బ్రహ్మముడి మే 12 ఎపిసోడ్: కుమ్మక్కైన రుద్రాణి, యామిని- తల్లిపై రాజ్ అసహ్యించుకునేలా ప్లాన్- కావ్యకు మొదటి పెళ్లి పత్రిక!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 12 ఎపిసోడ్: కుమ్మక్కైన రుద్రాణి, యామిని- తల్లిపై రాజ్ అసహ్యించుకునేలా ప్లాన్- కావ్యకు మొదటి పెళ్లి పత్రిక!

బ్రహ్మముడి సీరియల్ మే 12 ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన రాజ్‌ను అవమానించి పంపించేస్తుంది కావ్య. ఆ మాటలు విన్న రుద్రాణి, రాహుల్ వెళ్లి యామినితో కుమ్మక్కవుతారు. తల్లిపై అసహ్యించుకునేలా కావ్య మోసం చేసిందనుకునేలా ప్లాన్ చేస్తారు. అలాగే, ఇంటికొచ్చి కావ్యకు మొదటి పెళ్లి పత్రిక ఇస్తారు యామిని, రాజ్.

 
బ్రహ్మముడి సీరియల్‌ మే 12వ తేది ఎపిసోడ్
 

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మీరు గతం గుర్తు చేయమని పట్టుబట్టారో అప్పుడే నేను పెద్ద తప్పు చేశాను. ఇక ఆ తప్పు చేయాలని లేదు. తనతో మాట్లాడను అని కావ్య అంటుంది. అలా ఎంతకాలం ఉంటావ్ అని కల్యాణ్ అంటాడు. ఆయనకు గతం గుర్తుకు వచ్చేంతవరకు అని కావ్య అంటుంది. మరి యామిని ఊరుకుంటుందా, పెళ్లి చేసుకుంటుందిగా అని అప్పు అంటుంది.

 

పెళ్లయ్యాక గతం గుర్తుకు వస్తే

అలా అని ఆయన ప్రాణాలతో ఆడుకోవాలా. ఆయనతో ఉండాలని నాకు ఉంది. కానీ, నిజం చెప్పి శాశ్వతంగా దూరం చేసుకోవడం కంటే ప్రాణాలతో ఉండటం మంచిది అని కావ్య అంటుంది. ప్రాణాలతో ఉంటాడు కానీ సంతోషంగా ఉండడు అని అప్పు అంటుంది. రేపు పెళ్లయ్యాక గతం గుర్తుకు వస్తే తన జీవితం ఏమైపోతుందో ఆలోచించు అని కల్యాణ్ అంటాడు. అలా అయినా వాడి జీవితం నాశనం అవుతుందిగా అని అపర్ణ అంటుంది.

వాడు ప్రాణాలతో ఉండాలి. అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉండాలి. అది నీతోనే జరుగుతుంది. ఇంకో తప్పు జరగకుండా వాడికి జాగ్రత్తగా గతం గుర్తుకు వచ్చేలా ప్రయత్నిద్దాం అని అపర్ణ, స్వప్న అంటారు. మేమంతా ఉన్నాం. ఫారెన్ నుంచి డాక్టర్స్‌ను పిలిపిద్దాం, ఏదోటి చేద్దాం అని అంతా చెబుతారు. దాంతో అందరిపై కోప్పడుతుంది కావ్య.

ఇక చాలు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్లిపోండి అని కావ్య అంటుంది. నా కోడలు నా కొడుకును తీసుకొస్తుంది అనుకున్నా. ఇలా చేశావేంటీ దేవుడా అని అపర్ణ మనసులో బాధపడుతుంది. ఇంతలో కావ్య ఇంటికి రాజ్ వస్తాడు. అది చూసి కావ్య షాక్ అవుతుంది. ఇప్పుడు అత్తయ్యను చూస్తే గుళ్లో నేను అబద్ధం చెప్పాను అని, మోసం చేశాను అనుకుంటారు అని కావ్య అంటుంది.

 

చూడాలని అనిపించలేదా

ఎందుకొచ్చారు అని కావ్య అడిగితే.. ఎలా ఉన్నావని అడుగుతారనుకున్నాను అని రాజ్ అంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రాహుల్, రుద్రాణి ఆ మాటలు విని ఆగిపోతారు. మీరు హాస్పిటల్‌కు ఎందుకు రాలేదు. మీరేంటో నాకు అర్థం కావట్లేదు. దగ్గరిగా ఉంటారు, వెంటనే ఒక శత్రువులా మాట్లాడుతారు. అప్పటివరకు కలిసి ఉన్న మనిషి హాస్పిటల్‌లో పడితే చూడాలని కూడా అనిపించలేదా. అంత పెద్ద తప్పు నేను ఏం చేశాను అని రామ్ అంటాడు.

చెప్పాల్సిన అవసరం నాకు లేదని కావ్య అంటుంది. ఇది మీరు కాదు. అసలు ఏమైంది. ఎందుకు రాలేదు. యామిని ఏమైనా అన్నదా. ఏది ఉన్న నేను చూసుకుంటాను అని రామ్ అంటాడు. ఏం మాట్లాడిన నాతో కలవడానికి ప్రయత్నిస్తారు. కష్టమైన కఠినంగా మాట్లాడిల్సిందే అని కావ్య అనుకుంటుంది. ఏంటండి నాలుగు సార్లు మాట్లాడితే మీ సొంత భార్యను నిలదీసినట్లు అడుగుతున్నారు. మీకు నాకు ఏం సంబంధం ఉందని మీకు నేను సమాధానం చెప్పాలి అని కావ్య అంటుంది.

మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఇలా అర్ధరాత్రి మా ఇంటికి వస్తే నా గురించి ఏం అనుకుంటారు అని కావ్య అంటుంది. నేను పరాయి వాడినా అని రాజ్ అడుగుతాడు. కాకపోతే మీరు నాకు ఏమవుతారు అని కావ్య అంటుంది. దాంతో కావ్య చేసినవి చెప్పి అలా ఎందుకు చేశారు అని అడుగుతాడు. ఇక చాలు ఆపండి. మా ఇంట్లో పనిచేసేవాళ్లతో కూడా చనువుగానే ఉంటాను. అంతమాత్రానా అందరూ నా వాళ్లు అయిపోతారా. మీరు మీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించండి అని కావ్య అంటుంది.

 

శాశ్వతంగా విడిపోయినట్లేనా

నా మంచితనాన్ని చనువుగా తీసుకుని మళ్లీ నాతో కలవాలని, మాట్లాడాలని ప్రయత్నిస్తే ఊరుకోను. వెళ్లిపోండి అని వెళ్లగొడుతుంది కావ్య. దాంతో రాజ్ బాధగా వెళ్లిపోతాడు. ఇది కదా మనకు కావాల్సింది. రాజ్ గాడు హాస్పిటల్‌లో పడేసరికి దీనికి భయం పుట్టినట్లు ఉంది. అందుకే ఇష్టమొచ్చినట్లు తిట్టి పంపించేసింది అని రుద్రాణి అంటుంది. వీళ్లిద్దరి శాశ్వతంగా విడిపోయినట్లేనా అని రాహుల్ అడుగుతాడు.

లేదు 50 పర్సెంట్ మాత్రమే విడిపోయారు. మిగతా 50 పర్సెంట్ విడగొట్టాలి. ఆ యామిని నుంచి నరుక్కొద్దాం అని రుద్రాణి అంటుంది. యామినిని రాహుల్, రుద్రాణి కలుస్తారు. ఇన్నాళ్లు మేము చేయని పని నువ్ చేశావు. మొదటిసారి ఆ కావ్యను అడ్డుకున్నావ్ అని రుద్రాణి అంటుంది. కావ్యపై పూర్తిగా గెలుచేశాను. ఇక రాజ్ జోలికి రాదు అని యామిని అంటుంది.

నువ్వే చూశావుగా ఇంటికి వచ్చిన రాజ్‌ను అవమానించి పంపించింది అని యామిని అంటుంది. ఆ కావ్య గురించి నీకు ముఖ్యమైన విషయం తెలియాలి. చివరి నిమిషం వరకు తాను ఓడిపోయినట్లుగానే నమ్మిస్తుంది. కానీ, చివరికి మనల్నే ఓడిస్తుంది. కావ్యకు కలిగిన భయం శాశ్వతంగా ఉండాలి. రాజ్‌కు గతం గుర్తుకు వస్తుందన్న ఆశ పూర్తిగా చచ్చిపోవాలి. దానికి కావ్యే మనకు ఆయుధం ఇచ్చింది అని రుద్రాణి అంటుంది.

 

పెళ్లి పత్రికల వంకతో

ఆరోజు గుడిలో తన అత్తయ్యను పరాయి వ్యక్తిలా రాజ్‌కు పరిచయం చేసింది. తనకున్న బంధాన్ని దాచిపెట్టింది. ఇప్పుడు గనుక రేపు పెళ్లి పత్రికలు ఇస్తున్న వంకతో అక్కడ అత్తాకోడళ్లు కలిసి ఉండటం చూసి రాజ్ షాక్ అవుతాడు అని రుద్రాణి అంటుంది. తనకు అబద్ధం చెప్పారను రాజ్ తన తల్లిని అసహ్యించుకుంటాడు. కావ్య మోసం చేసిందని అనుకుంటాడు. రేపే పెళ్లి పత్రికలతో మీ ఇంటికి వస్తాను అని యామిని అంటుంది.

కానీ, కావ్యకు పెళ్లి జరిగిందన్న విషయం తెలియకూడదు. తెలిస్తే పెళ్లి ఎవరితో అయిందో రాజ్ వెతుకుతాడు. అంటే తన గతాన్ని తానే వెతుక్కుంటాడు అని రుద్రాణి, రాహుల్ అంటారు. దాంతో రుద్రాణి చేయి కలిపి థ్యాంక్స్ చెబుతుంది యామిని. నాకో డౌట్ అని యామిని అంటే.. ఆ ఇంట్లో ఉండి ఇలా చేస్తున్నారనేగా.. నువ్ రాజ్‌ను ప్రేమించావ్. మేము ఆస్తిని ప్రేమించాం. వాన్ని శాశ్వతంగా తీసుకుపోతే ఆ ఆస్తి మాది అవుతుంది అని రుద్రాణి అంటుంది.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మనిద్దరి కల త్వరలోనే నిజం కాబోతుంది. రేపు దానికి శ్రీకారం చుట్టబోతున్నాం అని యామిని అంటుంది. మరుసటి రోజు ఉదయం రాజ్ దగ్గరికి వెళ్లి రాత్రి కళావతి గురించి కరెక్ట్ కాదని చెప్పాను. తనగురించి చెప్పడానికి నా దగ్గర ఫ్రూవ్ లేదు. తనేంటో తెలిసేలా నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. కావ్య ఆడే నాటకం ఏంటో నీకు చెప్పాలనుకుంటున్నాను అని యామిని అంటుంది.

 

అసలైన కథ మొదలు

నాతో ఒక్కసారి రా. నిన్ను ఎప్పుడు ఏది అడగను అని యామిని అంటుంది. రాత్రి వెళ్లినందుకే కళావతి గొడవ చేసింది. కనీసం మాట్లాడొచ్చు అని రాజ్ ఒప్పుకుంటాడు. ఇన్నాళ్లు తను మాట్లాడిన అబద్ధాలు అన్నీ నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను అని రాజ్‌ను తీసుకెళ్తుంది యామిని. రుద్రాణి, రాహుల్ ఎదురచూస్తుంటే యామిని, రాజ్ వస్తారు. ఇప్పుడు మొదలవుతుంది అసలైన కథ అని రుద్రాణి అంటుంది.

వాళ్లను చూసి కావ్య షాక్ అవుతుంది. చెప్పకుండా సైలెంట్‌గా మీ ఇంటికి వచ్చినందుకు ఆశ్చర్యపోతున్నావా. నీకు సర్‌ప్రైజ్ ఇద్దామని అని యామిని అంటుంది. మీరంత ఎందుకు షాక్ అవుతున్నారు అని యామిని అంటుంది. మా మొదటి పెళ్లి పత్రిక తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కళావతికి ఇద్దామనుకుంటున్నా అని యామిని అంటుంది. ఇంతలో అపర్ణ వస్తుంది.

కోపంగా వెళ్లిన రాజ్

తను గుడిలో కలిసిన ఆంటీనే కదా అని యామిని అంటుంది. అపర్ణను చూసిన రాజ్ ఆవిడ మీకు ముందే తెలుసా అని అడిగితే తెలుసు అని కావ్య అంటుంది. మీరు మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశారు అని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 

Best Web Hosting Provider In India 2024