





Best Web Hosting Provider In India 2024

పంచాయత్ సీజన్ 4 నచ్చిందా? అలాంటి ఆసక్తి రేపే వెబ్ సిరీస్ లే ఇవి.. ఓటీటీలో వీటిపై ఓ లుక్కేయండి
లేటెస్ట్ పొలిటికల్ కామెడీ డ్రామా పంచాయత్ సీజన్ 4 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మీకు నచ్చిందా? అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కలిగించే వెబ్ సిరీస్ లు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇక్కడున్నాయి. అవి ఏంటీ? ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేయండి.
జితేంద్ర కుమార్-నీనా గుప్తా కాంబినేషన్లో వచ్చిన పంచాయత్ సీజన్ 4 ఎట్టకేలకు ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందనతో దూసుకుపోతోంది. మంగళవారం (జూన్ 24) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ పొలిటికల్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ను చూసేశారా? ఇది మీకు నచ్చి, ఇంకేం చూడాలి అనుకునే ఫ్యాన్స్ కోసం ఈ లిస్ట్. పంచాయత్ సీజన్ 4లో ఎన్నికల కారణంగా ఉద్రిక్త వాతావరణం, మంచి పాతకాలాన్ని ఆస్వాదించాలని లేదా ప్రతి క్షణం తెచ్చిన సస్పెన్స్ ఇష్టపడినా.. ఇలా ప్రతి విషయంలో ఓ వెబ్ సిరీస్ ఉంది. ఓటీటీ ప్లే ప్రీమియంలో మీరు ఈ వెబ్ సిరీస్ లు చూడొచ్చు.
రంగ్ బాజ్: దార్ కి రాజ్ నీతి
వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన రంగ్ బాజ్.. కుర్చీ పవర్ కు సంబంధించిన వెబ్ సిరీస్. పంచాయత్ తరహాలోనే అవినీతిపరులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల అండదండలతో అధికారంలోకి వచ్చే ఓ వ్యక్తి కథ ఇది. భయంకరమైన గ్యాంగ్ స్టర్ అయినప్పటికీ, రాజకీయ నాయకుడిగా మారిన వైనం, అతను చేసే పనుల తదితర ఇంట్రెస్టింగ్ అంశాలతో రంగ్ బాజ్ సాగుతుంది.
సన్ ఫ్లవర్
డార్క్-కామెడీ మీకు ఇష్టమా? అలాంటి వెబ్ సిరీస్ చూడాలని ఉందా? అయితే సన్ ఫ్లవర్ సిరీస్ మీకోసమే. సునీల్ గ్రోవర్ నటించిన ఈ సిరీస్ కచ్చితంగా అలరిస్తుంది. పల్లెటూరిలో రాజకీయం, దురుద్దేశాలు తదితర అంశాలతో సాగే ఈ కథ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది.
పైథానీ
పల్లెటూరులోని నిరాడంబరత, మన మూలాలకు తిరిగి వెళ్లడమే మీరు కోరుకునేది అయితే, పైథానీ మీరు తప్పక చూడవలసిన వెబ్ సిరీస్. పైథానీ చీర సున్నితమైన తయారీ చుట్టూ అల్లుకున్న ఈ కథ మానవ సంక్లిష్టతలను కళాకృతులతో మేళవించి తీసిన కథ.
దురంగ
పంచాయత్ సీజన్ 4లో బన్రాకస్ క్యారెక్టర్ ను ఇష్టపడ్డరా? అయితే మీకు దురంగ సిరీస్ ను కూడా లైక్ చేస్తారు. దష్టి ధామి, గుల్షన్ దేవయ్య, అమిత్ సాధ్ నటించిన ఈ సిరీస్ ట్విస్ట్ లతో నిండిన గతం.. ప్రస్తుతం వర్తమానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే కథ చుట్టూ తిరుగుతుంది.
ది బ్రోకెన్ న్యూస్
పంచాయితీ సీజన్ 4 లోని హాట్ మూమెంట్స్ మిమ్మల్ని థ్రిల్ చేశాయా? అయితే మీరు ది బ్రోకెన్ న్యూస్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ప్రత్యర్థి న్యూస్ ఛానెళ్ల గురించి ఈ సిరీస్ ఉంటుంది. ఒకే విషయంలో వారికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అందరి భవితవ్యం సమతూకంలోనే ఉందంటూ సిరీస్ సాగుతుంది.
సంబంధిత కథనం