సీఏ ఫైనల్​ రిజల్ట్స్​ ఎప్పుడు వస్తాయి? ఎలా చెక్​ చేసుకోవాలి? పూర్తి వివరాలు..

Best Web Hosting Provider In India 2024


సీఏ ఫైనల్​ రిజల్ట్స్​ ఎప్పుడు వస్తాయి? ఎలా చెక్​ చేసుకోవాలి? పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu

ఐసీఏఐ సీఏ మే ఫైనల్​ రిజల్ట్స్​ కోసం ఎదురుచూస్తున్న వారికి అప్డేట్​! సీఏ ఫైనల్​ ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి? ఎలా చెక్​ చేసుకోవాలి? వంటి వాటిపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీఏ ఫైనల్​ రిజల్ట్స్​ ఎప్పుడు విడుదల అవుతాయి?

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మే 2025లో నిర్వహించిన సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. ఫలితాలను విడుదల చేసే తేదీని ఐసీఏఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ జులై మొదటి వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐసీఏఐ మాజీ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ధీరజ్ ఖండేల్వాల్ తన ఎక్స్ అకౌంట్​ ద్వారా ఇచ్చిన సమాచారం ప్రకారం.. జులై మొదటి వారంలో, అంటే జులై 3 లేదా 4 తేదీల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫలితాలు విడుదలైన తర్వాత, పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.org లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలు చూసుకోవడానికి అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

  • సీఏ, సీఎస్​ మాత్రమే కాదు.. కామర్స్​ వారికి ఈ కోర్సుల్లో కూడా మంచి ప్యాకేజీతో జాబ్​ ఆఫర్స్​- పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐసీఏఐ సీఏ ఫైనల్ మే 2025 ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి?

సీఏ ఫైనల్​ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు కింద పేర్కొన్న స్టెప్స్​ని అనుసరించవచ్చు:

స్టెప్​ 1- ముందుగా, ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.org ని సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో, ఐసీఏఐ సీఏ మే 2025 పరీక్ష ఫలితాల డౌన్‌లోడ్ లింక్​పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ లాగిన్ వివరాలను (యూజర్ ఐడీ, పాస్‌వర్డ్) నమోదు చేసి, సబ్మిట్ చేయండి.

స్టెప్​ 4- తర్వాత, మీ ఐసీఏఐ సీఏ ఫైనల్ 2025 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

స్టెప్​ 5- ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ఒక ప్రింటౌట్ తీసుకోవడం మంచిది.

ఐసీఏఐ సీఏ ఫైనల్​ పరీక్షల నిర్వహణ వివరాలు..

ఈ ఏడాది మే నెలలో సీఏ గ్రూప్ 1 ఫైనల్ పరీక్షలు మే 2, 4, 6వ తేదీల్లో జరిగాయి. గ్రూప్ 2 పరీక్షలను మే 8, 16, 18వ తేదీల్లో నిర్వహించారు.

గత సంవత్సరాల ఫలితాల సరళిని పరిశీలిస్తే.. 2024లో ICAI CA మే పరీక్షల ఫలితాలు జులై 11న విడుదల కాగా, 2023లో జులై 5న విడుదలయ్యాయి.

మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

ఐసీఏఐ సీఏ ఫైనల్​ ఫలితాల అప్డేట్స్​ని హిందుస్థామ్​ టైమ్స్​ తెలుగులో మేము మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాము. మరిన్ని వివరాల కోసం కెరీర్​ సెక్షన్​ని పరిశీలిస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్​!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link