



Best Web Hosting Provider In India 2024

TG SSC Advanced Supplementary Results 2025: తెలంగాణ ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల
TG SSC Advanced Supplementary Results 2025: నేడు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. రిజల్ట్స్ లభ్యమయ్యే అధికారిక సైట్ వివరాలు, డైరెక్ట్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
హైదరాబాద్: తెలంగాణ ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు (జూన్ 27, 2025) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 03:00 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు.
టీజీ ఎస్‌ఎస్‌సి సప్లిమెంటరీ ఫలితాలు 2025: విడుదలైన తర్వాత ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
టీజీ ఎస్‌ఎస్‌సి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు కింది దశలను అనుసరించి తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్ పేజీలో, “TG SSC ASE Result 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ వివరాలను (credentials) నమోదు చేసి లాగిన్ అవ్వండి.
- స్క్రీన్‌పై మీ రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది.
- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసి ఉంచుకోండి.
ఈ పరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13, 2025 వరకు నిర్వహించారు. పదవ తరగతి మార్కులను మెరుగుపరచుకోవాలనుకునే విద్యార్థులకు ఇది మరో అవకాశంగా ఉపయోగపడింది.
టీఎస్ ఎస్‌ఎస్‌సీ 10వ తరగతి ఫలితాలు 2025 ఏప్రిల్ 30, 2025న ప్రకటించారు. ఈ సంవత్సరం రెగ్యులర్ అభ్యర్థులకు మొత్తం ఉత్తీర్ణత శాతం 92.78 శాతంగా నమోదైంది. అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 91.32 శాతం కాగా, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 94.26 శాతంగా ఉంది.
టీఎస్ ఎస్‌ఎస్‌సి మార్చి పరీక్షలో మహబూబాబాద్ జిల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోకెల్లా 99.29 శాతం ఉత్తీర్ణత రేటుతో ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
మరిన్ని వివరాల కోసం, విద్యార్థులు బీఎస్‌ఈ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
టాపిక్