హార్దిక్‌ పాండ్యను ఒకట్రెండు సార్లు క‌లిశా.. డేటింగ్‌కు ముందే బ్రేక‌ప్‌.. ల‌వ్‌స్టోరీపై బోల్డ్ బ్యూటీ ఇషా హాట్ కామెంట్లు

Best Web Hosting Provider In India 2024

హార్దిక్‌ పాండ్యను ఒకట్రెండు సార్లు క‌లిశా.. డేటింగ్‌కు ముందే బ్రేక‌ప్‌.. ల‌వ్‌స్టోరీపై బోల్డ్ బ్యూటీ ఇషా హాట్ కామెంట్లు

బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తో డేటింగ్, లవ్ పై హాట్ కామెంట్లు చేసింది. హార్దిక్ ను రెండు మూడు సార్లు కలిసినట్లు పేర్కొంది.

ఇషా గుప్తా, హార్దిక్ పాండ్య

టీమిండియా ఆల్ రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా మధ్య ప్రేమాయణం గురించి కొంతకాలంగా ఎడతెగని చర్చ సాగుతోంది. వీళ్లు డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు బలంగా వినిపించాయి. వీళ్లు ఒకట్రెండు సార్లు బయట కలిసి కనిపించారు కూడా. కానీ హార్దిక్ పాండ్యతో రిలేషన్ షిప్ గురించి ఇషా రీసెంట్ గా ఓపెన్ అయింది. డేటింగ్ కు ముందే తమ రిలేషన్ షిప్ బ్రేకప్ అయిందని హాట్ కామెంట్లు చేసింది.

ఆ ఇంటర్వ్యూలో

సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్య తో లవ్, డేటింగ్ గురించి ఇషా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. “అవును, కొంతకాలం మేము మాట్లాడుకున్నాం. మేము డేటింగ్ చేస్తున్నామని నేను అనుకోను. అది డేటింగ్ కావచ్చు, కాకపోవచ్చు అనే స్టేజ్ లో ఉండేవాళ్లం. కానీ డేటింగ్ దశకు చేరుకునే ముందే రిలేషన్ షిప్ బ్రేకప్ అయింది. కాబట్టి అది డేటింగ్ కాదు. మేం ఒకట్రెండు సార్లు కలిశాం. మా మధ్య బంధం రెండు నెలల్లోనే ముగిసింది’’ అని ఇషా చెప్పింది.

సంబంధం సాధ్యమేనా?

అయితే హార్దిక్ పాండ్యతో రిలేషన్ షిప్ సాధ్యమేనా అని అడిగినప్పుడు.. ‘‘కావచ్చు. కానీ విషయాలు త్వరగా ముగిశాయి. మాకు టైమ్ లేదు. పరిస్థితులూ అనుకూలించలేదు. ఇందులో ఎలాంటి డ్రామా లేదా చేదు లేదు. అది జరగాల్సింది కాదు” అని ఇషా తెలిపింది. మొదట సెర్బియన్ బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ ను పెళ్లి చేసుకున్నాడు హార్దిక్. వీళ్లకు ఓ బాబు ఉన్నాడు. ఈ జోడీ 2024 నుంచి సెపరేట్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇషా గుప్తాతో కలిసి హార్దిక్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

ఆ కామెంట్లపై

గతంలో ‘కాఫీ విత్ కరణ్’లో మహిళల పట్ల హార్దిక్ అనుచితంగా చేసిన వ్యాఖ్యలపైనా ఇషా గుప్తా రియాక్టయింది. ఇప్పుడు అతనితో రిలేషన్ షిప్ లో లేను కాబట్టి ఆ కామెంట్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించదని ఇషా గుప్తా చెప్పింది. అయితే 2019లో ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు.. హార్దిక్ ను ఓపెన్ గా విమర్శించిన కొద్దిమంది సెలబ్రిటీల్లో ఇషా గుప్తా కూడా ఉంది.

ఇషా చివరిగా ఎంఎక్స్ ప్లేయర్‌ ఓటీటీ కోసం బాబీ డియోల్ తో కలిసి ‘ఎక్ బద్నాం ఆశ్రమ్ 3 పార్ట్ 2’లో కనిపించింది. ఆమె ‘వన్ డే: జస్టిస్ డెలివర్డ్’లో డీసీపీ లక్ష్మీ రాధి పాత్రను కూడా పోషించింది. ఆమె ‘హేరా ఫెరి 3’ లోనూ యాక్ట్ చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024