ఓటీటీలోకి ఇండియాలో కల్యాణ్ రామ్ యాక్షన్ సినిమా ఈ వారమే రానుందా? హింట్ ఇదే!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇండియాలో కల్యాణ్ రామ్ యాక్షన్ సినిమా ఈ వారమే రానుందా? హింట్ ఇదే!

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ ఈవారంలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలోకి కల్యాణ్ రామ్ యాక్షన్ సినిమా ఈ వారమే రానుందా? హింట్ ఇదే!

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బాగా హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్, తల్లీకొడుకుల సెంటిమెంట్‍తో ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో మంచి అంచనాలతో ఏప్రిల్ 18న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ డిజాస్టర్ అయింది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఇక ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. ఈ వారమే రానుందని సమాచారం చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలివే..

స్ట్రీమింగ్ ఎక్కడంటే..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. రిలీజ్‍కు ముందే డీల్ జరిగింది. ఈ సినిమాను ఇండియాలో ఈ మే మూడో వారంలోనే స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ప్రైమ్ వీడియో భావిస్తోందట. డేట్‍పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

హింట్ ఇదే!

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా యూకేలో తాజాగా అందుబాటులోకి వచ్చింది. అక్కడ రెంటల్ విధానంగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇండియాలో ఈ మూవీ రెగ్యులర్ ఓటీటీ ఎంట్రీకి ఇది హింట్‍లా కనిపిస్తోంది. ఈ వారంలోనే ఆ చిత్రం ఇండియాలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

తల్లిపాత్రలో విజయశాంతి

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. హీరో కల్యాణ్ రామ్ తల్లిగా, ఐపీఎస్ అధికారిగా శక్తివంతమైన క్యారెక్టర్ పోషించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే కొడుకును నిలువరించేందుకు ప్రయత్నించే పాత్రలో మెప్పించారు. ఈ సినిమాలో కల్యాణ్ యాక్షన్‍, తల్లీకొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా ఉన్నాయి. ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.

బాక్సాఫీస్ నిరాశ

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ మూవీ సుమారు రూ.40కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనాలు ఉన్నాయి. ఫుల్ రన్‍లో ఈ మూవీ రూ.15కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. బడ్జెట్‍లో 50 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించాయి. అజ్నీశ్ లోకనాథ్ సంగీతం అందించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024