ఈ రోజే ఓటీటీలోకి పాపులర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్క్విడ్ గేమ్ సీజన్ 3.. ఇండియాలో ఎప్పుడు చూడొచ్చంటే?

Best Web Hosting Provider In India 2024

ఈ రోజే ఓటీటీలోకి పాపులర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్క్విడ్ గేమ్ సీజన్ 3.. ఇండియాలో ఎప్పుడు చూడొచ్చంటే?

ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. థ్రిల్ తో ఆడియన్స్ ను ఊపేసే పాపులర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఈ రోజే ఓటీటీలోకి రానుంది. ఇండియాలో ఈ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ చూద్దాం.

ఓటీటీలోకి స్క్విడ్ గేమ్ సీజన్ 3 (X)

ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ కు మంచి అనుభూతిని అందించి.. పాపులర్ వెబ్ సిరీస్ ల్లో ఒకటిగా నిలిచిన స్క్విడ్ గేమ్ నుంచి లాస్ట్ సీజన్ వచ్చేస్తోంది. ఈ రోజే (జూన్ 27) నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ కానుంది. మరి ఇండియాలో ఈ సిరీస్ ను ఏ టైమ్ కు చూడొచ్చంటే?

మధ్యాహ్నం నుంచి

థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. అమెరికాలో అర్ధరాత్రి 12 గంటలకు ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. దీని ప్రకారం ఇండియాలో ఈ పాపులర్ వెబ్ సిరీస్ ను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి చూడొచ్చు. మధ్యాహ్నం నుంచి ఇండియాలోని ఆడియన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ చూసే అవకాశముంది. ఇంకెందుకు లేటు ఈ సిరీస్ ను వీక్షించేందుకు రెడీ అయిపోండి మరి.

తీవ్ర ఉత్కంఠ

స్క్విడ్ గేమ్ సీజన్ 3 గురించి ఆడియన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా సీజన్ 2 క్లైమాక్స్ లో గి-హున్ (లీ జంగ్-జే పోషించిన పాత్ర), మిగిలిన ఆటగాళ్ల భవితవ్యం ఏంటా అనే ప్రశ్న రేకెత్తింది. దీంతో ఈ లాస్ట్ సీజన్ ను చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్లేయర్ 456 ఎట్టకేలకు ఫ్రంట్ మ్యాన్ నిజస్వరూపాన్ని బయటపెడతాడా? ప్రాణాంతక పరీక్షలు జరిగే ద్వీపాన్ని వెలికితీసే తన మిషన్లో జున్-హో చివరికి విజయం సాధిస్తాడా? చూడాలి.

ఎవరెవరంటే?

స్క్విడ్ గేమ్ సీజన్ 3లో లీ జంగ్-జే, లీ బ్యూంగ్-హున్, వి హా-జూన్, పార్క్ సంగ్-హూన్, కాంగ్ హా-న్యూల్, కాంగ్ ఏ-షిమ్, పార్క్ గ్యూ-యంగ్, యాంగ్ డాంగ్-గ్యూన్, జో యు-రి, రోహ్ జే-వోన్ తదితరులు నటించారు. ఈ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ కు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ సెప్టెంబర్ 2021 లో వచ్చింది. ఇది విమర్శకుల ప్రశంసలు, అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

మోస్ట్ వాచ్‌డ్‌

నెట్‌ఫ్లిక్స్‌ లో మోస్ట్ వాచ్‌డ్‌ వెబ్ సిరీస్ ల్లో ఒకటిగా స్క్విడ్ గేమ్ నిలిచింది. ఆరు ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డులతో సహా అనేక ప్రశంసలను గెలుచుకుంది. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో స్క్విడ్ గేమ్ సీజన్ 2 విడుదలైంది. రెండవ సీజన్ విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. వారు నటనను, అంతర్లీన సందేశాలను ప్రశంసించారు కాని కథాంశాన్ని విమర్శించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024