Best Web Hosting Provider In India 2024
Saindhav: వెంకటేష్ సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి సినిమాల్లో మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత సైంధవ్ ఎక్కువగా అంచనాలతో రిలీజైంది. కానీ రొటీన్ స్టోరీ, ఎమోషనల్ కనెక్టివిటీ లోపించడంతో సైంధవ్ బాక్సాఫీస్ వద్ద మిస్‌ఫైర్ అయ్యింది.
ట్రెండింగ్ వార్తలు
పాన్ ఇండియన్ మూవీ…
సైంధవ్ మూవీని పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ ప్రచారం చేసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో వేర్వేరుగా ట్రైలర్స్ రిలీజ్ చేశారు. హిందీ ట్రైలర్‌కు దాదాపు వన్ మిలియన్ వరకు వ్యూస్ వచ్చాయి. తమిళ ట్రైలర్‌కు 36 వేల వరకు వ్యూస్ వచ్చాయి. ట్రైలర్స్ రిలీజ్ వరకే సైంధవ్ పాన్ ఇండియన్ రిలీజ్ పరిమితమైంది. థియేటర్లలో తమిళం, హిందీ వెర్షన్స్ రిలీజ్ కానట్లుగా తెలుస్తోంది.
బుక్ మై షో తో పాటు ఇతర టికెట్ బుకింగ్స్ యాప్‌లలో కేవలం సైంధవ్ తెలుగు వెర్షన్స్ టికెట్స్ బుకింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. తమిళం, హిందీ సినిమాల బుకింగ్స్ కనిపించడం లేదు. చెన్నైలో కూడా సైంధవ్ తెలుగు వెర్షన్ టికెట్స్ మాత్రమే చూపిస్తున్నాయి. తమిళ వెర్షన్ టికెట్స్ ఎక్కడ కనిపించడం లేదు. తమిళం, హిందీ వెర్షన్స్ రిలీజ్ కాలేదని తెలుస్తోంది. ప్రమోషనల్ స్ట్రాటజీ కోసమే హిందీ, తమిళ ట్రైలర్స్ రిలీజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
పాన్ ఇండియన్ సినిమా అనే ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఈ పాన్ ఇండియన్ స్ట్రాటజీని ఉపయోగించి సైంధవ్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు అమ్మినట్లు సమాచారం. సైంధవ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై కోట్ల వరకు జరిగింది. ఓటీటీ బిజినెస్‌కు కూడా ఓ పాన్ మూవీ అనే ప్రచారం ఉపయోగపడుతుందని అంటున్నారు.
రెండు రోజుల్లోనే ఎత్తేశారా…
వీకీపీడియాలో మాత్రం జనవరి 13న సైంధవ్ తెలుగు తో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజైనట్లుగా చూపిస్తోంది. తెలుగులో సైంధవ్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు తెలుగులో థియేటర్ల సంఖ్య చాలా తగ్గింది. ఆ ఎఫెక్ట్ కారణంగానే తమిళం, హిందీ వెర్షన్స్ ఫస్ట్ వీకెండ్‌లోనే థియేటర్ల నుంచి ఎత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మూడు రోజుల్లో…
సైంధవ్ మూవీ మూడు రోజుల్లో 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 6.6 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రెండు కోట్ల నలభై లక్షల వసూళ్లను రాబట్టింది. నెగెటివ్ టాక్ కారణంగా మూడో రోజు కోటి ముప్పై లక్షలకు కలెక్షన్స్ పడిపోయాయి. నైజాంలో మినహా మిగిలిన చోట్ల ఈ సినిమా పూర్తిగా తేలిపోయింది. నైజాంలో ఇప్పటివరకు రెండు కోట్లకుపైగా సైంధవ్ మూవీకి కలెక్షన్స్ వచ్చాయి.
డ్యూయల్ షేడ్ క్యారెక్టర్…
సైంధవ్ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇందులో సైంధవ్ అలియాస్ సైకోగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో వెంకటేష్ నటించాడు. తన కూతురిని కాపాడుకోవడానికి తపించే తండ్రిగా ఎమోషనల్ సీన్స్ వెంకటేష్ నటన బాగుందనే కామెంట్స్ వచ్చాయి.
కానీ ఎమోషన్స్ , యాక్షన్ మధ్య కనెక్టివిటీ కుదరకపోవడంతో సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఆండ్రియా నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో కనిపించగా…డాక్టర్‌గా రుహాణిశర్మ నటించింది. విలన్‌గా బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ సైంధవ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ హీరో ఆర్య కీలక పాత్ర పోషించాడు.