





Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుపై అందరి టార్గెట్- కామాక్షి కోపం కోడ్- మీనా టెస్ట్‌లో బాలు పాస్-ఫంక్షన్‌లో గొడవ
గుండె నిండా గుడి గంటలు జూన్ 27 ఎపిసోడ్‌లో శ్రుతి నల్లపూసల ఫంక్షన్‌లో అటు రోహిణి, ఇటు శోభన, సురేంద్ర అంతా బాలునే టార్గెట్ చేస్తారు. బాలుతో గొడవ చేయించి ఫంక్షన్ చెడగొట్టేలా ప్లాన్ చేస్తారు. సత్యంను కాలితో తాకి ఒకరు అవమానిస్తారు. బాలుకు కోపం రాకుండా కామాక్షి కోడ్ చెబుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నల్లపూసల వేడుక జరిగే ఫంక్షన్ హాల్‌కు సత్యం కుటుంబం వస్తుంది. ప్రభావతి హడావిడి చేస్తుంది. బాలు నువ్వేందుకురా తలొంచుకుని వస్తున్నావ్ అని కామాక్షి అంటుంది. దాంతో తాను మాట్లాడకూడదు అన్నట్లుగా సైగ చేస్తాడు బాలు.
సౌండ్ చేయకుండా
ముందుకు పడితే మూతి పళ్లు రాలాయ. అయ్యయ్యో. పళ్ల సెట్టు కొనుక్కునే టైమ్ లేదా అని కామాక్షి అంటుంది. సరే పదండి అని ప్రభావతి తీసుకెళ్తుంది. మీ నాన్న ఇంకా రాలేదా అని రోహిణిని మనోజ్ అడిగితే.. వస్తున్నారు అని చెబుతుంది. కారులా ఫంక్షన్ అయిపోయేవరకు సౌండ్ చేయకూడదని బాలుకు చెబుతుంది మీనా. తండ్రిని వెళ్లి హగ్ చేసుకుంటుంది శ్రుతి.
సత్యం అని సురేంద్ర పిలిస్తే అంతా షాక్ అవుతారు. శోభన చూడటంతో నమస్కారం బావగారు అని సురేంద్ర అనేసరికి అంతా అవాక్కవుతారు. రోహిణి తరఫు వాళ్లు రాలేదా అని శోభన అడుగుతుంది. వస్తున్నారని చెబుతాడు మనోజ్. తర్వాత ఈ బాలు గాడి వల్లే మనకు కావాల్సింది అని సురేంద్రతో శోభన అంటుంది. మనోజ్‌కు తన పార్క్ ఫ్రెండ్ కనిపించాడని, పది రూపాయల పల్లీల డబ్బుల ఇవ్వాలని, వసూలు చేసుకొస్తానని వెళ్లిపోతాడు మనోజ్.
ఇంతలో రోహిణి భుజాలపై చేయి వేసి ఫ్రెండ్ విద్య వస్తుంది. అన్నీ రెడీనా అని అడిగితే విద్య రెడీ అంటుంది. శ్రుతిని చీర కట్టుకోమ్మని శోభన చెబుతుంది. మీనాను హెల్ప్ చేయమంటే శోభన వద్దంటుంది. మీ ఆయన చూస్తే గొడవ చేస్తాడని అంటుంది. దాంతో మీనా నొచ్చుకుంటుంది. బాలు వెళ్లి వెనకాల కూర్చొంటాడు. రవి ముందుకు రమ్మంటే సాష్టాంగ నమస్కారం పెడుతూ రానని సైగలతో చెబుతాడు రవి.
కోడ్ పెట్టుకుందాం
బాలు నీకు కోపం రాగానే బంగారం రేటు బాగా పెరిగింది అంటే నీకు కోపం పెరిగినట్లు, నువ్ తగ్గిందంటే కోపం తగ్గినట్లు కోడ్ పెట్టుకుందామని కామాక్షి చెబుతుంది. ఇంతలో సత్యం ఫ్రెండ్ రంగా వస్తాడు. సత్యం, రంగా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్లే మనం అనుకున్నట్లు చేయి అని ఒకతన్ని పంపిస్తాడు సురేంద్ర. అతను కాలు మీద కాలు వేసుకుని సత్యంకు తగిలేలా చేస్తాడు.
దాంతో సత్యం పక్కకు తప్పుకుంటాడు. వీడేంటీ ఇలా చేస్తున్నాడన రంగా అంటే సురేంద్ర నన్ను అవమానించాలని చూస్తున్నాడు. బాలుగాడు చూస్తే గొడవ అవుతుంది అని సత్యం అంటాడు. సింపుల్‌గా చేస్తారనుకుంటే శ్రుతితో చేస్తూ నన్ను అడ్డంగా బుక్ చేశారు. మా నాన్నకు పిలవమని మా అత్త టార్చర్ పెడుతుంది. ఎలా మ్యానేజ్ చేయాలో తెలియట్లేదు అని విద్యతో రోహిణి అంటుంది.
ఇంతలో ప్రభావతి వచ్చి త్వరగా రెడీ అవ్వమని అంటుంది. మీ నాన్న ఎప్పుడొస్తాడు అని ప్రభావతి అడుగుతుంది. ఫ్లైట్ ఎక్కారట, ముహుర్తం టైమ్‌కు వస్తారని రోహిణి అంటుంది. ఇంకా ఎక్కారు దిగారు అని చెబుతున్నావ్. మనిషి మాత్రం కనపడట్లేదు. తండ్రి బాధ్యత అసలు గుర్తుందా ఆయనకు. ఓసారి ఆయనకు ఫోన్ చేయమని ప్రభావతి అంటే రోహిణి కాల్ చేస్తుంది.
మందు తాగిస్తాడు
నాట్ రీచబుల్ వస్తుందని రోహిణి చెబుతుంది. దాంతో ప్రభావతి వాళ్లు వెళ్లిపోతారు. మీ అత్త అంత హార్ష్‌గా మాట్లాడుతుంది అని విద్య అంటుంది. మనం అనుకున్న ప్లాన్ అమలు చేయాలి. ఎంతవరకు వచ్చింది ప్లాన్ అని రోహిణి అంటుంది. బాలు ఒక్కడి వల్లే సేవ్ అవుతావని విద్య అంటుంది. బాలును ఇద్దరు చూస్తారు. ఇంతకీ నువ్ సెట్ చేసిన అతను వస్తున్నాడా అని రోహిణి అడుగుతుంది.
వస్తున్నాడు. ఎలాగైనా బాలుతో మందు తాగిస్తాడు అని విద్య అంటుంది. బాలు తాగితే చాలు అల్లకల్లోలం చేస్తాడని రోహిణి అంటుంది. అటు శోభన, సురేంద్ర, ఇటు రోహిణి అంతా బాలునే టార్గెట్ చేస్తారు. బాలును ఇరిటేట్ చేయడానికి ఇద్దరిని రప్పిస్తున్నాను. వాళ్లు బాలును రెచ్చగొడితే వాడు కోపంతో కొడతాడు. అప్పుడు అంతా వాడిని ఛీ కొడతారు. దాంతో గొడవ చేసి మనం మన కూతురు, అల్లుడిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇది మన ప్లాన్ అని శోభన చెబుతుంది.
బాలునే టార్గెట్
ఇంతలో చుట్టాలు వచ్చి పలకరిస్తే బాలు మాట్లాడడు. దాంతో వాళ్లు కోపంతో వెళ్లిపోతారు. మీరు మాట్లాడిన మాట్లాడకున్న సమస్యగా ఉంది పాపం అని చక్కిలిగింతలు పెట్టి గిల్లుతుంది మీనా. కానీ, బాలు మాట్లాడడు. మీ ఓపికకు టెస్ట్ పెట్టాను. మీరు పాస్ అయ్యారని మీనా అంటుంది. విద్య ఏర్పాటు చేసిన అతను, శోభన మాట్లాడిన ఇద్దరు అంతా వస్తారు.
అంతా కలిసి బాలును టార్గెట్ చేస్తారు. బాలు కాలు తొక్కుకుంటూ ఒకడు వెళ్తే బాలు కోపంగా కళ్లు దొబ్బాయా అని గొడవ పెట్టుకుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్