Teja Sajja: నితిన్ శ్రీ ఆంజ‌నేయంతో క‌థ‌తో హ‌నుమాన్ తీశారా? – రూమ‌ర్స్‌పై తేజా స‌జ్జా ఏమ‌న్నాడంటే?

Best Web Hosting Provider In India 2024

Teja Sajja: తేజా స‌జ్జా హీరోగా న‌టిస్తోన్న హ‌నుమాన్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. సూప‌ర్ హీరో క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో రిలీజ్ అవుతోంది. హ‌నుమాన్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా తేజా స‌జ్జా త‌న కెరీర్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హీరో కావాల‌నే ఆలోచ‌న‌లో 2014 నుంచి ఆడిష‌న్స్ చేయ‌డం మొద‌లుపెట్టాన‌ని, కానీ త‌న‌కు ఎవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌లేద‌ని అన్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు

1998లో అరంగేట్రం…

1998లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తాను సినిమాల్లోకి అరంగేట్రం చేశాన‌ని తేజా స‌జ్జా చెప్పాడు. 2008 వ‌ర‌కే యాభై సినిమాలు పూర్తి చేసిన‌ట్లు చెప్పాడు. చిరంజీవి, నాగార్జున‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు లాంటి స్టార్స్‌ను చూసి హీరో కావాల‌ని డిసైడ్ అయ్యాన‌ని తేజా స‌జ్జా పేర్కొన్నాడు. “హీరో కావాల‌నే ఆశ‌తో 2014 నుంచి ఆడిష‌న్స్ ఇవ్వ‌డం మొద‌లుపెట్టా. కానీ ఒక్క అవ‌కాశం రాలేదు”. అని తేజా సజ్జా చెప్పాడు.

యాభైకి పైగా సినిమాలు చేసినా ఒక్క‌రూ కూడా త‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని అన్నాడు. కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన త‌ర్వాత ఆగిపోయాన‌ని, మ‌రికొన్నింటిని నాతో చేయాల‌ని అనుకొని చివ‌రి నిమిషంలో మ‌రో హీరోను తీసుకున్నార‌ని పేర్కొన్నాడు. అవ‌న్నీ నాకు ఇండ‌స్ట్రీలో మంచి అనుభ‌వాలుగా మిగిలిపోయాన‌ని చెప్పాడు.

హీరోగా నేను చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఇంట్లో వాళ్లు కూడా సినిమాల్ని వ‌దిలేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌ని అన్నాడు. అవ‌న్నీ చూసి తాను డిస‌సాయింట్ అయ్యాన‌ని తెలిపాడు. మంచి సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాల‌ని చాలా రోజులు ఎదురుచూశాన‌ని, చివ‌ర‌కు ఓ బేబీతో ఆ క‌ల తీరింద‌ని తేజా స‌జ్జా కామెంట్స్ చేశాడు.

శ్రీ అంజ‌నేయంతో కంపేరిజ‌న్స్‌…

నితిన్ , డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీ ఆంజ‌నేయంతో హ‌నుమాన్ సినిమాకు పోలిక‌లు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రెండు క‌థ‌లు ఒక‌టేన‌ని అంటున్నారు. ఈ రూమ‌ర్స్‌పై తేజా స‌జ్జా రియాక్ట్ అయ్యాడు. శ్రీఆంజ‌నేయంతో హ‌నుమాన్ క‌థ‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని తేజా స‌జ్జా అన్నాడు. శ్రీ ఆంజ‌నేయం సూప‌ర్ హీరో క‌థ కాద‌ని తెలిపాడు.

 

శ్రీ ఆంజ‌నేయంలో నితిన్ ప‌క్క‌న అర్జున్ రూపంలో ఆంజ‌నేయుడు ఉంటాడ‌ని, కానీ హ‌నుమాన్‌లో అంజ‌నేయుడి క్యారెక్ట‌ర్ క‌నిపించ‌ద‌ని చెప్పాడు. స్పైడ‌ర్‌మ్యాన్ త‌ర‌హాలో సూప‌ర్ హీరో క‌థ‌తో హ‌నుమాన్ మూవీని ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించాడ‌ని తేజా స‌జ్జా అన్నాడు. దేవుడి ఆశీస్సుల‌తో సాధార‌ణ యువ‌కుడు ధ‌ర్మ కోసం ఎలాంటి పోరాటం చేశాడ‌న్న‌ది ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో చూపించామ‌ని అన్నాడు.

జాంబీరెడ్డి త‌ర్వాత‌…

హ‌నుమాన్ మూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జాంబీరెడ్డి త‌ర్వాత తేజా స‌జ్జా, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో తేజా స‌జ్జా సోద‌రిగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ న‌టించింది. తేజా స‌జ్జాకు జోడీగా అమృత అయ్య‌ర్ క‌నిపించిన ఈ మూవీలో కోలీవుడ్ న‌టుడు విన‌య్‌రాయ్ విల‌న్‌గా న‌టించాడు. జ‌నవ‌రి 12న సినిమా రిలీజ్ అవుతోండ‌గా…ఒక రోజు ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెయిడ్ ప్రీమియ‌ర్స్‌ను స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024