Best Web Hosting Provider In India 2024

Kalki 2898 AD Release: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ మూవీ చేస్తున్నారు. డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. హాలీవుడ్ రేంజ్‍లో ఫ్యుచరస్టిక్ మూవీగా తెరకెక్కించేందుకు ఓ కొత్త ప్రపంచాన్ని ఆయన క్రియేట్ చేశారు. సలార్ చిత్రంతో తాజాగా భారీ బ్లాక్‍బాస్టర్ కొట్టారు ప్రభాస్. ఈ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే భారీ అంచనాలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
కాగా, కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ డేట్‍ను ప్రకటించేందుకు మూవీ టీమ్ రెడీ అయిందని సమాచారం బయటికి వచ్చింది. ఈవారంలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తుందని బజ్ నడుస్తోంది. సంక్రాంతి సీజన్ సందర్భంగా ఈవారంలోనే రిలీజ్ డేట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని తెలుస్తోంది. జనవరి 12 లేదా 13వ తేదీ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కల్కి 2898 ఏడీ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని గతంలో మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే, సినిమా సిద్ధం కాకపోవటంతో వాయిదా వేసింది. ఈ చిత్రం షూటింగ్ ఇంకా సాగుతోంది. అతిత్వరలోనే చిత్రీకరణ ముగియనుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతం చేయనుంది మూవీ టీమ్. సైన్స్ ఫిక్షన్ చిత్రం కావటంతో ఈ మూవీలో వీఎఫ్‍ఎక్స్ భారీ స్థాయిలో ఉండనుంది. గ్రాఫిక్స్ కోసమే సమయం ఎక్కువగా పడుతోంది.
కల్కి 2898 ఏడీ మూవీ గ్లింప్స్.. అమెరికాలో సాన్ డియాగో కామికాన్ ఈవెంట్‍లో లాంచ్ చేసింది యూనిట్. ఈవెంట్‍లో గ్లింప్స్ లాంచ్ చేసుకున్న తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు అశ్వినీదత్.
కల్కి 2898 ఏడీ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ, పశుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ను 93 రోజుల తర్వాత తీసుకొస్తామని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పది రోజుల క్రితమే బాంబే ఐఐటీ టెక్ ఫెస్ట్‌లో చెప్పారు. అంటే ఈ మూవీ ట్రైలర్ మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్‍లో వచ్చే అవకాశం ఉంది.
కాగా, కల్కి 2898 ఏడీ మూవీ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ హాలీవుడ్ రేంజ్‍లో ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ టేకింగ్ అదిరిపోయింది. గ్లింప్స్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. భారతీయ సినీ చరిత్రలో కల్కి 2898 ఏడీ ఓ మైలురాయిలా నిలుస్తుందనేంత క్రేజ్ ఉంది. భారతీయ భాషలతో పాటు చాలా విదేశీ భాషల్లోనూ కల్కిని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. హాలీవుడ్‍లోనూ ఈ మూవీపై బజ్ ఉంది.