





Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జూన్ 28 ఎపిసోడ్: కావ్య సీటుకే ఎసరు పెట్టిన యామిని- కంపెనీ బోర్డ్ మెంబర్‌తో శకునిలా స్కెచ్- అప్పుపై అక్క ఫైర్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 28 ఎపిసోడ్లో యామినికి రాజ్ కళ్ల ముందే అప్పు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అప్పుకు తానేంటో చూపిస్తానని కావ్యకు కాల్ చేసి చెబుతుంది యామిని. దాంతో అప్పుపై కావ్య ఫైర్ అవుతుంది. రాజ్ కంపెనీ బోర్డ్ మెంబర్‌తో యామిని శకునిలా స్కెచ్ వేస్తుంది. కావ్య సీటుకే ఎసరు పెడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంటికెళ్లి మరి యామిని చెంప పగులకొడుతుంది అప్పు. నువ్ చేసిన పనికి చంపిన తప్పులేదంటుంది. స్వప్న అక్కను కిడ్నాప్ చేసి కావ్య అక్కని బెదిరించిన విషయం నాకు తెలియదనుకుంటున్నావా. ఇంకోసారి మా అక్కల జోలికి వచ్చావనుకో తుక్కురేగొడతాను. నేను ఊర మాస్. మా అక్కల జోలికి వస్తే నిన్ను నిలువునా చీరేస్తాను అని అప్పు వార్నింగ్ ఇస్తుంది.
జాలిపడి వదిలేసానన్న అప్పు
కానీ, దానికి యామిని నవ్వుతుంది. నువ్ చెప్పేది కామెడీగా ఉంది. నీకు అంత సీన్ లేదు. పెళ్లిలో సాక్ష్యం ఉన్న ఏం చేయలేకపోయావ్ అని యామిని అంటుంది. హలో అమూల్ బేబీ ఆరోజు నిన్ను అరెస్ట్ చేయకుండా ఉంది సాక్ష్యం లేనందుకు కాదు. మా అక్క వద్దన్నందుకు. ఎలాగు పెళ్లి ఆగిపోయింది కదా అని అరెస్ట్ ఎందుకు అని జాలీపడి వదిలేశా అని అప్పు అంటుంది.
దాంతో యామిని బిత్తరపోతుంది. పోయిన సాక్ష్యాన్ని మళ్లీ తెప్పించుకోగలను. ఇంకోసారి కావ్య అక్క జోలికి వస్తే చేతితో కాదు లాఠీతో సమాధానం చెబుతా అని అప్పు వెళ్లిపోతుంటే రాజ్ వస్తాడు. అది చూసి అప్పు షాక్ అవుతుంది. ఏమైంది ఇటొచ్చావ్. సంకెళ్లు, లాఠీ అంటున్నావ్ అని రాజ్ అడిగితే కిడ్నాప్ అని వెళ్లిన విక్టిమ్ ఇక్కడే ఉన్నాడని తెలిసి వచ్చా. ఖైదీలను ఎలా ట్రీట్ చేస్తారో యామిని అడిగితే చెప్తున్నా అని అప్పు కవర్ చేస్తుంది.
ముందు సంకెళ్లు వేసి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీతో ఒళ్లంతా మసాజ్ చేస్తాం. ఇప్పుడు బాగా అర్థమైందా యామిని అని రాజ్ ముందే యామినికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అప్పు. కళావతికి ప్రపోజ్ చేశావా అని యామిని అడిగితే పని ఉందని వెళ్లిపోయిందని రాజ్ చెబుతాడు. నీ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయిందా అని యామిని అంటుంది.
అస్సలు చెప్పనివ్వను
రేపు చెబుతాలే అని రాజ్ వెళ్లిపోతాడు. నీ నోటి నుంచి ఆ కావ్యకు ఐ లవ్యూ అని అస్సలు చెప్పనివ్వను అని కావ్యకు కాల్ చేస్తుంది యామిని. నా ప్లాన్ ఎలా ఉందని యామిని అంటే చాలా చీప్‌గా ఉందని కావ్య సెటైర్లు వేస్తుంది. ఇవాళ ఆపావ్, రేపు, ఎల్లుండి ఎన్ని రోజులు ఆపుతావ్. ఏదో ఒకరోజు నీ అడ్డు తొలగిపోతుంది అని కావ్య అంటుంది.
నీ చెల్లితోని వార్నింగ్ ఇస్తే భయపడతాననుకున్నావా. ఒంటిమీద యూనిఫామ్ ఉందని పొగరుగా మాట్లాడింది. దానికి కూడా నేనేంటో అర్థమయ్యేలా చేస్తా. ఏ డ్రెస్ అయితే ఉందని విర్రవీగిందో ఆ డ్రెస్‌తోనే సమాధానం చెబుతాను అని యామిని కాల్ పెట్టేస్తుంది. తర్వాత అప్పును యామిని ఇంటికి వెళ్లడం గురించి అడుగుతుంది కావ్య. చెంప చెల్లుమనిపించి వార్నింగ్ ఇచ్చానని అప్పు అంటుంది.
నా మాట అంటే లెక్కలేదా అని కావ్య చెల్లెలు అప్పుపై ఫైర్ అవుతుంది. ఇందిరాదేవి, అపర్ణ వచ్చి అప్పుకు సపోర్ట్ చేస్తారు. తప్పు అని చెప్పాల్సింది పోయి సపోర్ట్ చేస్తారేంటీ అని నిలదీస్తుంది కావ్య. అప్పు గురించి పక్కన పెట్టి రాజ్ తెగ కాల్ చేస్తున్నాడు. వెళ్లి మాట్లాడమని గట్టిగా చెబుతారు ఇందిరాదేవి, అపర్ణ. దాంతో కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ కంపెనీలోని బోర్డ్ మెంబర్లో ఒకరైన సిద్ధార్థ్ వచ్చి యామినిని కలుస్తాడు.
బోర్డ్ మీటింగ్ పెట్టండి
మీ షేర్స్ కంపెనీలో 40 శాతం. మొత్తం కంపెనీని గుప్పిట్లో పెట్టుకోడానికి మీరు చాలా ట్రై చేశారని. రాజ్ వల్ల కుదరలేదని తెలుసు అని యామిని అంటుంది. నా రూపంలో మీకు మళ్లీ ఆ అవకాశం వచ్చింది అని శకునిలా ఐడియా చెబుతుంది యామిని. కావ్యను చైర్ నుంచి తప్పించడానికి బోర్డ్ మీటింగ్ పెట్టండి, కావ్య వల్ల ఎంత నష్టమో, మీ వల్ల ఎంత లాభమో డెమో చూపించండి అని యామిని అంటుంది.
దాంతో సగం మంది మీరే కరెక్ట్ అని అంటారు. దీంతో ఇన్నేళ్ల మీ కోరిక నెరవేరుతుంది అని యామిని ప్లాన్ చెబితే వావ్ సిద్ధార్థ్ అంటాడు. రేపే ఈ ప్లాన్ అమలు చేసి ఆ కావ్య సీటుకు ఎసరు పెడతా అని సిద్ధార్థ్ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు కావ్యకు కాల్ చేయాలా వద్దా అని రాజ్ ఆలోచించి కుదిరితే ఫోన్లోనే నా మనసులో మాట చెబుతాను అని అనుకుంటాడు.
కావ్య క్షమాపణలు
నేనే మీకు కాల్ చేద్దామనుకున్నా అని కావ్య అంటుంది. అరే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావురా అని రాజ్ అనుకుంటాడు. నేను మీతో టైమ్ స్పెండ్ చేయలేకపోయాను. సారీ, తెలుగులో క్షమించండి అని కావ్య చెబుతుంది. ఇంతకీ మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారని కావ్య అంటుంది. మీకు తెలుసు అని నాకు తెలుసు అని రాజ్ అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్