




Best Web Hosting Provider In India 2024

ఫేమస్ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే..
హార్ట్ బీట్ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ఈ నయా సీజన్ స్ట్రీమింగ్ ప్రారంభ తేదీ అధికారికంగా వెల్లడైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
తమిళ వెబ్ సిరీస్ ‘హార్ట్ బీట్’ గతేడాది చాలా సక్సెస్ అయింది. ఈ మెడికల్ కామెడీ డ్రామా సిరీస్‍లో దీపా బాలు, అనుమోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులోనూ ఈ సిరీస్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. హార్ట్ బీట్ సీజన్ 2 సిరీస్ స్ట్రీమింగ్ స్టార్టింగ్ డేట్ ఖరారైంది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
హార్ట్ బీట్ సీజన్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మే 22వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో మొదలుకానుంది. ఆరోజు నుంచి ఈ సిరీస్‍లో ఎపిసోడ్లు వస్తాయి. “బీట్ కోసం నిరీక్షణ ముగిసింది. మే 22 ఈ డేట్‍ను సేవ్ చేసుకోండి. హార్ట్ బీట్ సీజన్ 2 మే 22వ తేదీ నుంచి జియో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జియో హాట్‍స్టార్.
ఆసుపత్రిలో సాగే స్టోరీ
హార్ట్ బీట్ వెబ్ సిరీస్ ఆర్కే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సాగుతుంది. ఆ ఆసుపత్రికి ఇంటెర్న్ డాక్టర్లుగా వచ్చే రీనా (దీపా బాలు), ఆమె సహచరులతో ఈ ఫస్ట్ సీజన్ సాగింది. ఓ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఆసుపత్రిలో పరిస్థితులు, రీనా ఎలా ముందుకు సాగిందన్న అంశాల చుట్టూ హార్ట్ బీట్ ఫస్ట్ సీజన్ నడిచింది. తొలి సీజన్‍లో 100 ఎపిసోడ్లు వచ్చాయి. మార్చిలో మొదలై ఆగస్టు వరకు అడుగుపెట్టాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ వచ్చింది.
హార్ట్ బీట్ రెండో సీజన్‍లో డాక్టర్ అవుతుంది రీనా. ఆమె కింద జూనియర్లు ఉంటారు. ఈ సీజన్ కూడా ఎక్కువగా ఫన్‍గానే ఉండనున్నట్టు అర్థమవుతోంది. అర్జున్‍తో రీనా లవ్‍లో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. మే 22 నుంచి జియో హాట్‍స్టార్ ఓటీటీలో రెండో సీజన్ స్ట్రీమింగ్ షూరూ కానుంది. ఈ రెండో సీజన్ తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నటీనటులు వీరే..
హార్ట్ బీట్ వెబ్ సిరీస్‍కు దీపక్ సుందర్ రాజన్, అబ్దుల్ కబీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపా బాలు, అనుమోల్‍తో పాటు చారుకేశ్, అమృత్ భార్గవ్, యోగలక్ష్మి, పడినే కుమార్, గురులక్ష్మణ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు శరణ్ రాఘవన్ సంగీతం అందిస్తున్నారు.
సంబంధిత కథనం