Janhvi Kapoor vs Sara Tendulkar: జాన్వీ బాయ్‌ఫ్రెండ్‌పై మనసు పడ్డ సారా టెండూల్కర్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీపై బజ్

Best Web Hosting Provider In India 2024

Janhvi Kapoor vs Sara Tendulkar: జాన్వీ కపూర్, శిఖర్ పహారియా లవ్ స్టోరీ చాలా రోజులుగా సాగుతోందని తెలుసు.. ఇటు సారా టెండూల్కర్, క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మధ్య ఏదో నడుస్తోందనీ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓ కొత్త ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్ పై సారా మనసు పడిందని, అందుకే సారాను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ లో అన్‌ఫాలో అయిందని పుకార్లు వస్తుండటం విశేషం.

 

ట్రెండింగ్ వార్తలు

ఫిల్మ్ ఇండస్ట్రీలో గాసిప్స్ కామన్. అందులోనూ బాలీవుడ్ అంటేనే గాసిప్స్ కా బాప్. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ మాత్రం అందరినీ షాక్ కు గురి చేసేదే. నిజానికి ఇది ఎవరూ కనీసం ఊహించి ఉండరు. క్రికెట్ గాడ్ గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ తన గ్లామరస్ లుక్స్ తో మోడల్ ఫిగర్ అనిపించేలా ఉంది.

దీంతో సచిన్ కూతురిగా కంటే కూడా తనకుతానుగా ఆమె చాన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. అందులోనూ టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తో ఆమె ప్రేమాయణం నడిపిస్తోందనీ వార్తలు వచ్చాయి. దీంతో గిల్ ఎక్కడ ఆడుతున్నా.. సారా సారా అంటూ స్టేడియాలు మార్మోగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ బాయ్‌ఫ్రెండ్ వైపు సారా చూడటం ఏంటన్న సందేహాలు సహజంగానే కలుగుతాయి.

జాన్వీ, సారాకు ఎందుకు పడటం లేదు?

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో సారాను జాన్వీ అన్‌ఫాలో చేసిన విషయాన్ని గుర్తించడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. జాన్వీ అకౌంట్లోకి వెళ్లి ఆమె ఫాలో అవుతున్న వాళ్లలో సారా పేరు సెర్చ్ చేస్తే రావడం లేదు. కానీ జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ అకౌంట్లో మాత్రం సారా పేరు ఉంది. అటు సారా కూడా శిఖర్ ను ఫాలో అవుతోంది. దీంతో ఆమెను జాన్వీ అన్‌ఫాలో చేయడానికి కారణం ఇదే అంటూ పలు న్యూస్ సైట్లలో వార్తలు వస్తున్నాయి.

 

నిజానికి ఈ మధ్యే జాన్వీ కాఫీ విత్ కరణ్ షోలో శిఖర్ తో తన రిలేషన్షిప్ ను ఓపెన్ గా చెప్పేసింది. తన స్పీడ్ డయల్స్ లో తండ్రి బోనీ, చెల్లి ఖుషీతోపాటు బాయ్‌ఫ్రెండ్ శిఖర్ నంబరే ఉండటం విశేషం. శిఖర్ చాలా మంచి వాడని, తన తండ్రి, చెల్లితోనూ అతనికి మంచి రిలేషిన్షిప్ ఉందని చెప్పింది. తమ ప్రతి కష్టంలోనూ శిఖర్ అండగా నిలిచాడని తెలిపింది.

జాన్వీ, శిఖర్ చాలా రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నారని, వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు సారా టెండూల్కర్ సీన్లోకి ఎంటర్ కావడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది మాత్రం ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎవరీ శిఖర్ పహారియా?

శిఖర్ పహారియా ఓ ప్రొఫెషనల్ పోలో ప్లేయర్. 2013లో ఓసారి ఇండియా తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు. మంచి హార్స్ రైడర్ కూడా. 13 ఏళ్ల వయసులోనే సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అతని సంపద విలువ రూ.84 కోట్లు. ఇన్‌స్టాగ్రామ్ లో మూడు లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024