




Best Web Hosting Provider In India 2024

థియేటర్ల నుంచి లీక్ అయిన కన్నప్పలోని ప్రభాస్ సీన్.. సెకండాఫ్‌లోనే ఎంట్రీ.. వీడియో ఎలా ఉందంటే!
మంచు విష్ణు కన్నప్ప మూవీ ఇవాళ (జూన్ 27) థియేటర్లలో విడుదలైంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ నటించిన ఈ సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే, థియేటర్ నుంచి ప్రభాస్ ఎంట్రీ సీన్ లీక్ అయింది. ఆన్లైన్లో అక్షయ్ కుమార్, ప్రభాస్ సీన్ వైరల్ అవుతోంది.
మంచు విష్ణు కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. బాలీవుడు డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, మధుబాల, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.
ప్రభాస్ కనిపించిన తీరు
అయితే, కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించండతో మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దానికి తోడు కన్నప్ప టీజర్, ట్రైలర్లో ప్రభాస్ కనిపించిన తీరుకు మూవీపై ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ను చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యారు.
ఇక భారీ అంచనాల నడుమ ఇవాళ (జూన్ 27) వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో కన్నప్ప సినిమా విడుదల అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప మూవీలోని ప్రభాస్ ఎంట్రీ సీన్ లీక్ అయింది. థియేటర్ నుంచి లీక్ అయిన ప్రభాస్ సీన్ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది.
ప్రభాస్ సీన్ లీక్
ఈ సీన్ ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇద్దరికీ సంబంధించినదిగా ఉంది. అయితే, ఈ లీక్ అయిన వీడియో ప్రభాస్ ఎంట్రీ సీన్ అని తెలుస్తోంది. అది కూడా అక్షయ్ కుమార్‌తో ప్రభాస్ ఎంట్రీ సన్నివేశం ఉందని వీడియో చూస్తుంటే తెలుస్తోంది. కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్, రుద్రుడిగా ప్రభాస్ నటించిన విషయం తెలిసిందే.
శివుడైన అక్షయ్ కుమార్ రుద్ర అని పిలవగానే ప్రభాస్‌ను చూపించారు. ఈ వీడియోలో మొదటగా ప్రభాస్ కళ్లు, ఆ తర్వాత వీపు వైపు నుంచి కెమెరా యాంగిల్ చూపించారు. ప్రభాస్ ఎంట్రీ సీన్ రాగానే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ, పేపర్స్ జల్లుతూ గోల చేశారు. అభిమానుల అరుపులు, కేకలతో థియేటర్ మారుమోగిపోయింది. డ్యాన్స్ కూడా చేస్తూ ఫ్యాన్స్ అల్లరి చేశారు.
సోషల్ మీడియాలో వైరల్
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్‌లో షేర్ చేసిన వీడియోలను డిలీట్ కూడా చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్ సెకండాఫ్‌లోనే ఉందని రివ్యూవర్స్ తెలిపారు. ఈ విషయాన్ని కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో రైటర్ బీవీఎస్ఎన్ రవి కూడా చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, లీక్ అయిన ప్రభాస్ సన్నివేశానికి ఉన్న ఇంపార్టెన్స్ తెలియరాలేదు. కాగా, కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జోడీగా హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటించింది. అలాగే, పార్వతిగా కాజల్ అగర్వాల్, కృతగా మోహన్ లాల్, మహాదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు నటించగా శరత్ కుమార్, ముఖేష్ రుషి, మధుబాల తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం