రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు..మీకు ఆ ద‌మ్ముందా?

Best Web Hosting Provider In India 2024

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఎంపీ మార్గాని భరత్‌ ఛాలెంజ్  

రాజ‌మండ్రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాజ‌మండ్రి ఎంపీ సీటును ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీల‌కు ఇచ్చాడ‌ని, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆ ద‌మ్ముందా అని ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నార‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారని మార్గాని భ‌రత్ ప్ర‌శ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. బీసీలకు వైయ‌స్ఆర్‌ సీపీ చేసిన న్యాయం మీరు ఎప్పటికీ ఇవ్వలేరన్నారు.

బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబు అనర్హుడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూసే వ్యక్తి చంద్రబాబు. ఇదే చంద్రబాబు.. ఒకటి కాదు రెండు కాదు 14 ఏళ్లు రాష్ట్రాలు పాలించాడు. అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? అని ఎంపీ నిల‌దీశారు. ఇవాళ కొత్తగా చంద్ర‌బాబు డ్రామాకి తెరలేపాడు. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నా..బీసీలకు సీఎం వైయ‌స్ జగన్ 75 వేల కోట్లు ఇచ్చారు. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడింది. అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు.

బీసీల డీఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు. కనీసం నువ్వు ఆ సాహసం చేసావా? అని స‌వాలు చేశారు. మేము ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా? అని ప్ర‌శ్నించారు. మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. ఈ 42 ఏళ్లలో చంద్ర‌బాబు రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇచ్చార‌ని మార్గాని భ‌ర‌త్ ప్ర‌శ్నించారు.

Best Web Hosting Provider In India 2024