీద విరాట్ వెళ్లిపోవడాన్ని చూపిస్తుంటారు. ఆ తర్వాత కాసేపటికి విరాట్ ఇంటికి వెళ్తాడు. విరాట్ కోసం అంతా ఇంట్లో ఎదురుచూస్తుంటారు. అంతా కలిసి రఘురాం దగ్గర ఉంటారు. చంద్రకళతో ఏం మాట్లాడావ్, ఏం సమస్య పరిష్కరించావ్ అని జగదీశ్వరి విరాట్‌ను అడుగుతుంది.

ఊరికి వెళ్దామంటూ

ఇక వాళ్లకు క్షమించరాని శిక్ష వేశానని విరాట్ అంటాడు. అంటే, అర్థం కాలేదని ఇంట్లోవాళ్లు అంటారు. వాళ్ల పెద్దనాన్నకు, చంద్రకళకు, ఆ కుటుంబానికి అంతా కలిపి పెద్ద శిక్ష వేశానని గర్వంగా చెబుతాడు విరాట్. మరోవైపు వరదరాజులు ఇంట్లో అందరికి ఊరికి వెళ్లిపోదామని చెబుతుంటాడు. ఇక ఇక్కడ చేసేదేం లేదు. అంతా కలిసి మన ఊరికి వెళ్దాం అని వరదరాజులు అంటాడు. అంతా లగేజ్‌లు సర్దుకుని వరదరాజులు కుటుంబం ఉంటుంది.

 

ఇంతలో ఇంటికి చంద్రకళ వస్తుంది. చంద్రకళ మెడలో తాళి చూసి అంతా షాక్ అయిపోతారు. మెడలో ఆ తాళి ఏంటే, ఎవరు కట్టారు అని తల్లి నిలదీస్తుంది. దాంతో అది విరాట్ బావ గుడిలో కట్టాడని చంద్రకళ చెబుతుంది. దానికి మరింత అవాక్కవుతారు. వాడు తాళి కట్టడం ఏంటీ, నువ్ కట్టించుకోవడం ఏంటీ అని వరదరాజులు, శ్రీరాజ్ మండిపడతారు. ఆ తాళి తెంపేయమని శ్రీరాజ్ చంద్రకళతో అంటాడు.

జీవితానికి పడిన శిక్ష

అందుకు చంద్రకళ ఒప్పుకోదు. ఇది విరాట్ బావ మనకు వేసిన శిక్ష. కాదు మీరు చేసిన పనికి నా జీవితానికి పడిన శిక్ష అని చంద్రకళ అంటుంది. తాళి కట్టాడు కాబట్టి ఇక నుంచి విరాట్‌కి నువ్వు భార్యవి, జగదీశ్వరికి పెద్ద కోడలివి అని సుభద్ర అంటుంది. ఆ ఇంటి కోడలు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. మీ అత్తగారింట్లో ఉండటమే కరెక్ట్. కాబట్టి, ఇప్పుడే మీ అత్తింటికి వెళ్లు అని చంద్రకళతో సుభద్ర అంటుంది.

దానికి ఇంట్లోవాళ్లు షాక్ అవుతారు. తర్వాత కాసేపటికి అమ్మ చెప్పింది కరెక్ట్. నేను విరాట్ బావ భార్యను ఇప్పుడు. ఆ ఇంటి కోడలిని. నేను ఎలాంటి తప్పు చేయలేదని అక్కడ ఉండే నిరూపించుకుంటాను. అందుకు ఇదే సరైన మార్గం. రఘురాం మావయ్య విషయంలో పెద్దనాన్న, శ్రీరాజ్ అన్నయ్యల కుట్ర తప్ప ఇంకెవరు హస్తం లేదని నిరూపించాలంటే నేను ఆ ఇంటికి వెళ్లడమే కరెక్ట్ అని నిర్ణయించుకుంటుంది చంద్రకళ.

 

ఏం సంబంధం లేదని చెప్పానా

అలా అనుకున్న చంద్రకళ జగదీశ్వరి ఇంటికి వెళ్తుంది. చంద్రకళ ఇంటికి రావడంతో మళ్లెందుకు వచ్చావని అందరూ అడుగుతారు. విరాట్‌ను పిలిచి సమస్య పరిష్కారం చేశాను అన్నావ్. తనతో మాట్లాడాను అన్నావ్, ఏదో శిక్ష వేశానన్నావ్. మళ్లీ తనేందుకు వచ్చిందని జగదీశ్వరి అంటుంది. నేను చెప్పానా.. నీకు నాకు ఏ సంబంధం లేదని. వెళ్లిపో ఇక్కడి నుంచి అని విరాట్ అంటాడు.

ఈ ఇంటి పెద్దకోడలిగా అడుగుపెట్టాను. విరాట్ బావ భార్యగా అడుగుపెట్టాను అని చంద్రకళ అంటుంది. దానికి అంతా షాక్ అవుతారు. పెళ్లి కాకుండా ఈ ఇంటి పెద్దకోడలు ఎలా అవుతావు చంద్ర అని శాలిని అడుగుతుంది. దాంతో మెడలో ఉన్న తాళి తీసి చూపించి పెళ్లి జరిగిపోయింది శాలిని అని చంద్రకళ అంటుంది. దాంతో జగదీశ్వరి షాక్ అవుతుంది.

నువ్వే నా భర్తవి

చంద్రకళ మెడలో ఉన్న తాళి చూసి జగదీశ్వరి కుటుంబం అంతా అవాక్కవుతుంది. ఇక నుంచి విరాట్ బావే నా భర్త, నేనే విరాట్ బావ భార్య అని చంద్రకళ చెబుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 

Best Web Hosting Provider In India 2024