Fear Movie: తెలుగులో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్.. మల్టీ డైమన్షన్స్ పాత్రతో వేదిక రీ ఎంట్రీ

Best Web Hosting Provider In India 2024

Vedhika Fear Movie: హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ఫియర్. జనవరి 17న హైదరాబాద్‌లో ఫియర్ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఫియర్ మూవీని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోగినేని ఫియర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

తాజాగా జరిగిన ఫియర్ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో నటులు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా.. డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వేదిక తన అనుభవాలను పంచుకుంది. “ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది” అని వేదిక తెలిపింది.

“నేను తెలుగులో కాంచన, రూలర్ సినిమాల్లో నటించాను. ఓ వెబ్ సిరీస్ చేశాను. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కథలో నటించలేదు. డైరెక్టర్ హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ కథ నాకు చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. స్టోరీ, క్యారెక్టర్స్ డిజైన్ లో హరిత చాలా క్లారిటీగా ఉన్నారు. కొత్త డైరెక్టర్ అని నాకు అనిపించలేదు. దత్తాత్రేయ మీడియా సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉంది. అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ తో ఫియర్ మూవీ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని వేదిక చెప్పుకొచ్చింది.

 

“డైరెక్షన్ చేయడం అనేది నా డ్రీమ్ కాదు డెస్టినీ అనుకుంటాను. దత్తాత్రేయ మీడియా నా ఫ్యామిలీ బ్యానర్ లాంటిది. ఇవాళ మా ఫియర్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుంది అనేది ఆలోచిస్తూ ఏడాదిపాటు ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ స్క్రిప్టుకు వేదిక లాంటి మంచి హీరోయిన్ దొరకడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ఎంతో ఎంకరేజింగ్ గా ఉంది. మంచి టీమ్ నాకు దొరికింది. వీరి సహాయంతో నేను అనుకున్న స్క్రిప్ట్ తో ఇన్ టైమ్ లో సినిమా రూపొందించి ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాను” అని డైరెక్టర్ హరిత గోగినేని తెలిపారు.

“ఫియర్ మూవీలో ఒక స్పెషల్ రోల్‌లో నటిస్తున్నాను. డైరెక్టర్ హరిత గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా ప్రతి సీన్ కళ్ల ముందు చూస్తున్నట్లు అనిపించింది. ఈ మూవీలో పార్ట్ అ‌వడం హ్యాపీగా ఉంది. మా సినిమా బ్యానర్ లో రాసినట్లు.. ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీగా ప్రేక్షకులకు అందిస్తాం. వేదిక గారితో కలిసి పనిచేస్తున్నాను. అలాగే నా ఫేవరేట్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ గారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అనూప్ గారు మంచి మ్యూజిక్ చేస్తున్నారు. ఒక సాంగ్ ఆల్రెడీ విన్నాను. అద్భుతంగా వచ్చింది” అని హీరో అరవింద్ కృష్ణ పేర్కొన్నారు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024