IAS Aravind Kumar: ఫార్ములా ఈ రేసులకు అనుమతి లేకుండా చెల్లింపులు.. ఐఏఎస్‌ సంజాయిషీ కోరిన సిఎస్‌

Best Web Hosting Provider In India 2024


IAS Aravind Kumar: ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో నిబధంనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసిన వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. క్యాబినెట్ అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా రూ.54కోట్ల విడుదల చేశారనే అభియోగాలపై వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమంలో ప్రైవేట్ సంస్థకు ఏకపక్షంగా నిధుల విడుదలకు ఆదేశించడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా వ్యవహరించిన అరవింద్‌ కుమార్‌ నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల చేసి ఉల్లంఘనలకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 2023 అక్టోబర్‌30వ తేదీన ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండానే ఈ రేసింగ్‌ ప్రాజెక్టుకు నిధుల్ని విడుదల చేశారు. కొత్త ప్రాజెక్టులకు నిధుల విడుదల చేయడంపై ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉన్నా క్యాబినెట్‌ అమోదం లేకుండా, ఆర్థికశాఖ అనుమతులు లేకుండానే హైదరాబాద్‌లో పార్ములా-ఈ రేస్ పోటీలను నిర్వహించేందుకు హెచ్ఎండీఏ ఒప్పందం కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

పోటీల నిర్వహణ కోసం రూ. 54 కోట్లు ముందస్తుగా చెల్లించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుం డా ఒప్పందాన్ని అతిక్రమించి రేస్ రద్దు చేసినందుకు మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ (ఎస్ఐఏ) ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో నిధుల విడుదల అంశం వెలుగులోకి వచ్చింది.

కార్‌ రేసింగ్‌ నిర్వహణపై ఒప్పందం, నిధుల విడుదల విషయంలో నిబంధ నలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు చీఫ్‌ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీల నిర్వహణపై ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకున్నారని సిఎస్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు. హెచ్‌ఎండిఏ నుంచి బిల్లుల రూపంలో రూ.46కోట్లు పన్నుల రూపంలో మరో 9 కోట్లను చెల్లించడానికి కారణాలు ఏమిటన్నది తెలపాలని సిఎస్‌ ఆదేశించారు.

స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ హోదాలో ఉన్న అరవింద్‌కుమార్‌‌కు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం ఫార్ములా కార్‌ రేసింగ్ సంస్థకు కూడా బదులిచ్చింది. ప్రభుత్వంతో ప్రైవేట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో నిబంధనలు పాటించనందున ముందుగా చెల్లించిన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది.

గత ఏడాది పోటీల నిర్వహణ…

గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్లో జరిగిన సీజన్-9 పార్ములా-ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది తలపెట్టిన ఫార్ములా-ఈ 10వ సీజన్ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండాల్సి ఉంది. ఖర్చు మొత్తం ప్రైవేటు సంస్థలైన గ్రీన్‌ కో ఫార్ములా ఈ సంస్థ భరించాల్సి ఉంది.

ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఆ ఉన్న తాధికారి ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండీఏ నుంచి రూ.54కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు. ఫిబ్ర వరి 10న ఈవెంట్ నిర్వహిస్తే హెచ్ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడేది. గ్రీన్‌ కో స్థానంలో హెచ్‌ఎండిఏ నిర్వహణ బాధ్యతలు చేపట్టడంపై దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

WhatsApp channel

Source / Credits

Best Web Hosting Provider In India 2024