ఇండ‌స్ట్రీలో మంచిత‌నం అంటే ఆ ఇద్ద‌రే గుర్తుకొస్తారు – డొక్కా సీత‌మ్మ బ‌యోపిక్ గ్లింప్స్ రిలీజ్‌

Best Web Hosting Provider In India 2024

ఇండ‌స్ట్రీలో మంచిత‌నం అంటే ఆ ఇద్ద‌రే గుర్తుకొస్తారు – డొక్కా సీత‌మ్మ బ‌యోపిక్ గ్లింప్స్ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu

ఆమ‌ని, ముర‌ళీమోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆంధ్రుల అన్న‌పూర్ణ డొక్కా సీత‌మ్మ‌. పేరుతో ఓ బ‌యోపిక్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీకి టీవీ ర‌వి నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ముర‌ళీమోహ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అత‌డి ఫ‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌ల మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఆంధ్రుల అన్న‌పూర్ణ డొక్కా సీత‌మ్మ‌ మూవీ

మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న మూవీ ఆంధ్రుల అన్న‌పూర్ణ డొక్కా సీత‌మ్మ‌. వల్లూరి రాంబాబు , మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఇటీవ‌ల మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయ‌న స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో..

జీవిత క‌థ‌తో…

మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ జీవిత క‌థ‌తో సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ను పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే సైతం డొక్కా సీతమ్మ వెళ్లలేదు. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని డొక్కా సీతమ్మ నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

టైటిల్ పాత్ర‌లో ఆమ‌ని…

దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ .. ‘డొక్కా సీత‌మ్మ క‌థ‌తో సినిమా చేయాల‌ని అనుకున్న క్ష‌ణం నుంచి మురళీ మోహన్ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ బ‌యోపిక్‌ ఇక్కడి వరకు వచ్చింది. డొక్కా సీత‌మ్మ పాత్ర‌కు ఆమ‌ని వంద‌శాతం న్యాయం చేసింది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఈ బ‌యోపిక్ మూవీ మెప్పిస్తుంది” అని పేర్కొన్నారు.

ఆ ఇద్ద‌రే గుర్తొస్తారు…

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..‘డొక్కా సీతమ్మ గురించి మేం చదువుకునే రోజుల్లో చాలా విన్నాం. ఇక ఆమె కథతో సినిమా తీస్తున్నారని తెలియడంతో ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. ఇండస్ట్రీలో మంచితనం అంటే సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మా గురువు దాసరి గారు అయితే మురళీ అంటూ కొడుకుని పిలిచినట్టుగా ప్రేమగా పిలుస్తుండేవారు’ అని అన్నారు.

డొక్కా సీత‌మ్మ మూవీలో మురళీ మోహన్, ఆమని, రాజమౌళి, ఆకెళ్ల, జబర్దస్త్ అప్పారావు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024