Hanuman Movie:ప్రీ రిలీజ్‌కు చిరంజీవి – స‌క్సెస్‌మీట్‌కు బాల‌కృష్ణ – హ‌నుమాన్ ప్ర‌మోష‌న్స్ ప్లానింగ్ అదిరిందిగా

Best Web Hosting Provider In India 2024

Hanuman Movie: సంక్రాంతి సినిమాల్లో హ‌నుమాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. ఐదు రోజుల్లో ఈ మూవీ వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. హిందీలోను దుమ్మురేపుతోన్న ఈ మూవీ మంగ‌ళ‌వారం నాటికి 18 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. హ‌నుమాన్ జోరు చూస్తుంటే ఈజీగా రెండు వంద‌ల కోట్ల మైలురాయిని దాటుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. తెలుగులో ఇర‌వై ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఐదు రోజుల్లోనే యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సాధించింది. నిర్మాత‌ల‌కు ఇర‌వై ఐదు కోట్ల వ‌ర‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. 2024లో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా హ‌నుమాన్ నిలిచింది.

 

ట్రెండింగ్ వార్తలు

హ‌నుమాన్ సినిమా చూసిన బాల‌య్య‌

హ‌నుమాన్ మూవీని మంగ‌ళ‌వారం బాల‌కృష్ణ ప్ర‌త్యేకంగా వీక్షించారు. హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో బాల‌కృష్ణ కోసం హ‌నుమాన్ స్పెష‌ల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటుచేశారు. ఈ షోకు బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌, హీరో తేజా స‌జ్జాతో పాటు కొంత‌మంది టాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. హ‌నుమాన్ చూసిన బాల‌య్య చిత్ర యూనిట్‌పై ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ టేకింగ్‌కు బాల‌కృష్ణ ఫిదా అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డివోష‌న‌ల్ పాయింట్‌ను క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చ‌క్క‌గా చూపించార‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ‌పై బాల‌కృష్ణ ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్లు చెబుతోన్నారు.

స‌క్సెస్ మీట్‌కు బాల‌య్య‌….

త్వ‌ర‌లోనే తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి హ‌నుమాన్ స‌క్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటుచేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ స‌క్సెస్ మీట్‌కు బాల‌కృష్ణ గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం. హ‌నుమాన్ స‌క్సెస్‌పై బాల‌కృష్ణ రియాక్ష‌న్‌ ఏమిట‌న్న‌ది స‌క్సెస్ మీట్‌లోనే రివీల్ కానున్న‌ట్లు స‌మాచారం. బాల‌కృష్ణ హ‌నుమాన్ థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌కు సంబంధించి ఓ స్పెష‌ల్ వీడియోను స‌క్సెస్ మీట్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. హ‌నుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి గెస్ట్‌గా వ‌చ్చాడు. ఇప్పుడు స‌క్సెస్ మీట్‌కు బాల‌కృష్ణ రాబోతున్న‌ట్లు వార్త‌లు రావ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హ‌నుమాన్ మూవీ క‌న్న‌డ వెర్ష‌న్‌ను శివ‌రాజ్‌కుమార్ వీక్షించిన‌ట్లు స‌మాచారం. క‌న్న‌డ స‌క్సెస్ మీట్‌క శివ‌రాజ్‌కుమార్ గెస్ట్‌గా వ‌స్తాడ‌ని అంటున్నారు.

 

బాల‌కృష్ణ‌తో మూవీ…

బాల‌కృష్ణ‌తో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు చ‌క్క‌టి అనుబంధ‌ముంది. బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్ షో ప్రోమోస్‌కు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాల‌కృష్ణ‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లొస్తున్నాయి. బాల‌కృష్ణ‌కు ఓ క‌థ చెప్పిన‌ట్లు హ‌నుమాన్ ప్ర‌మోష‌న్స్‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పాడు. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు రాని డిఫ‌రెంట్ జోన‌ర్‌లో ఈ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. హ‌నుమాన్ స‌క్సెస్ నేప‌థ్యంలో బాల‌కృష్ణ‌, ప్ర‌శాంత్ వ‌ర్మ మూవీ రావ‌డం ప‌క్కా అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంజ‌నాద్రి బ్యాక్‌డ్రాప్‌…

హ‌నుమాన్ మూవీని అంజ‌నాద్రి అనే ఫిక్ష‌న‌ల్ వ‌ర‌ల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. తేజా స‌జ్జా సోద‌రిగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ న‌టించింది. కోలీవుడ్ న‌టుడు విన‌య్ రాయ్ విల‌న్‌గా క‌నిపించాడు. హ‌నుమాన్‌కు జై హ‌నుమాన్ పేరుతో సీక్వెల్ రాబోతోంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024