



Best Web Hosting Provider In India 2024

కన్నప్ప రివ్యూ – మంచు విష్ణుకు హిట్ దక్కిందా? ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోయిందా?
మంచు విష్ణు కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమాగా తెరకెక్కిన కన్నప్ప శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించడంతో సినిమాపై భారీగా అంచానాలు ఏర్పడ్డాయి. గత కొన్నాళ్లుగా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూ వస్తోన్న ఈ మూవీ ఎలా ఉందంటే?
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప’ జూన్ 27న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మోహన్‌బాబు ఓ కీలక పాత్ర పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్ప ఎలా ఉంది? ప్రభాస్ గెస్ట్ రోల్ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
తిన్నడు… భక్త కన్నప్పగా ఎలా మారాడు…
తిన్నడు (విష్ణు మంచు) నాస్తికుడు. చిన్నతనం నుంచే భక్తి, దేవుడు, మూఢ నమ్మకాలను పట్టించుకోడు. కానీ తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) మాటను మాత్రం పాటిస్తాడు తిన్నడు. అలాంటి తిన్నడు నెమలి (ప్రీతి ముకుందన్) ప్రేమలో పడిపోతాడు. నెమలితో పెళ్లి తర్వాత తిన్నడిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ కథలో వాయు లింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ఈ వాయు లింగం కోసం జరిగే పోరులో తిన్నడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. తిన్నడి జీవితంలోకి వచ్చిన రుద్ర (ప్రభాస్), కిరాత (మోహన్ లాల్) మహాదేవ శాస్త్రి (మోహన్‌బాబు)ఎవరు? తిన్నడిని తమ గూడెం నుంచి నాథనాథుడు ఎందుకు వెలివేశాడు? చివరకు తిన్నడు ఆ శివుడి (అక్షయ్ కుమార్) భక్తిలో ఎలా లీనం అవుతాడు? అన్నది కథ.
నాస్తికుడిలో మార్పు…
కన్నప్ప కథ గురించి తెలియని తెలుగు వారు ఉండరు. పరమ నాస్తికుడైన ఓవేటగాడు..శివ భక్తుడిగా ఎలా మారాడు, తన రెండు కళ్లను ఎలా త్యాగం చేశాడు అన్నదే కన్నప్ప కథ. కన్నప్పలోని ట్రాన్స్ పర్మేషన్‌ను కేవలం భక్తి కోణంలోనే కాకుండా అతడిలోని వీరత్వాన్ని, ప్రేమకథను చూపిస్తూ నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా డైరెక్టర్ ముఖేష్ కుమార్ కన్నప్ప మూవీని రూపొందించాడు.
వాయు లింగం నేపథ్యం…
తిన్నడి పాత్ర పరిచయం, వాయు లింగం నేపథ్యం, తిన్నడు నెమలి ప్రేమ కథ, పెళ్లి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. అసలు కథలోకి వెళ్లడానికి, తిన్నడిలోని సంఘర్షణను స్క్రీన్‌పైకి తీసుకురావడానికి డైరెక్టర్ కొంత టైమ్ తీసుకున్నాడు.నాయకానాయికల మధ్య ప్రేమకథ అందంగా చూపించాడు. సాంగ్స్, విజువల్స్ బాగున్నాయి. కిరాతక పాత్ర ఎంట్రీ తర్వాతే ఇంటర్వెల్ ముందు అసలు కథ ప్రారంభం మొదలవుతుంది. తిన్నడు … భక్త కన్నప్పగా మారేందుకు దారి తీసిన పరిణామాలు ఏమిటన్నది చూపించాడు. .
రుద్రగా ప్రభాస్ ఎంట్రీ …
కన్నప్ప మ్యాజిక్ మొత్తం సెకండాఫ్‌లోనే ఉంది. ఆడియెన్స్‌కు హై మూవ్‌మెంట్ తో సెకండాఫ్‌ను నడిపించారు డైరెక్టర్. రుద్రగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ప్రభాస్ పాత్ర కనిపించినంత సేపు నెక్ట్స్ లెవెల్ ఫీల్‌ను కలిగిస్తుంది. ప్రభాస్, విష్ణు , మోహన్ బాబు కాంబినేషన్‌లో వచ్చే సీన్స్, ప్రభాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్, క్లైమాక్స్ విష్ణు నటన బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు.
రెండు వేరియేషన్స్‌లో…
తిన్నడిగా, భక్త కన్నప్పగా రెండు వేరియేషన్స్‌లో కూడిన పాత్రలో విష్ణు నటన బాగుంది. బాడీ లాంగ్వేజ్‌లో కూడా తేడాను చూపించారు. నటన పరంగా విష్ణు కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా కన్నప్ప నిలుస్తుంది. రుద్రగా ప్రభాస్ పాత్ర ఈ సినిమాకు మేజర్ హైలైట్. రుద్ర పాత్రలో అదరగొట్టాడు. గెటప్, లుక్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు మెప్పించాడు. శివుడిగా అక్షయ్ కుమార్, జానకిగా కాజల్ గెస్ట్ రోల్స్ ఆకట్టుకుంటాయి. మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివబాలాజీ ఇలా చాలా మంది నటులు ఈ సినిమాలో కనిపిస్తారు.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్…
న్యూజిలాండ్ లోకేషన్స్ కన్నప్ప మూవీకి ప్లస్సయ్యాయి. రెండో శతాబ్ధానికి తగ్గట్లుగా విజువల్స్ ఉన్నాయి. సినిమా కోసం మోహన్ బాబు, విష్ణు పెట్టిన ప్రతీ పైసా తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. స్వీఫెన్ దేవస్సీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ భక్తి భావాన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి.
కన్నప్ప మూవీని మంచు విష్ణు కెరీర్‌లో బెస్ట్ మూవీ. ప్రభాస్‌తో పాటు మిగిలిన అతిథి పాత్రలు ఈ సినిమాకు ప్లస్‌పాయింట్‌గా నిలిచాయి.
రేటింగ్: 3/5