Beerakaya Karam Podi: బీరకాయ కారం పొడి రెసిపీ, వేడివేడి అన్నంలో స్పైసీగా అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Beerakaya Karam Podi: బీరకాయతో ఎక్కువగా పచ్చళ్ళు, కూరలు వండుకునే వారే ఎక్కువ. దీంతో టేస్టీగా స్పైసీగా కారంపొడి కూడా చేసుకోవచ్చు. బీరకాయ కారం పొడి చేసుకోవడం చాలా సులువు. ఒకసారి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తినవచ్చు. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ బీరకాయ కారం పొడి, అర స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. బీరకాయ కారంపొడి రెసిపీ ఎలాగో చూద్దాం.

 

ట్రెండింగ్ వార్తలు

బీరకాయ కారం పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు

బీరకాయ తొక్కు – అర కిలో

ఎండుమిర్చి – 15

మినప్పప్పు – రెండు స్పూన్లు

పసుపు – అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది

చింతపండు – నిమ్మకాయ సైజంత

ఉప్పు – రుచికి సరిపడా

నీళ్లు – తగినన్ని

బీరకాయ కారం పొడి రెసిపీ

1. బీరకాయ పైన తొక్కను తీసి ఒకచోట పెట్టుకోవాలి. కేవలం బీరకాయ పొట్టుతోనే కారంపొడి చేస్తాము.

2. ఆ బీరకాయ తొక్కును నీళ్లు కలపకుండా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి రుబ్బుకోవాలి. ఆ తొక్కు పొడిలా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. అందులో ఎండుమిర్చిని వేసి బాగా వేయించాలి.

4. వేయించిన ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినప్పప్పును వేసి వేయించాలి. ఆ మినప్పప్పును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.

5. అదే కళాయిలో మరొక స్పూను నూనెను వేయాలి.

6. ముందుగా గ్రైండ్ చేసుకున్న బీరకాయ తొక్కు పొడిని వేసి బాగా వేయించాలి. అందులోనే పసుపు వేసి వేయించుకోవాలి.

7. అది తడి ఆరిపోయి పొడిపొడిగా అయ్యేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసి మిక్సీలో వేయాలి.

 

8. అదే మిక్సీలో వేయించిన ఎండుమిర్చి, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

9. ఈ మిశ్రమం మెత్తని పొడిలా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. అంతే బీరకాయ కారంపొడి రెడీ అయినట్టే.

10. దీన్ని గాలి చొరబడని డబ్బాలో దాచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు.

బీరకాయ కన్నా బీరకాయ తొక్కులోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అందుకే బీరకాయ తొక్కు పచ్చడి ఎక్కువమంది ఇష్టపడతారు. బీరకాయ తొక్కలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు రావు. రోగనిరోధక వ్యవస్థకు కావలసిన శక్తిని అందిస్తుంది. మెదడు పనితీరు చురుగ్గా మారుస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగి బరువు పెరగకుండా ఉంటారు. అధిక బరువును తగ్గించాలనుకునేవారు బీరకాయ తొక్కును తమ మెనూలో చేర్చుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తరచూ బీరకాయ పొట్టుతో తయారుచేసిన ఆహారాలను తినడం ముఖ్యం. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా అడ్డుకుంటుంది.

WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024