Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu January 19th Episode: పెండింగ్‌లో ఉన్న కాలేజీ పనులు పూర్తిచేసే పనిలో ఉంటుంది వసుధార. ఆమెకు సాయం చేయడానికి మహేంద్ర, అనుపమ వస్తారు. ఆ సమయంలో రిషితో గడిపిన ఆనందక్షణాలను గుర్తుచేసుకుంటుంది వసుధార. అవన్నీ గుర్తుకురాగానే వసుధార సంతోషంతో ఆమె ముఖం వెగిలిపోతుంది. ఒకటా రెండా…రిషితో వందల జ్ఞాపకాలు, వేల అనుభవాలు ఉన్నాయని, అవన్నీ కళ్ల ముందు కదలాడుతున్నాయని, అవి ఎప్పుడు గుర్తొచ్చినా నా ముఖంపై చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుందని అనుపమతో అంటుంది వసుధార.
ట్రెండింగ్ వార్తలు
రిషితో పరిచయం…
రిషితో నీ పరిచయం ఎలా జరిగిందని వసుధారను అడుగుతుంది వసుధార. స్టూడెంట్‌లా తాను డీబీఎస్‌టీ కాలేజీలో అడుగుపెట్టానని వసుధార ఆన్సర్ ఇస్తుంది. స్టూడెంట్‌గా కాలేజీలో చేరడానికి ఒప్పుకోని రిషి సార్ ఆ తర్వాత తన హృదయంలో చోటు ఇచ్చాడని అంటుంది.
రిషి తనకు ఐ లవ్ యూ చెప్పిన క్షణాలను, తన మెడలో తాళి కట్టిన రోజును గుర్తుచేసుకుంటుంది వసుధార. రిషి నా లైఫ్‌లో మిరాకిల్. రిషి నాతో ఎన్నో సంతోషాలు, బాధలు పంచుకున్నారు. కానీ ఇప్పుడు రిషి బాధను పంచుకోవడానికి నేను పక్కన లేనని వసుధార ఎమోషనల్ అవుతుంది.
రిషి కళ్లలో నీళ్లు…
రిషి లాంటి వ్యక్తి జీవితభాగస్వామి కావాలంటే పెట్టి పుట్టాలని మహేంద్ర అంటాడు. వసుధార లాంటి అమ్మాయి దొరకడం కూడా రిషి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమని అనుపమ చెబుతుంది. రిషి నిన్ను ఎంతగా ఇష్టపడతాడో నువ్వు అంతకంటే ఎక్కువగా అతడిని ప్రేమిస్తుంటావని వసుధారతో అంటుంది అనుపమ.
తన మీద మొదట నీకు గౌరవం ఏర్పడింది. ఆ తర్వాత అదే ప్రేమగా మారింది కాబట్టే మీ బంధం బలంగా మారిందని అనుపమ చెబుతుంది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేసిన రోజు రిషి కళ్లల్లో నీళ్లు చూశానని, నిన్ను రిలీజ్ చేయడానికి అతడు పడిన తపన నీ మీద అతడికి ఉన్న ప్రేమను చాటిచెప్పిందని అనుపమ అంటుంది.
సంతోషంగా ఉండే రోజు…
రిషి కనిపించకుండా పోయినప్పటి నుంచి నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఆకలి, నిద్ర మానుకొని నువ్వు పడిన పడిగాపులను చూసి మేమే చలించిపోయామని వసుధారతో అంటుంది అనుపమ. నీ కన్నీళ్లకు, నిరీక్షణకు ఫలితం దొరకుతుందని, తొందరలోనే మీరిద్దరు సంతోషంగా ఉండే రోజు వస్తుందని వసుధారను ఓదార్చుతుంది అనుపమ.
కష్టకాలంలో రిషి పక్కన లేనందుకు వసుధారతో పాటు మహేంద్ర కూడా బాధపడతాడు. రిషి తొందరలోనే కోలుకొని మునుపటి రుషేంద్ర భూషణ్‌లా రాజాలా వస్తాడని అనుపమ ఇద్దరిని ఓదార్చుతుంది. ఈ ముగ్గురి మాటలను చాటునుంచి వసుధార బావ వింటాడు.
వసుధార బావ ప్లాన్…
వసుధారను చూసి చాలా రోజులైంది ఓ సారి చూసి వెళ్లాలని ఆమె బావ అనుకుంటాడు. వసుధార కోసం కిటికీలో నుంచి ఇంట్లోకి తొంగిచూస్తాడు. అది వసుధార కనిపెడుతుంది. ఆమె కంట పడేలోపు తప్పించుకుంటాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి కర్రను ఇంటి ముందు పడేసి శబ్ధం చేస్తాడు.
ఆ చప్పుడు విని వసుధార బయటకు వస్తుంది. వసుధార అందాన్ని చూసి ఆమె బావ ముగ్ధుడైపోతాడు. అదే అందం, అదే వర్చస్సు వసుధార ఏం మారలేదని మనసులో అనుకుంటాడు. వసుధార చూడకుండా ఆమెను ఫోన్‌లో ఫొటోలు తీసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దేవయాని ప్లాన్…
భద్రను తన ఇంటికి పిలుస్తుంది దేవయాని. అతడు అడక్కుండానే చాలా డబ్బు ఇస్తుంది. కానీ ఆ డబ్బు తీసుకోవడానికి భద్ర ఒప్పుకోడు. డబ్బు మీద ఆశ, మక్కువ తనకు లేదని అంటాడు. తాను డబ్బు కోసం కాకుండా సరదా కోసం క్రైమ్స్ చేస్తుంటానని చెప్పి దేవయానికి తిరిగి డబ్బులు ఇచ్చేస్తాడు.
తనకు ఓ పనిచేసి పెట్టాలని భద్రను అడుగుతుంది దేవయాని. అసలు మహేంద్ర ఇంట్లో ఏం జరుగుతుందని అడుగుతుంది. మహేంద్ర, అనుపమ…రిషి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. వసుధార ఇక్కడే ఉందా..తిరిగి పుట్టింటికి వెళ్లిందా అని భద్రను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది దేవయాని. ఇక మీద మహేంద్ర ఇంట్లో ఏం జరుగుతుందో వెంట వెంటనే నాకు చెప్పాలని భద్రకు ఆర్డర్ వేస్తుంది దేవయాని.
మహేంద్ర మీకు బంధువే కదా. ఒక్క ఫోన్ చేస్తే అతడే అన్ని విషయాలు చెబుతాడు కదా అని దేవయానితో అంటాడు భద్ర. అలాంటి పరిస్థితే ఉంటే నేను నీ సహాయం ఎందుకు తీసుకుంటానని భద్రకు సెటైరికల్‌గా ఆన్సర్ ఇస్తుంది దేవయాని.
ధరణి కంట పడ్డ దేవయాని…
భద్రతో దేవయాని మాట్లాడుతుండటం ధరణి చూస్తుంది. గేట్ అడ్డం ఉండటంతో భద్ర ఆమె కనిపించడు. దేవయాని ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి బయటకు వస్తుంది. ధరణి రావడం చూసిన దేవయాని వెంటనే భద్రను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారని, మిమ్మల్ని కలిసిన ఆ వ్యక్తి ఎవరు అని దేవయానిని అడుగుతుంది ధరణి.
సేల్స్ బాయ్ అని ధరణితో అబద్ధం ఆడుతుంది. అతడి కొన్ని వస్తువులు కొన్నానని చెబుతుంది. ఆమె ఖాళీ చేతులతో ఉండటం చూసి ఆ వస్తువులు ఏవని దేవయానిని అడుగుతుంది ధరణి. ఆమెకు దొరికిపోవడంతో నన్నే ప్రశ్నలు వేస్తున్నావా అంటూ ధరణిపై ఫైర్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. ఆమె మళ్లీ ఏదో కుట్రలు చేస్తుందని ధరణి అనుకుంటుంది.
మహేంద్ర ఎమోషనల్…
వసుధార వర్క్‌లో ఉండగా మరోసారి ఆమె దగ్గరకు మహేంద్ర వస్తాడు. రిషి ఎలా ఉన్నాడని, అతడికి ఫోన్ చేశావా అని అడుగుతాడు. రిషి కండీషన్ ఎలా ఉంది? బాగానే ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. రిషి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, ఇంకొన్ని రోజులైతే మామూలు స్థితికి వస్తాడని వసుధార బదులిస్తుంది.
ఇంకొన్ని రోజులు అంటూ ఎలా ఎన్ని రోజులు వేచిచూడాలి. రిషికి ఎంత కాలం దూరంగా ఉండాలి. కన్న కొడుకుకు అనారోగ్యంగా ఉన్నా అతడి పక్కన లేకుండాపోయాను. ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిదనిపిస్తుందని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు.
రిషి బాగు కోసం…
రిషి బాగు కోసం కొన్నాళ్లు ఈ బాధను భరించక తప్పదనిమహేంద్రకు బదులిస్తుంది వసుధార. శత్రువులు రిషి కోసం పొంచి ఉన్నారని, రిషి జాడకు సంబంధించి ఓ చిన్న క్లూ బయటపడిన రిషి ప్రాణాలకే ప్రమాదమని వసుధార అంటుంది. శత్రువల వల్ల రిషికి ఏ ఆపద ఎటు నుంచి వస్తుందోనని వసుధార భయపడుతుందని, నువ్వు పడే వేదనలో ఎంత న్యాయం ఉందో…తన భయంలో అంతే న్యాయం ఉందని మహేంద్రను కన్వీన్స్ చేస్తుంది అనుపమ.
రిషి కోలుకునే వరకు అతడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియకపోవడమే మంచిదని అనుపమ అంటుంది. అయినా మహేంద్ర కన్వీన్స్ కాడు. కన్న కొడుకును కళ్లారా చూడలేకపోతున్నానని, రిషి ఎలా ఉన్నాడో ఏమిటో, తిన్నాడా? నాతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటున్నాడా అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనీయడం లేదని అంటాడు.
రిషిని వెంటనే చూడాలని, అతడితో మాట్లాడాలని నా మనసు తహతహలాడుతుందని చెబుతాడు. ఇప్పుడే రిషిని చూడాల్సిందేనని పట్టుపడతాడు. వెంటనే వెళ్ధామని వసుధారతో అంటాడు మహేంద్ర. . పరిస్థితులు, శత్రువులకు భయపడి రిషిని చూడకుండా ఉండలేనని, నా కొడుకు ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎక్కడో ఓ చోట దక్కోవాల్సిన అవసరం లేదని మహేంద్ర ఆవేశపడతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.