Best Web Hosting Provider In India 2024
Fight Club OTT Release: కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌గా మారి తమిళంలో ఫైట్ క్లబ్ సినిమాను నిర్మించారు. విజయ్ కుమార్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఫైట్ క్లబ్ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతంది. ఫైట్ క్లబ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) దక్కించుకున్నది.
ట్రెండింగ్ వార్తలు
ఫిబ్రవరి 2న ఫైట్ క్లబ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఫైట్ క్లబ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ఫై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలిసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫైట్ క్లబ్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
గోవింద్ వసంత మ్యూజిక్…
ఫైట్ క్లబ్ మూవీకి అబ్బాస్ ఏ రహమత్ దర్శకత్వం వహించాడు. మోనీషా మోహన్ మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ యాక్షన్ మూవీకి 96 ఫేమ్ గోవింద్ వసంత మ్యూజిక్ అందించాడు. లోకేష్ కనగరాజ్ ఫస్ట్ టైమ్ నిర్మించిన సినిమా కావడంతో ఈ చిన్న సినిమా తమిళ ప్రేక్షకుల్లో బజ్ ఏర్పడింది.
అబ్బాస్ ఏ రహమత్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఫొటోగ్రఫీ, మ్యూజిక్కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కుమార్ యాక్టింగ్‌తో మెప్పించాడు. డిసెంబర్ 15న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. సలార్ వం
నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో
నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు అబ్బాస్ ఏ రహమత్ ఫైట్ క్లబ్ సినిమాను తెరకెక్కించారు. బెంజి అండదండలతో గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరుతెచ్చుకోవాలని సెల్వ (విజయ్ కుమార్) కలలు కంటాడు. బెంజిని అతడి సోదరుడు జోసెఫ్ (అవినాష్ రఘుదేవన్) చేత కిర్బా (శంకర్ థాస్) అనే రౌడీ చంపిస్తాడు. ఈ మర్డర్ కేసులో జోసెఫ్ జైలుకు వెళతాడు.
బెంజి మరణంతో ఫుట్‌బాల్ ఆటకు దూరమైన సెల్వ స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. జైలు నుంచి విడుదలైన జోసెఫ్… కిర్బా తనను మోసం చేశాడని గ్రహిస్తాడు. పొలిటీషియన్‌గా మారిన కిర్బాపై సెల్వ ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని జోసెఫ్ అనుకుంటాడు . జోసెఫ్ మోసాన్ని సెల్వ తెలుసుకున్నాడా? వారిద్దరి పగప్రతీకారాల కారణంగా జోసెఫ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే ఫైట్ క్లబ్ మూవీ కథ. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు అబ్బాస్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఐదు కోట్ల బడ్జెట్…
ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఫైట్ క్లబ్ మూవీ థియేటర్లలో ఇరవై కోట్ల వరకు గ్రాస్ , తొమ్మిది కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది. తొలిరోజే ఈ మూవీకి రెండు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాతలకు నాలుగు కోట్లకుపైగా లాభాల్ని తెచ్చిపెట్టింది