NNS January 18th Episode: తన మీద ఒట్టేసుకున్న మిస్సమ్మ.. అసలు దొంగను కనిపెట్టే పనిలో అమర్​.. నీల గుండెల్లో భయం

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam 18th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 18th January Episode) అరుంధతిని చంపిన హంతకుడు బ్లాక్​మెయిల్​ చేయడంతో డబ్బుల కోసం అమర్ ఇంట్లో దొంగతనం చేస్తుంది మనోహరి. ఆ దొంగతనాన్ని మిస్సమ్మ మీదకు తోసి ఇంట్లో నుంచి పంపించివేయడానికి ప్లాన్​ చేస్తుంది. అయితే మనోహరి మాటలు అమర్​ ఇంట్లో​ ఎవరూ నమ్మకపోవడంతో చిరాకుపడుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు

కంగారుగా పరుగెత్తుకుంటూ

మనోహరి ఎందుకు మిస్సమ్మపై దొంగతనం మోపుతుందో అర్థంకాని అరుంధతి పరిగెత్తుకుంటూ వచ్చి చిత్రగుప్తుడితో జరిగిందంతా చెబుతుంది. మిస్సమ్మ అలాంటి పని చేసుండదని అరుంధతి, చిత్రగుప్తుడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో తండ్రి రామ్మూర్తి దగ్గర నుంచి మిస్సమ్మ తిరిగి వస్తుంది. భాగమతిని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్​ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికెళ్లావని అడుగుతుంది అరుంధతి.

తను ఇంట్లో లేనని, తన మొబైల్​ ఇంట్లోనే ఉందని మీకెలా తెలుసు అని అరుంధతిని అడుగుతుంది మిస్సమ్మ. దాంతో నువ్ దొంగతనం చేశావని అనుకుంటున్నారని ఇంట్లో జరిగిందంతా చెబుతుంది అరుంధతి. ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్పడంతో కంగారు పడుతుంది మిస్సమ్మ. చిత్రగుప్తుడు కూడా జరగబోయేది అదేనని చెప్పడంతో కంగారుగా ఇంట్లోకి వెళ్తుంది భాగమతి. మిస్సమ్మ రాకకోసం వేచి చూస్తున్న మనోహరి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బులెక్కడ అని అడుగుతుంది.

అందుకే ఫోన్ తీసుకెళ్లలేదు

ఆ మాట విన్న మిస్సమ్మ ఒక్కసారిగా షాకవుతుంది. దాంతో అమర్​ తల్లిదండ్రులు మనోహరిని మందలిస్తారు. మిస్సమ్మనే దొంగతనం చేసిందని ఎలా నిర్ధారిస్తావని మనోహరిపై అమర్ పేరెంట్స్ కోప్పడతారు. అయినా వాళ్ల మాటలు వినకుండా మిస్సమ్మని నిలదీస్తూనే ఉంటుంది మనోహరి. దాంతో తన తండ్రికి ఆరోగ్యం బాలేదని కల వస్తే చూడ్డానికి పరిగెత్తానని, ఆ కంగారులో ఫోన్​ కూడా తీసుకెళ్లలేదని వివరించి చెబుతుంది మిస్సమ్మ.

 

తన కుటుంబం గురించి ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని.. అంటే కావాలనే దాచావంటూ మాట్లాడుతుంది మనోహరి. అలా కాదని, తన గురించి చెప్పే సిట్యూవేషన్​ రాకపోవడంతో చెప్పలేదని చెబుతుంది భాగమతి. డబ్బులు ఏమయ్యాయో నిజంగా తనకి తెలిదని ఒట్టు కూడా పెట్టుకుంటుంది భాగమతి. అది చూసి అమర్​‌తోపాటు అమర్​ తల్లిదండ్రులు, పిల్లలు, రాథోడ్​ కూడా మిస్సమ్మని చూసి బాధపడతారు. తాను డబ్బులు తీసి ఉండదని అంతా అనుకుంటారు.

దొంగ అనే ముద్ర

జరుగుతున్నదంతా చూస్తున్న అరుంధతి కూడా బాధపడుతుంది. తాను దొంగతనం చేయలేదని మిస్సమ్మ ఏడుస్తుండటం చూసి ఓదార్చి లోపలికి వెళ్లమని చెబుతారు అమర్ తల్లిదండ్రులు. మనోహరి మాత్రం అమర్​ దగ్గరకి వెళ్లి మిస్సమ్మనే డబ్బులు తీసి ఉంటుందని అంటుంది. ఎవరు తీసారో తాను కనుక్కుంటానని చెబుతాడు అమర్. అసలు నిజం బయటపడితే తన ఉద్యోగం పోవడమే కాదు దొంగ అని ముద్ర పడుతుందని భయపడుతుంది నీల.

అదే విషయాన్ని మనోహరితో చెబుతుంది పని మనిషి నీల. కంగారులో నిజం చెప్పావంటే చంపేస్తానని బెదిరిస్తుంది మనోహరి. జరిగిన దానికి బాధపడుతున్న మిస్సమ్మను ఓదారుస్తాడు రాథోడ్​. పిల్లలు కూడా మిస్సమ్మను చూసి బాధపడతారు. మిస్సమ్మ దొంగతనం చేయలేదని తెలిసిన అరుంధతి ఏం చేస్తుంది? అసలు దొంగ ఎవరనేది అమర్​ కుటుంబం ఎలా తెలుసుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే జనవరి 19న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024