Best Web Hosting Provider In India 2024

Ambati Rayudu : మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్, అంబటి రాయుడు చర్చలు జరుపుతున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు, 10 రోజుల్లోనే ఆ పార్టీని వీడారు. పవన్ తో అంబటి రాయుడు భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అంబటి రాయుడు పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారా? జనసేనలో చేరుతున్నారా? అనే విషయంపై ఆసక్తినెలకొంది.
ట్రెండింగ్ వార్తలు
వైసీపీకి రాజీనామా
గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి రాయుడు వైసీపీలో చేరారని, కానీ సీఎం జగన్ ఈ సీటు వేరే వాళ్లకు ఇవ్వడంతో వైసీపీకి రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. డిసెంబర్ 28న అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం కొన్ని రోజులకే రాజీనామా చేశారు. అనంతరం రాజీనామాపై స్పందిస్తూ… ట్వీట్ చేశారు. దుబాయ్‌లో జరిగే ఐఎల్ టీ20 టోర్నీలో ముంబయి ఇండియన్స్ తరపున ఆడుతున్నానని తెలిపారు. ప్రొఫెషనల్ టోర్నీలో ఆడేటప్పుడు రాజకీయాలు, పార్టీలతో సంబంధం ఉండకూడదు కాబట్టే వైసీపీకి రాజీనామా చేశానన్నారు. కానీ అనూహ్యంగా పవన్ తో రాయుడు భేటీ అవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జనసేనకు ప్లస్
అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆయన జనసేనలో చేరితో పార్టీకి లాభం చేరుకుందని జనసైనికులు భావిస్తున్నారు. రాయుడు జనసేనలో చేరితో మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న రాయుడు…సీటు హామీ దక్కితే జనసేన కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.