Ganza Business: గాడిదల పెంపకం పేరుతో గంజాయి వ్యాపారం గుట్టు రట్టు

Best Web Hosting Provider In India 2024

Ganza Business: గాడిదల పెంపకం మాటున గంజాయి విక్రయిస్తోన్న ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి 130 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ అడిషనల్ డిసిపి మధుసూదన్ రావు,బేగంపేట ఏసిపీ రామలింగరాజు తో కలిసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 

ట్రెండింగ్ వార్తలు

రాజస్థాన్ కు చెందిన ప్రేమ్ కుమార్ నగరానికి వలస వచ్చి జీడిమెట్ల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అదే రాజస్థాన్ రాష్ట్రానికి చందిన జైసింగ్ భాటి,ప్రేమ్ కుమార్, రూప్ చంద్ అనే మరో ముగ్గురు వ్యక్తులు కూడా జీడిమెట్ల లోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

జై సింగ్,జీ డిమెట్ల సమీపంలోని సుభాష్ నగర్ లో ఫుడ్ కోర్ట్ అలాగే మెదక్ జిల్లా కూచారాల్లో గాడిదల ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. ప్రేమ్ కుమార్,జై సింగ్ వద్ద పని చేసేవాడు.సులభంగా డబ్బు సంపాదించేందుకు జై సింగ్ ప్రేమ్ కుమార్లతో కలిసి గంజాయి వ్యాపారానికి తెరలేపాడు.

ఈ క్రమంలోనే తనకు పరిచయస్తుడైన మంగీలాల్, ధర్మెంద్రల ద్వారా గంజాయి కొనుగోలు చేసి కాలేజీ విద్యార్థులకు విక్రయించేవాడు. జీడిమెట్లలోని నూడుల్స్ సెంటర్‌తో పాటు మెదక్ జిల్లా కూచారంలోని డంకీ ఫామ్ కేంద్రంగా గంజాయి విక్రయాలు కొనసాగేవి.

ఎక్కువ మొత్తంలో గంజాయి కావాలని మంగిలాల్, ధర్మేంద్రలను కోరగా…..వారు రాజమండ్రికి చెందిన రాజన్‌ను సంప్రదించాలని సూచించారు.అక్కడికి వెళ్ళిన వారు బొలెరో,స్విఫ్ట్ కార్లలో పెద్ద మొత్తంలో గంజాయిని నగరానికి తీసుకొని వస్తుండగా…..పక్కా సమాచారం అందుకున్న పోలీసులు డైమండ్ పాయింట్ వద్ద అడ్డుకొని వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 

నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితులు అందించిన సమాచారం ఆధారంగా మరికొందరి నిందితుల ఆచూకీ కోసం పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

చైతన్యపురిలో 9 కేజీల గంజాయి పట్టివేత….

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున వెల్లడించిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా రాయినపల్లి గ్రామానికి చెందిన కొంకర బ్రహ్మయ్య నాయుడు, జోగులాంబ గద్వాల జిల్లా రాజులకు చెందిన తెలుగు రమేష్ 6 నెలల క్రితం నగరానికి వలస వచ్చారు. నగరంలో జోమటో, ర్యాపిడో బాయ్స్‌గా పని చేస్తున్నారు.

వాటితో వస్తున్న ఆదాయం సరిపోక పోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయి వ్యాపారం చేయాలని పథకం పన్నారు. అరకు ప్రాంతానికి చెందిన నారాయణ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో అవసరమైన వారికి విక్రయిస్తున్నారు.

గత శనివారం అరకు వెళ్లిన వీరు 9 కేజీల గంజాయి తీసుకొని ప్రైవేట్ బస్సులో నగరానికి తీసుకువచ్చారు.సోమవారం రాత్రి నగరంలో కస్టమర్లకు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నం చేస్తుండగా పక్క సమాచారం అందుకున్న పోలీసులు బ్రహ్మనాయుడు రమేష్ లను పోలీస్ అరెస్ట్ చేసి వారి నుంచి 9 కేజీల గంజాయిని రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

 

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024