Brahmamudi January 18th Episode: రుద్రాణి కంటే ఘోరంగా అనామిక.. కావ్యపై కన్నింగ్ ప్లాన్.. లీకైన రాజ్ శ్వేత పర్సనల్ వీడియో

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో శోభనం గదిలో అప్పు, కావ్య ప్రస్తావన తీసుకొస్తున్నాడని అనామిక హాల్లో పడుకుంటుంది. అది చూసి కావ్యపై ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. రాహుల్‌తో నువ్ లేచిపోయి పెళ్లి చేసుకున్నావ్.. రాజ్‌తో ముసుగు వేసుకుని పెళ్లి పీటలపై కూర్చున్నావ్. కానీ, నా కోడలు అలా రాలేదు. ప్రేమించి.. ఇంట్లో వాళ్లందరని ఒప్పించి పెళ్లి చేసుకుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు

ఇంట్లో గొడవలు

దాంతో కల్యాణ్.. రేయ్ ఏంట్రా ఇది.. ఈ గొడవలు ఏంటీ.. అసలు ఒక్కదానికైనా సంబంధం ఉందా.. ఏ విషయం దేనికి ముడి పెడుతున్నారు.. అనామికను గదిలోకి తీసుకెళ్లి సర్ది చెప్పుకో అని రాజ్ కోపంగా అంటాడు. దాంతో అపర్ణ మధ్యలో.. రాజ్.. ముందు నువ్ నీ పెళ్లానికి చెప్పుకో. తర్వాత నీ తమ్ముడికి తన భార్య గురించి చెబుదువు గానీ. అసలు ఇంతకుముందు ఈ ఇంట్లో గొడవలు ఉన్నాయా. స్వప్న వచ్చాకా కొన్ని రోజులు. కావ్య వచ్చాక మరికొన్ని రోజులు. ఇప్పుడు అప్పుతో ఇంకొన్ని రోజులు అని అపర్ణ అంటుంది.

ఆ కుటుంబం వల్లే ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. లేకుంటే ఉండేవా. ముందు నీ పెళ్లానికి చెప్పు అన్నింట్లో తలదూర్చకని అపర్ణ రాజ్‌పై ఫైర్ అవుతుంది. దాంతో బాధతో ఏడుస్తూ పైకి వెళ్లిపోతుంది కావ్య. తనవెంటే రాజ్ కూడా వెళ్లిపోతాడు. ఎక్కడి గొడవ ఎక్కడికీ దారి తీసింది. అమ్మా అనామిక భార్యభర్తల గొడవ గది వరకే ఉంచుకోవాలి. వెళ్లమ్మ.. కల్యాణ్ తీసుకెళ్లు అని ఇందిరాదేవి అంటుంది. అందరినీ వెళ్లిపోమ్మంటుంది.

ఈ ఇంట్లోనే జరుగుతుంది

ఏంటీ బావ ఇది.. కావ్యపై ధాన్యలక్ష్మి, అపర్ణ అంత కోపం చూపిస్తున్నారు అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత బెడ్ పక్కన కూర్చుని కావ్య ఏడుస్తూ ఉంటుంది. రాజ్ వచ్చి కావ్య పక్కన కూర్చుని.. నాకు నిన్ను బాధ పెట్టడమే తెలుసు కానీ, ఓదార్చడం తెలీదు. ఇప్పుడు నేను ఏం చేస్తే నీకు ప్రశాంతంగా ఉంటుందని రాజ్ అడుగుతాడు. భార్య బాధలో ఉంటే భర్త వచ్చి ఏ పద్ధతిలో ఓదార్చడం అని అడగడం ఈ ఇంట్లోనే జరుగుతుంది అని కావ్య అంటుంది.

 

చెప్పా కదా. నాకు తెలీదు అని. ఒకరితో మాట్లాడేందుకు ఒక్కొక్కరికీ ఒక్కో కొలమానం ఉంటుంది. బంధం వద్దనుకుంటే గట్టిగా సమాధానం చెప్పొచ్చు. కానీ, ఆ బంధాలతో ఉండేవాళ్లం వాళ్లు బాధపడకుండా ఉండేలా మాట్లాడుతాం. అదే ఓ కుటుంబంలో జరుగుతుంది. అందుకే ఎవరిని ఏం అనలేం అని రాజ్ అంటాడు. మీరు ఇలా కూడా మాట్లాడతారని నాకు ఇవాలే తెలిసింది. నేను కూడా ఇదే ఫిలాసఫీ ఫాలో అవుతాను. అందుకే మా స్వప్న అక్కలా నేను వెంటనే మాటలు అనేయను అని కావ్య అంటుంది.

ఉమ్మడి కుటుంబం

ఇప్పుడు కల్యాణ్ పరిస్థితే ఎలా ఉంటుందో. ఎంత సతమతం అవుతున్నాడో. ఇన్నాళ్లు ప్రేక్షకుడిగా చూశాడు. ఇప్పుడు వాడే బాధ్యతగా మెలిగాలి. వాడి భావ కవిత్వం లాగా జీవితం ఉండదని వాడికి ఫస్ట్ నైట్ రోజే అర్థమై ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మీ పిన్ని.. ఇలా కూడా మాట్లాడగలదని ఈ మధ్యే తెలిసింది. ఇలా అన్ని రకాల మనసత్వాలతో కలుపుకుపోతోనే ఉమ్మడి కుటుంబం నిలబడుతుంది అని రాజ్ అంటాడు. కృష్ణుడి గొప్పదనం గురించి చెప్పిన కావ్య.. గాయాలకు తన వేణుగానం నవనీతంలా ఉంటుందని అంటుంది.

నేను కూడా నా గాయాన్ని ఇవాళే మానుపుకుంటాను. ఇంకా ఎన్ని గాయాలు అవుతాయో అని చెప్పిన కావ్య.. రాజ్‌ భుజంపై ప్రేమగా, ఆప్యాయంగా వాలుతుంది. ఓదార్చడం తెలియదంటూనే ఓదార్చారు. మీరు నా పక్కన ఉంటే గోవర్ధన గిరిని కూడా ఎత్తగలను అని అనిపిస్తుంది అని కావ్య అంటుంది. దాంతో రాజ్ కాస్తా ఇబ్బందిగా.. ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు తల్లిదండ్రులకు అనామిక కాల్ చేస్తుంది. మనం అనుకున్నట్లుగానే నా ఫస్ట్ నైట్ చెడగొట్టుకున్నాను అని అనామిక చెబుతుంది.

 

అది చెడ్డది అవ్వాలి

అందరూ కావ్య వల్లే గొడవ అయిందని కోప్పడ్డారు. ఇప్పుడు వెళ్లి తనకు సారీ చెబుతాను అని అనామిక అంటే.. ఇంత చేసి మళ్లీ సారీ చెప్పడం ఏంటీ బేబీ అని తండ్రి అంటాడు. ఇప్పుడు అలా చేస్తేనే నేను అందరిముందు మంచిదాన్ని అవుతాను. తనకంటే మంచిదాన్ని అవుతాను. అందరికీ కోపం పోయించినదాన్ని మళ్లీ తెప్పించనా. అది చెడ్డది అవ్వాలి. కానీ, నా వల్ల అయినట్లు ఉండకూడదు. దాని ప్రవర్తన వల్లే అవ్వాలి అని అనామిక కాల్ కట్ చేస్తుంది.

కావ్య దగ్గరికి వెళ్లీ సారీ చెబుతుంది. నువ్ క్షమిస్తేనే కల్యాణ్ నన్ను భార్యగా అంగీకరిస్తాడు. నేను శోభనం గదిలో నుంచి వచ్చేస్తే.. అంతటితో ఆగిపోతుంది అనుకున్నాను. కానీ, ఇంత జరుగుతుంది అనుకోలేదు అని పెద్ద డ్రామా ప్లే చేస్తుంది అనామిక. నువ్ పెద్ద మనసుతో సారీ చెబితే అర్థం చేసుకునే పెద్ద మనసు వాళ్లు ఇక్కడ ఎవరు లేరు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి ఎగ్జాంపుల్ మా భార్యనే అని ప్రకాశం కౌంటర్ వేస్తాడు.

అపర్ణకు స్వప్న పంచ్

అదంతా నాకు తెలీదు అత్తయ్య. కానీ, కల్యాణ్‌కు కావ్య అంటే కన్నతల్లితో సమానం. వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకూడదు. అందుకే సారీ చెబుతున్నా అని అనామిక అంటుంది. ఇన్నాళ్లకు దుగ్గిరాలకు కరెక్ట్ అయిన కోడలు వచ్చిందని అపర్ణ అంటుంది. అంటే, ఇంతకుముందు రాలేదానా అని స్వప్న అంటుంది. దానర్థం అదే కదా అని అపర్ణ అంటుంది. మా కంటే ముందు మీరు వచ్చారు. మీరు కూడా కరెక్ట్ కోడళ్లు కాదా అని స్వప్న సాలిడ్ పంచ్ ఇస్తుంది.

 

ఏయ్.. ఏమన్నావ్ అని అపర్ణ లేస్తుంది. నిజమే కదా. రాజుగారి చిన్న పెళ్లాం మంచిది అంటే.. మిగతా వారు కాదనేగా. మీరు అనామికను మెచ్చుకోండి. కానీ, నన్ను కావ్యను లాగకండి అని స్వప్న అంటుంది. ఊరుకోమని ఇందిరాదేవి అంటుంది. అనామిక, నీకు కవిగారు మీకు నేను చెప్పేది ఒక్కటే. నా గురుంచి గానీ, అప్పు గురించి కానీ ఈ ఇంట్లో ఎవరూ మాట్లాడుకునే అవకాశం ఇవ్వొద్దు. మమ్మల్ని లాగొద్దు. మీరు కొత్తగా పెళ్లయిన వాళ్లు.. మీ గురించి మీరు మాట్లాడుకోండి. ఈరోజు నుంచి అనామికకు సంబంధించిన ఏ విషయంలోనూ నా జోక్యం ఉండదు అని చెప్పేసి వెళ్లిపోతుంది కావ్య.

నేను నడవగలను

దాంతో ఒక్క దెబ్బతో ఇంట్లో అందరి ముందు మంచిదాన్ని అనిపించుకున్నాను. కావ్య మా విషయంలో జోక్యం చేసుకోకుండా చూసుకున్నాను. అది అనామిక అంటూ రుద్రాణి కంటే కన్నింగ్‌గా చేస్తుంది. మరోవైపు అప్పు బెడ్ మీద నుంచి లేచి వస్తుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. అప్పు మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. కానీ, పడబోతుంటే పట్టుకునేందుకు అందరూ వస్తారు. ఆగండి. నేను నడవగలను అని నడిచేందుకు ప్రయత్నిస్తుంది అప్పు.

మళ్లీ పడబోతుంటే.. పట్టుకుంటారు. అప్పు ఇప్పుడు నడవడం అవసరమా. కనీసం నన్ను పట్టుకోనైనా నడువు అని కనకం అంటుంది. ఇంకా ఎన్నాళ్లు ఇలా పట్టుకునే నడవాలి. నాకు నేనుగా నడుస్తా. పడిపోతే మళ్లీ లేస్తా. గాయం అయిందిగా. ఇవాళ నడుస్తా. రేపు పరిగెత్తుతా. ఎల్లుండి సైకిల్ తొక్కుతా అని అప్పు అంటుంది. నువ్ ఎప్పుడు మా మాట విన్నావే. పరికిణి వేసుకోలేదు. జుట్టు కత్తిరించుకున్నావ్. మగరాయుడులా పెరుగుతావ్ అనుకుంటే ఆఖరుకు అమ్మాయివి అయ్యావ్ అని కనకం అంటుంది.

 

రాజ్ శ్వేత వీడియో

అమ్మాయివి కాకుంటే మనసు ఇచ్చేదానివి కాదు. ఇలా అందరం బాధపడేవాళ్లం కాదు అని కనకం అంటుంది. అమ్మా మర్చిపోవాలని అనుకుంటున్న యాక్సిడెంట్‌ను ఎందుకు గుర్తు చేస్తున్నావ్ అని అప్పు అంటుంది. కనకం తనకు నచ్చినట్లు చేయని అని కృష్ణమూర్తి అంటాడు. తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ సెక్రటరీ కాల్ చేసి రాజ్ సర్ ఉన్నాడా. ఆఫీస్‌లో లేరు. కాల్ చేస్తే కట్ చేస్తున్నారు. రేపటి వరకు డిజైన్స్ పూర్తి కావాలన్నారు అని చెబుతుంది.

సరే నాకు మెయిల్ చేయి అని కావ్య అంటుంది. మరోవైపు శ్వేతతో రాజ్ చనువుగా మాట్లాడుతుంటాడు. దాన్ని ఎవరో రహస్యంగా వీడియో తీస్తారు. ఆ వీడియోను కావ్యకు పంపుతారు. ఆ వీడియోలో రాజ్, శ్వేతను చనువుగా చూసి కావ్య షాక్ అవుతుంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024