టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ.. నవ్విస్తూనే కంటతడి పెట్టించే సినిమా.. రాజమౌళి, రజనీకాంత్ మెచ్చిన ఈ మూవీ చూడాల్సిందే

Best Web Hosting Provider In India 2024

టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ.. నవ్విస్తూనే కంటతడి పెట్టించే సినిమా.. రాజమౌళి, రజనీకాంత్ మెచ్చిన ఈ మూవీ చూడాల్సిందే

Hari Prasad S HT Telugu

టూరిస్ట్ ఫ్యామిలీ.. మనల్ని చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తూనే కంటతడి పెట్టించే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఈ తమిళ కామెడీ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజమౌళి, రజనీకాంత్ లాంటి ప్రముఖులనే ఎంతగానో మెప్పించిన ఈ మూవీ ఎలా ఉందో చూడండి.

టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ.. నవ్విస్తూనే కంటతడి పెట్టించే సినిమా.. రాజమౌళి, రజనీకాంత్ మెచ్చిన ఈ మూవీ చూడాల్సిందే

మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్న ఈ కాలంలో ఓ శరణార్థిగా మన దేశానికిి వచ్చిన కుటుంబం.. తమ చుట్టూ ఉన్న వాళ్లలో ప్రేమానురాగాలను ఎలా నింపిందో చూపించేదే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ. వందల కోట్ల కలెక్షన్లంటూ ఫక్తు కమర్షియల్ సినిమాలనే నమ్ముకుంటున్న ఈ కాలంలో.. మానవ సంబంధాల విలువను చాటి చెబుతూ ఓ మంచి ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించడం సాహసమే అని చెప్పాలి.

కానీ ఆ సాహసంతోనే అదిరిపోయే విజయం అందుకున్నాడు దర్శకుడు అబిషన్ జీవింత్. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.85 కోట్లు వసూలు చేసిన ఈ టూరిస్ట్ ఫ్యామిలీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జియోహాట్‌స్టార్ ఓటీటీలో సోమవారం (జూ్ 2) నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

టూరిస్ట్ ఫ్యామిలీ స్టోరీ ఇదే..

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. ధర్మదాస్, వసంతి అనే పాత్రల్లో వీళ్లు కనిపించారు. శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన వీళ్లు అక్కడి సంక్షోభ పరిస్థితులను తట్టుకోలేక అక్రమంగా ఓ బోటు ద్వారా ఇండియాలోకి అడుగుపెడతారు. ఈలం తమిళ కుటుంబమైన వీళ్లు తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న వసంతి అన్న ప్రకాశ్ (యోగి బాబు) సాయంతో ఇక్కడ బతుకుతెరువు కోసం వస్తారు.

ఇక్కడికి రాగానే పోలీసులు వాళ్లను పట్టుకున్నా.. ధర్మదాస్, వసంతి చిన్న కొడుకు మురళి (కమలేష్ జగన్) తెలివితేటలతో వాళ్ల నుంచి తప్పించుకుంటారు. తర్వాత వాళ్లు కేశవ నగర్ అనే కాలనీలోకి వెళ్తారు. ఓ పోలీసు ఇంట్లోనే భయంభయంగా అద్దెకు దిగుతారు. అయితే తాము ఎన్ని కష్టాల్లో ఉన్నా.. బయటకు నవ్వుతూ, అందరితోనూ కలుపుగోలుగా ఉండే ఆ కుటుంబం కొన్ని రోజుల్లోనే ఆ కాలనీ వాసులకు దగ్గరవుతుంది.

ఈలోపు రామేశ్వరంలోనే ఓ బాంబు పేలుడు జరగడం, దానికి ఈ అక్రమంగా వలస వచ్చిన శ్రీలంక కుటుంబమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి? ఈ విపత్తు నుంచి వాళ్లు బయటపడతారా? చివరికి ఆ శరణార్థి కుటుంబం ఏం కానుంది అన్నది ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో చూడొచ్చు.

టూరిస్ట్ ఫ్యామిలీ.. ఎందుకు చూడాలంటే?

రాజమౌళి, రజనీకాంత్ లాంటి దిగ్గజాలకు కూడా తెగ నచ్చేసిన సినిమా ఈ టూరిస్ట్ ఫ్యామిలీ. కుటుంబం మొత్తం కలిసి హాయిగా చూసేయొచ్చు. లీడ్ రోల్స్ లో శశి కుమార్, సిమ్రన్ నటన ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. సినిమా మొత్తం నవ్విస్తూనే కంటతడి పెట్టిస్తాడు దర్శకుడు అబిషన్ జీవింత్. అతనికి ఇది తొలి సినిమా అయినా కూడా చాలా అనుభజ్ఞుడైన దర్శకుడిలా మూవీని తెరకెక్కించిన తీరు అద్భుతమనే చెప్పాలి.

అసలు ఎవరికెవరు ఈ లోకంలో అనేలా బతికేస్తున్న వారిని.. పుట్టెడు కష్టంలో పొట్ట చేత పట్టుకొని శరణార్థులుగా వచ్చిన ఆ తమిళ కుటుంబం ఎలా ఒక్కటి చేస్తుందన్నదే ఈ సినిమాలో అసలు పాయింట్. మన మనసును మెలిపెట్టే సీన్లు ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా క్లైమ్యాక్స్ మొత్తం సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. కేవలం 35 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ లో బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎందుకంత సక్సెస్ సాధించిందో మూవీ చూస్తే తెలుస్తుంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా వీలున్నప్పుడు కచ్చితంగా చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024