Devara OTT Rights: రికార్డు ధరకు అమ్ముడుపోయిన దేవర ఓటీటీ హక్కులు..

Best Web Hosting Provider In India 2024

Devara OTT Rights: జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఏంటో దేవర మూవీతో మరోసారి తెలిసొచ్చింది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన దేవర మూవీ పార్ట్ 1 ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రికార్డు ధరకు దక్కించుకున్నట్లు ట్రాక్ టాలీవుడ్ రిపోర్ట్ వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్ పై రాబోయే తెలుగు సినిమాలంటూ ఈ మధ్యే దేవరపై కూడా నెట్‌ఫ్లిక్స్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు

ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం దేవర మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో మూవీ రిలీజ్ కానుండగా.. అన్ని భాషల హక్కులు నెట్‌ఫ్లిక్స్ కే దక్కాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్లకు తారక్ నటించిన సినిమా కావడంతో దేవరపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

దేవర.. ఓటీటీలోకి చాలా ఆలస్యంగా..

దేవర మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఈ మధ్యే నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ వెల్లడించాడు. అయితే మేకర్స్ తో కుదిరిన ఒప్పందం మేరకు థియేటర్లలో సినిమా రిలీజైన 56 రోజుల తర్వాత గానీ దేవర మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం లేదు. సాధారణంగా ఈ మధ్యకాలంలో నెల నుంచి 45 రోజుల మధ్య సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

అయితే దేవర మూవీకి ఉన్న హైప్ నేపథ్యంలో థియేట్రికల్, ఓటీటీ రిలీజ్ కు మధ్య గ్యాప్ కాస్త ఎక్కువ ఉండాలని మేకర్స్ స్పష్టం చేశారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై నెలకొన్న ఆసక్తి నేపథ్యంలో ఈ భారీ మొత్తం చెల్లించడానికి నెట్‌ఫ్లిక్స్ వెనుకాడలేదు. ఈ మధ్యే ఆ సంస్థ సీఈవో హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను కలిశాడు.

 

అప్పుడే మూవీ డీల్ కుదిరినట్లు స్పష్టమవుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో నార్త్ బెల్ట్ లోనూ తారక్ స్టార్ అయిపోయాడు. అయితే ఈ దేవరలో మాత్రం బాలీవుడ్ అట్రాక్షన్ కోసం జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లను తీసుకొచ్చారు. జాన్వీ ఫిమేల్ లీడ్ కాగా.. సైఫ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తోంది.

దేవర రెండు భాగాలుగా రానుండగా.. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఆ లెక్కన జూన్ మొదటి వారంలోగానీ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఈ మధ్యే దేవర గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు. సముద్రంలో రక్తపుటేరులు పారిస్తూ.. తారక్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. ఈ గ్లింప్స్ లోని యాక్షన్ సీన్స్ రక్తి కట్టించేలా ఉన్నాయి.

చిరంజీవికి ఆచార్యలాంటి డిజాస్టర్ ఇచ్చినా కూడా తనకు జనతా గ్యారేజ్ తో సక్సెస్ అందించిన కొరటాల శివపై నమ్మకంతో ఈ భారీ బడ్జెట్ మూవీ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించాడు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024