Tap Water: చల్లని కుళాయి నీరు నేరుగా తాగడం ఆరోగ్యకరమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

Best Web Hosting Provider In India 2024

నీరు ప్రాణాధారం. ప్రతి గంటకి నీరు తాగితేనే శరీరం ఆరోగ్యంగా ఉండేది. తాగే నీటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే ఎన్నో రకాల అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ప్రజలు కొళాయి నుంచి వచ్చిన నీటిని పట్టుకునే తాగుతారు. చలికాలంలో కుళాయిల నుంచి వచ్చే నీరు చాలా చల్లగా ఉంటాయి. ఆ నీటిని నేరుగా అలా తాగవచ్చా అనే అనుమానం ఉంది చాలా మందిలో.

 

ట్రెండింగ్ వార్తలు

చలికాలంలోనే కాదు, వేసవి కాలంలో కూడా చల్లని నీరు తాగడం మంచిది కాదు. అవి రక్త నాళాలను సంకోచించేలా చేస్తాయి. జీర్ణ క్రియ సవ్యంగా జరగకుండా అడ్డుకంటాయి. 2001 అధ్యయనంలో 669 మంది మహిళల్లో 51 మందికి (7.6%) చల్లటి నీరు తాగిన తర్వాత తలనొప్పి రావడం గమనించారు. వారిలో చాలా మంది ఇప్పటికీ మైగ్రేన్లతో బాధపడుతున్నారు. వారికి చల్లనినీరు తాగిన ప్రతిసారి తలనొప్పి రావడం జరుగుతోంది. కాబట్టి కుళాయిలోంచి వచ్చిన చల్లని నీటిని నేరుగా తాగడం చలికాలంలో చేయకూడదు. అవి గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక తాగడం మంచిది.

కుళాయి నీటిలో సీసం?

కుళాయి నీటిలో సీసం ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అమెరికాలోని మిచిగాన్ లోని ఫ్లింట్ లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ తర్వాత ఈ సమస్య గురించి హైలైట్ అయింది. కుళాయి నీటిలో సీసం స్థాయిలు పెరిగి పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అప్పట్నించి సీసం కలవకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పుడు దొరుకుతున్న బాటిల్ నీళ్లు, మినరల్ వాటర్ కన్నా నదులు, వాగులు సరస్సుల నీళ్లే మంచిదని చెప్పేవారు ఉన్నారు. పూర్వం మన పూర్వీకులు ఈ నీటినే తాగేవారు. వారు ఎన్నో అంటువ్యాధుల బారిన పడి మరణించారు. విరేచనాలు, కలరాతో వారి ఆయుర్ధాయం చాలా తక్కువగా ఉండేది. కాబట్టి శుద్ధి చేయని నీటిని తాగకూడదు. వీటితో పోలిస్తే కుళాయి నీరు వందరెట్లు బెటర్.

 

కుళాయి నుంచి వచ్చే నీరు తాగడం మంచిదనే నమ్మకమే ఎక్కువ మందిలో ఉంది. కుళాయి నీరు తాగడం వల్ల వెంటనే ఏం జరుగదు, కానీ దీర్ఘకాలంలో ఏదైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. నీటిని శుద్ధి చేసే ఫ్యాక్టరీలలో నీళ్లలోని బ్యాక్టిరియాను చంపేందుకు క్లోరిన్, ఫ్లోరైడ్ లను కలిపి శుద్ధి చేస్తారు. ఆ నీటిని కుళాయిల ద్వారా ప్రజలకు అందిస్తారు. వాటిని నేరుగా మనం పట్టి తాగుతాం. వీటితో వంటలు చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. అయితే ఆ పైపుల్లో నాచు వంటివి పట్టే అవకాశం ఉంది. ఆ నీటిని నేరుగా తాగడం మంచిది కాదు. ఒకసారి కాచి చల్లార్చి తాగడం మంచిది. ముఖ్యంగా చలికాలంలో ఏ నీరైనా కాచ్చి చల్లార్చుకుని తాగడమే ఉత్తమం.

కుళాయిలు ఉన్న ప్రదేశాలు కూడా ఎప్పుడూ తడిగా దోమలకు ఆవాసాలుగా మారుతూ ఉంటాయి. ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే కుళాయిల్లోని పైపుల్లో కూడా ఆ కీటకాలు, సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంది. ఇంట్లోని నీళ్లను కూడా పరిశుభ్రంగా ఉండే చోట నిల్వ ఉంచుకోవాలి.

 
WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024