DNS Shooting Starts: క్రేజీ కాంబినేషన్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్, నాగార్జున, రష్మిక మూవీ ప్రారంభం

Best Web Hosting Provider In India 2024

DNS Shooting Starts: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం గురువారం (జనవరి 18) హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ మల్టీస్టారర్ లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును #DNSగా పిలుస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

ఇండియన్ సినిమాలో క్రేజీయెస్ట్ కాంబినేషన్ గా దీనిని చెప్పొచ్చు. నాగార్జున, రష్మిక, ధనుష్ లతో శేఖర్ కమ్ములలాంటి డైరెక్టర్ మూవీ తీయడం అంటేనే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి క్రియేటైంది. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల ఇంగ్లిష్ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని ప్రస్తుతం ఈ సినిమాను డీఎన్ఎస్ గా పిలుస్తున్నారు. ఈ మధ్యే సంక్రాంతి సినిమాలతో వచ్చి హిట్ కొట్టిన నాగార్జున, ధనుష్.. ఇప్పుడు కలిసి పని చేయనుండటం విశేషం.

ధనుష్‌తో షూటింగ్ మొదలు

ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాతలు నోరు మెదపకపోగా, బుధవారం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తొలిరోజు ధనుష్ కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయగా, ఈ నెలలోనే ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు మేకర్స్. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూజా కార్యక్రమంలో ధనుష్, శేఖర్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మిని తీసుకున్నారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణులను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

 

శేఖర్ గత చిత్రాలు ఫిదా, లవ్ స్టోరీ భారీ విజయాలు సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళంలో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సంక్రాంతికి జనవరి 12న విడుదల కాగా, తెలుగులో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తన 50వ ప్రాజెక్ట్ షూటింగ్ పురోగతిలో ఉన్న ఈ నటుడు తిరిగి రచన, దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. #D50 నిత్యామీనన్, ఎస్.జె.సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నాగార్జున నటించిన నా సామి రంగా జనవరి 14న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నటుడు ఇంకా మరే ఇతర ప్రాజెక్టులను ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన స్క్రిప్టులు వింటున్నారని, ఇంకా వాటిని ఫైనల్ చేయలేదని టాక్. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో నటించిన రష్మిక త్వరలో తెలుగులో రెయిన్బో, ది గర్ల్‌ఫ్రెండ్, హిందీలో చావా చిత్రాల్లో కనిపించడమే కాకుండా సుకుమార్ ‘పుష్ప: ది రూల్’లో శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.

డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ తో శేఖర్ కమ్ముల తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆనంద్, హ్యాపీడేస్ లాంటి సినిమాలు యూత్ ను అట్రాక్ట్ చేస్తూ కమర్షియల్ గానూ సక్సెస్ సాధించాయి. అలాంటి డైరెక్టర్ తో ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్ అంటే ఓ డిఫరెంట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఖాయంగా కనిపిస్తోంది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024