Best Web Hosting Provider In India 2024

CM Revanth reddy Delhi Tour : హస్తిన పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పరిస్థితుల గురించి కూడా మోదీకి తెలిపారు. ప్రధానంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించటంపై విజ్ఞప్తి చేశారు. ఈ భేటీ అరగంటపాటు కొనసాగింది.
ట్రెండింగ్ వార్తలు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలవటం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న… రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క… హస్తం పెద్దలను కలవనున్నారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఇక లోక్ సభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.