Crab Curry : పీతల కర్రీ తయారీ విధానం ఇదే.. చాలా సింపుల్

Best Web Hosting Provider In India 2024

తెలుగు రాష్ట్రాల్లో పీతల కర్రీని పెద్దగా పట్టించుకోరు కానీ ఇతర రాష్ట్రాల్లో దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సముద్రతీరం ఉన్న ప్రాంతాల్లో వండుకుని తింటుంటారు. పీతలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. సరిగా వండితే మంచి రెసిపీ అవుతుంది. వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులభం. తక్కువ సమయంలో నోరూరించేలా తయారు చేసుకోవచ్చు. పీతల కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం..

 

ట్రెండింగ్ వార్తలు

పీతల కర్రీకి కావాల్సిన పదార్థాలు

1 కిలోల పీత,100 గ్రాముల ఆవాల నూనె, 2 ఎండు మిరపకాయలు, 3 బే ఆకులు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 200 గ్రాముల తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 10 గ్రాముల వెల్లుల్లి, 30 గ్రాముల టమోటాలు, 1 టీస్పూన్ పసుపు పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఎర్ర కారం పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 100 గ్రాముల కొబ్బరి పొడి, రుచికి ఉప్పు, గార్నిషింగ్ కోసం తరిగిన కొత్తిమీర ఆకులు.

పీతల కర్రీ తయారీ విధానం

1. ముందుగా పీతలను గోరువెచ్చని నీటిలో బాగా శుభ్రం చేసి ముక్కలుగా కోయండి.

2. పసుపు పొడి, ఎర్ర మిరప పొడి, ఉప్పుతో పీతలను 20 నిమిషాలు మ్యారినేట్ చేయండి.

3. బాణలిలో ఆవాల నూనె వేసి వేడి చేయండి. జీలకర్ర, బే ఆకులు, ఎండు మిరపకాయలను వేయాలి. జీలకర్ర ఉడికినప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. తర్వాత వెల్లుల్లి, అల్లం వేసి కొన్ని నిమిషాలు కలపాలి.

4. ఇప్పుడు అందులో టమోటాలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పసుపు, ధనియాల పొడి, ఎర్ర కారం, గరం మసాలా వేయించాలి.

 

5. తర్వాత దానికి మ్యారినేట్ చేసిన పీత వేయాలి. రుచి ప్రకారం ఉప్పు, జోడించండి. 1/2 కప్పు నీరు, కొబ్బరి పొడి వేసి మూతపెట్టాలి. 15-20 నిమిషాలు లేదా పీతలు ఉడికేంత వరకూ తక్కువ వేడి మీద ఉడికించాలి.

6. తర్వాత తరిగిన కొత్తిమీరతో గార్మిష్ చేసుకోవాలి. అన్నంతో వేడిగా సర్వ్ చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024