కన్యత్వం ఒక్క రాత్రిలోనే పోతుంది.. వర్జిన్ వైఫ్ కోసం వెతకొద్దు: ప్రియాంకా చోప్రా కామెంట్స్ అని వార్తలు.. ఆమె వివరణ ఇదీ

Best Web Hosting Provider In India 2024

కన్యత్వం ఒక్క రాత్రిలోనే పోతుంది.. వర్జిన్ వైఫ్ కోసం వెతకొద్దు: ప్రియాంకా చోప్రా కామెంట్స్ అని వార్తలు.. ఆమె వివరణ ఇదీ

Hari Prasad S HT Telugu

ప్రియాంకా చోప్రా తాను అన్నట్లుగా వస్తున్న మాటలను ఖండించింది. కన్యత్వం ఉన్న భార్య కోసం ఎదురు చూడటం మానేయాలని తాను సూచించినట్లు వస్తున్న వార్తలపై ఆమె మండిపడింది. తాను అలా అనలేదని స్పష్టం చేసింది.

కన్యత్వం ఒక్క రాత్రిలోనే పోతుంది.. వర్జిన్ వైఫ్ కోసం వెతకొద్దు: ప్రియాంకా చోప్రా కామెంట్స్ అని వార్తలు.. ఆమె వివరణ ఇదీ

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మనుషుల వాయిస్, ముఖాలను కూడా సృష్టించగలిగే ఈ రోజుల్లో, సెలబ్రిటీలు తప్పుడు సమాచారం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. నటి ప్రియాంక చోప్రా జోనస్ కూడా ఇలాంటి ఒక తప్పుడు ప్రచారానికి తాజాగా అడ్డుకట్ట వేసింది.

‘ది బ్రీఫ్ ఇండియా’ అనే పేజీ ప్రియాంక పేరుతో ఒక తప్పుడు కొటేషన్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. “భార్యగా కన్యత్వం ఉన్న అమ్మాయి కోసం వెతకొద్దు. మంచి ప్రవర్తన ఉన్న స్త్రీని చూసుకోండి. కన్యత్వం ఒక్క రాత్రిలో ముగుస్తుంది కానీ మర్యాద జీవితాంతం ఉంటుంది” అని ఆ కొటేషన్‌లో ఉంది.

ప్రియాంక చోప్రా ఆగ్రహం

తాను ఈ కామెంట్స్ చేసినట్లుగా వస్తున్న వార్తలపై ప్రియాంకా చోప్రా వెంటనే స్పందించింది. గురువారం (జూన్ 26) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ పోస్ట్‌ను ఖండించింది. “ఇది నేను చెప్పిన మాట కాదు, నా కొటేషన్ కాదు, నా వాయిస్ కాదు. ఆన్‌లైన్‌లో ఉన్నదంతా నిజం కాదు. నకిలీ కంటెంట్‌ను సృష్టించడం ఇప్పుడు వైరల్ అవ్వడానికి సులభమైన మార్గం” అని ఆమె రాసింది.

అంతేకాకుండా, ఆన్‌లైన్‌లో కనిపించే కంటెంట్‌ను నమ్మే ముందు, షేర్ చేసే ముందు విమర్శనాత్మకంగా ఆలోచించమని తన ఫాలోవర్స్‌కు సూచించింది. “ఈ వార్తకు లేదా ఆన్‌లైన్‌లో ఉన్న అనేక ఇతర వాటికి జతచేసిన లింక్‌లు లేదా సోర్సెస్ ఏవీ నిజమైనవి లేదా నమ్మదగినవి కావు. అలాంటి కంటెంట్‌ను క్రాస్-చెక్ చేయడానికి ఒక నిమిషం సమయం తీసుకోండి. మీరు స్క్రోల్ చేసిన ప్రతిదాన్ని నమ్మకండి. ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి” అని ఆమె స్పష్టం చేసింది.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..

ప్రియాంకా చోప్రా సూటిగా ఇచ్చిన ఈ సమాధానం రెడిట్, ఇతర సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో వెంటనే ప్రశంసలు అందుకుంది. “ఆమె ఇలా ఖండించడం మంచి విషయం” అని ఒక కామెంట్ రాగా, మరొకరు “మరింత మంది సెలబ్రిటీలు ఇలాంటి చెత్తను ఖండించాలి. ముఖ్యంగా టామ్ హార్డీ, సిలియన్ మర్ఫీ. వారు ఎప్పుడూ చెప్పని ‘డార్క్’ ఎడ్జీ టెక్స్ట్ ముందు వారి కొటేషన్లు చూడటం నాకు విసుగు తెప్పిస్తోంది” అని అన్నారు.

మరికొందరు సెలబ్రిటీల సినిమాల ముందే ఇలాంటి ఫేక్ ప్రచారాలు వస్తుండటంపై సందేహాలు వ్యక్తం చేశారు. అంటే వాటి ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు చేయడం గమనార్హం. నిజానికి ఇప్పుడు ప్రియాంకా హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే యాక్షన్ కామెడీ సినిమాతో రాబోతోంది. ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. దీంతో ఆమెపై ఇప్పుడిలా తప్పుడు ప్రచారం రావడం, దానిని ఆమె ఖండించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రియంకా ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ29లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024