Best Web Hosting Provider In India 2024
Dulquer Salmaan Multistarrer: దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మల్టీస్టారర్ మూవీలో దుల్కర్ సల్మాన్‌తో పాటు మంచు మనోజ్, తేజా సజ్జా హీరోలుగా నటించనున్నట్లు చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కొత్త జోనర్‌లో ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మంచు మనోజ్, తేజా సజ్జాతో పాటు దుల్కర్ సల్మాన్ రోల్స్ డిఫరెంట్‌గా ఉంటాయని అంటున్నారు. పాన్ ఇండియన్ మూవీ కావడంతో అన్ని భాషల్లో స్టార్‌డమ్ ఉన్న హీరోను తీసుకోవాలనే ఆలోచనతోనే దుల్కర్‌ను మూవీ కోసం ఎంచుకున్నట్లు సమాచారం.
ఈగల్ డైరెక్టర్…
ఈ మల్టీస్టారర్ మూవీకి ఈగల్ ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ ట్రిపుల్ హీరో సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేటర్ల సమస్య కారణంగా ఫిబ్రవరి 9కి వాయిదాపడింది.
ఈగల్ రిలీజ్ తర్వాతే దుల్కర్, మంచు మనోజ్, తేజా సజ్జా మల్టీస్టారర్ మూవీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సీతారామంతో బిగ్గెస్ట్ సక్సెస్…
మహానటి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. ఇందులో జెమిని గణేషన్ పాత్రలో నటించాడు. 2022లో రిలీజైన సీతారామంతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. సీతారామంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
ఉస్తాద్ టాక్ షో…
మరోవైపు లాంగ్ గ్యాప్ తర్వాత ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్ధాం టాక్ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు మంచు మనోజ్ ఈటీవీ విన్ ఓటీటీలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. వాట్ ది ఫిష్ పేరుతో మంచు మనోజ్ ఓ పాన్ ఇండియన్ సినిమాను అనౌన్స్ చేసినా అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
మంచు మనోజ్ స్థానంలో నిహారిక కొణిదెలతో ఆ సినిమా చేస్తున్నారు. మరోవైపు తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న హనుమాన్ మూవీ జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. జాంబీ రెడ్డి తర్వాత తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.
టాపిక్