Balakrishna Review On Hanuman: హనుమాన్‌పై బాలకృష్ణ రివ్యూ.. మొదలైన ఆ గుసగుసలు.. ఆయన ఏమన్నారంటే?

Best Web Hosting Provider In India 2024

Balakrishna Review On Hanuman: హనుమాన్ మూవీ కన్నుల పండగలా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా చిత్రాన్ని అద్భుతంగా తీశారు అని నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రశంసించారు. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ హనుమాన్. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొంటూ ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

 

ట్రెండింగ్ వార్తలు

తాజాగా హనుమన్ చిత్రాన్ని వీక్షించారు నందమూరి బాలకృష్ణ. అనంతరం చిత్ర యూనిట్‌ని ఆయన అభినందించారు. “హనుమాన్ లో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇప్పుడున్న టెక్నిక్‌ని బ్రహ్మాండంగా వాడుకొని దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. హనుమాన్ కన్నుల పండగలా ఉంది. శ్రీరాముడు, ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో ప్రేక్షకులకు అద్భతమైన చిత్రాన్ని అందించారు. సినిమా మేకింగ్‌లో చాలా ప్యాషన్ కనిపించింది” అని బాలకృష్ణ ప్రశంసించారు.

“చిత్ర నిర్మాతని కూడా కెప్టెన్ అఫ్ ది షిఫ్ అనాలి. సినిమా తీయడానికి రెండున్నరేళ్లు పట్టిందదంటే మామూలు విషయం కాదు. ఇలా చేయాలంటే చాలా ప్యాషన్ కావాలి. అందుకు నిర్మాత నిరంజన్ రెడ్డిని అభినందించాలి. డైరెక్టరే కాదు నిర్మాతల సపోర్ట్ వల్ల కూడా ఈ మూవీ అంత బాగా వచ్చింది. అన్ని క్రాఫ్ట్స్ అద్భుతమైన పనితీరు కనపరిచాయి. డైరెక్షన్, ఫోటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్, నటీనటులు.. ఇలా అందరూ ఎక్స్‌ట్రార్డినరిగా పెర్ఫార్మ్ చేశారు” అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

“అన్నీ వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా చేశారు. హనుమాన్ టీం అందరికీ అభినందనలు. హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాను” అని నందమూరి నటసింహం బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా ఓ విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మను పొగిడిన బాలకృష్ణ ఆయనతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.

 

గతంలో కూడా బాలయ్యతో ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్నారని, ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు జరిగనట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు హనుమాన్‌ను బాలకృష్ణ ప్రశంసించడంతో ఆ వార్తలు మళ్లీ జోరందుకున్నాయి. అయితే, నిజమా, కాదా అనేది క్లారిటీ లేదు. కానీ, ఒకవేళ నిజమైతే బాగుంటుందని, కచ్చితంగా సినీ ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ వస్తుందని అంటున్నారు. కాగా ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్తుందా.. లేదా వట్టి రూమర్స్ వరకే ఆగిపోతుందా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శలు ప్రసంశలు అందుకొని బాక్సాఫీసు వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇందులో హీరోగా తేజ సజ్జ చేస్తే.. హీరోయిన్‌గా అమృత అయ్యర్ చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, దీపక్ శెట్టి, సముద్ర ఖని, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024