Chiranjeevi on HanuMan: హనుమాన్‍కు థియేటర్ల సమస్యపై మాట్లాడిన చిరంజీవి.. ప్రతీ టికెట్‍పై రూ.5 అయోధ్య రామాలయానికి విరాళం

Best Web Hosting Provider In India 2024

Chiranjeevi on HanuMan Movie: తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా రానున్న ‘హనుమాన్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మరో ఐదు రోజుల్లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం (జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నా సామిరంగా (జనవరి 14) చిత్రాలు పోటీలో ఉన్నా.. హనుమాన్ నమ్మకంతో వచ్చేస్తోంది. హనుమాన్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జనవరి 7) హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగింది. ఈ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు

సంక్రాంతికి పోటీ చాలా తీవ్రంగా ఉండటంతో హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ థియేటర్లే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి థియేటర్ల కేటాయింపు సమస్య గురించి చిరంజీవి ప్రస్తావించారు. హనుమాన్ టీమ్‍లో ధైర్యం నింపేలా మాట్లాడారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఎప్పుడైనా తప్పకుండా చూస్తారని, ఈ విషయంలో ఎలాంటి డౌట్లు వద్దని మెగాస్టార్ అన్నారు. హనుమాన్ విజయం సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.

“ఎన్ని సినిమాలు వచ్చినా సరే.. మన కంటెంట్‍లో సత్తా ఉండి.. మనకు దైవాశీస్సులు ఉన్నాయంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు.. అక్కున చేర్చుకుంటారు.. పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. అందుకే ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే, ఇది పరీక్షా కాలం అనుకోవచ్చు. థియేటర్లు మనకు అనుకున్న విధంగా లభించకపోవచ్చు. ఓకే.. ఈ రోజు కాకపోతే.. రేపు చూస్తారు. సెకండ్ షో చూస్తారు. సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. కానీ కంటెంట్ బాగుంటే.. ఎన్నో రోజు చూసినా.. ఎన్నో షో చూసినా దీనికి మార్కులు పడతాయి” అని చిరంజీవి అన్నారు.

ప్రతీ టికెట్‍పై రూ.5 విరాళం

జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, తాము వెళ్లనున్నట్టు చిరంజీవి చెప్పారు. హనుమాన్ సినిమా ఆడినన్ని రోజులు.. వచ్చే కలెక్షన్లలో ప్రతీ టికెట్‍పై 5 రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వడానికి హనుమాన్ టీమ్ నిర్ణయించుకుందని చిరంజీవి ప్రకటించారు. ఇందుకు గాను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డిని మెగాస్టార్ అభినందించారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని చెప్పారు.

 

ధర్మం కోసం నిలబడే ప్రతీ ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడని హనుమాన్ చిత్రంలో డైలాగ్ ఉందని, థీమ్ కూడా అదేనని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పారు. అలా.. ఈ సినిమా కోసం హనుమంతుడిలా చిరంజీవి వచ్చారని ప్రశాంత్ ఎమోషనల్ అయ్యారు.

హనుమాన్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‍లో జనవరి 12న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీలోనూ విడుదల కానుంది. అలాగే, ఇంగ్లిష్, కొరియన్, జపనీస్, చైనీస్, స్పానిష్‍లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొంది అన్యాయం చేసే విలన్లపై పోరాడే యువకుడి పాత్రను ఈ చిత్రంలో పోషించారు తేజ సజ్జా. హనుమాన్ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శీను కీలకపాత్రలు చేశారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024