



Best Web Hosting Provider In India 2024

ఏపీ పాలిసెట్ 2025 ఫైనల్ ‘కీ’ విడుదల – రిజల్ట్స్ ఎప్పుడంటే..?
ఏపీ పాలిసెట్ – 2025 ఫైనల్ కీ వచ్చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు polycetap.nic.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మే 3వ వారంలో పాలిసెట్ ఫలితాలను ప్రకటించనున్నారు.
ఏపీ పాలిసెట్ – 2025 పరీక్షకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఇటీవలే ప్రాథమిక కీని విడుదల చేశారు. దీని వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో తాజాగా ఫైనల్ కీని విడుదల చేశారు. ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీ పాలిసెట్ 2025 కీ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- ఏపీ పాలిసెట్ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులు https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని నోటిఫికేషన్ కాలమ్ లో పాలిసెట్ ఫైనల్ కీ అని డిస్ ప్లే అవుతుంది.
- ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పై నొక్కితే పాలిసెట్ 2025 ప్రిలిమినరీ కీ డిస్ ప్లే అవుతుంది.
- పీడీఎఫ్ లో సెట్ల(ఏ,బీ,సీ,డీ) వారీగా కీని పొందుపరిచారు.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కీ కాపీని పొందవచ్చు.
ఫలితాలు ఎప్పుడంటే…?
ఏపీ పాలిసెట్ – 2025 ఫలితాల విడుదలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. మే మూడో వారంలో రిజల్ట్స్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ 2025 పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ను 120 మార్కులకు నిర్వహించారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. వీటితో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?
ఏపీ పాలిసెట్ – 2025 ఫలితాలను https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. ఫలితాలను అధికారికంగా విడుదల చేసిన తర్వాత… ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను ప్రకటించిన వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ షెడ్యూల్ ను ఏపీ సాంకేతిక విద్యా మండలి విడుదల చేస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్