Best Web Hosting Provider In India 2024
Sankranthi Movies: ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు స్ట్రెయిట్ సినిమాలు పోటీపడబోతున్నాయి. గుంటూరు కారం మూవీతో ఏడోసారి సంక్రాంతి బరిలో మహేష్ బాబు నిలిచాడు. వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఈ ముగ్గురు స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరో తేజా సజ్జా కూడా హనుమాన్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ నాలుగు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. వీటిలో మహేష్ బాబు గుంటూరు కారంపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 125 కోట్లు…
మహేష్‌బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోన్న గుంటూరు కారం దాదాపు 125 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్‌గా అటు ఇటుగా 120 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. 125 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోన్నట్లు చెబుతోన్నారు.
మహేష్ కెరీర్‌లో హయ్యెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోన్న మూవీగా గుంటూరు కారం నిలబోతున్నట్లు చెబుతోన్నారు. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. చాలా రోజుల తర్వాత ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో మహేష్ బాబు నటిస్తోన్న మూవీ ఇది కావడం గమనార్హం.
హనుమాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
సంక్రాంతి సినిమాల్లో గుంటూరు కారం తర్వాత హయ్యెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోన్న సినిమాగా హనుమాన్ నిలిచింది. తేజా సజ్జా హీరోగా సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు 24 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. దాదాపు 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
సైంధవ్.. పరిస్థితి ఇదే…
సంక్రాంతి బజ్‌లో వెంకటేష్ సైంధవ్‌తో పాటు నాగార్జున నా సామిరంగ సినిమాలు కాస్తంత వెనుకబడ్డాయి. వెంకటేష్ సైంధవ్ మూవీ దాదాపు 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. సైంధవ్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను జోడించి తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణిశర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నాడు.
నా సామిరంగ లాస్ట్…
కాగా నాగార్జున నా సామిరంగ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లుగా సమాచారం. నాగార్జున గత సినిమాల ప్రభావం నా సామిరంగ ప్రీ రిలీజ్ బిజినెస్‌పై పడినట్లు చెబుతోన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కలిపి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ 16 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.
ఓవరాల్‌గా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో నాగార్జున మూవీ రిలీజ్ అవుతోన్నట్లు సమాచారం. నా సామిరంగంలో నాగార్జునతో పాటు అల్లరి న రేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన పురింజు మరియం జోస్ ఆధారంగా నా సామిరంగ మూవీ తెరకెక్కుతోంది.