Salaar 28 Days Collection: క్రమంగా తగ్గుతోన్న సలార్ కలెక్షన్స్.. 28 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Best Web Hosting Provider In India 2024

Salaar Day 28 Box Office Collection: డైనోసర్ ప్రభాస్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం “సలార్: సీజ్ ఫైర్ – పార్ట్ 1” బాక్సాఫీస్ వద్ద తన హవాను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. Sacnilk.com తాజా అంచనాల ప్రకారం సలార్ మూవీ అన్ని భాషల్లో ఇరవై ఎనిమిదో రోజున భారతదేశంలో సుమారు రూ. 0.25 కోట్ల నికర వసూళ్లను రాబట్టినట్లు వెల్లడించింది. అంటే సలార్‌కు 28వ రోజున రూ. 25 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు

అంతకుముందు నాటి కలెక్షన్స్ కంటే తక్కువ వచ్చినప్పటికీ సలార్ చిత్రం థియేటర్లలో దాదాపు నాలుగు వారాలపాటు సక్సెస్‌గా ప్రదర్శితం అవుతూ వచ్చింది. అంటే సుమారు నెల రోజుల పాటు థియేటర్లలో ప్రభాస్ సందడి నెలకొంది. తెలుగులో సంక్రాతికి మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ చిత్రాలు వచ్చినప్పటికీ ప్రభాస్ సలార్ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అయింది.

అలాగే తమిళనాడులో కూడా ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ ఆయాలన్ చిత్రాలు మంచి టాక్ వచ్చినప్పటికీ అక్కడ కూడా ప్రభాస్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం విశేషం. ఇలా ఎన్నో సినిమాలతో పోటీ పడుతూ ప్రభాస్ సలార్ మూవీ భారతదేశంలో రూ. 405.38 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లు Sacnilk.com నివేదిక తెలిపింది. గురువారం ఈ చిత్రం హిందీలో 8.66 శాతం ఆక్యుపెన్సీ రేటును సాధించినట్లు పేర్కొంది.

అలాగే సలార్ చిత్రానికి 28 రోజుల్లో రూ. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సలార్ మూవీ 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల ర్యాంకింగ్ లో ఐదవ స్థానాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ప్రభాస్, శ్రతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన సలార్ మూవీ రూ. 270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. వాటిలో ప్రభాస్ రెమ్యునరేషన్ సుమారు రూ. 100 కోట్లు అని టాక్ నడిచిన విషయం తెలిసిందే.

 

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి వారాంతంలో రూ.308 కోట్ల నికర వసూళ్లను రాబట్టగా, తెలుగు వెర్షన్ నుంచి అత్యధికంగా రూ.186.05 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ.92.5 కోట్లు వచ్చాయి. అయితే రెండో వారంలో రూ.70.1 కోట్లు, మూడో వారంలో రూ.23.7 కోట్లు వసూలు చేసింది. కాగా ప్రభాస్ ఇదివరకు నటించిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ దాటాయి. వీటి తర్వాత మూడో సినిమాగా సలార్ 600 కోట్లు దాటింది.

ఇలా ప్రభాస్ కెరీర్‌లో మూడు చిత్రాలు 600 కోట్ల క్లబ్‌లో చేరాయి. దీంతో మూడుసార్లు 600 కోట్ల మార్క్ దాటిన ఏకైక దక్షిణాది హీరోగా ప్రభాస్ రికార్డుకెక్కాడు. కాగా సలార్ మూవీని ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సుమారు రూ. 160 కోట్లు చెల్లించి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే, జనవరి 20 నుంచి సలార్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024