Best Web Hosting Provider In India 2024
IRCTC Jyotirlinga Darshan 2024 : మహాశివరాత్రి(Maha Shivratri 2024) అనేది శివ భక్తులకు ముఖ్యమైన రోజు. ఆ రోజున తప్పనిసరిగా ఆలయాలకు వెళ్తుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే శివుడు కొలువుదీరిన అనేక ప్రముఖ ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని దర్శించుకుంటే మంచిదని భక్తుల నమ్మకం. శివ జ్యోతిర్లింగాలు చాలా ఫేమస్. అత్యంత ప్రసిద్ధి చెందినవి. అక్కడకు వెళ్లడం అత్యంత పవిత్రమైనది శివ భక్తులు భావిస్తారు. అయితే వారికోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
హైదరాబాద్ (Hyderabad)నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో… పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపించనుంది. భోపాల్, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ మార్చి 13వ తేదీన అందుబాటులో ఉంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. షెడ్యూల్ కింది విధంగా ఉంటుంది.
టూర్ షెడ్యూల్ :
Day 1- Wednesday: కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. సాయంత్రం 04. 40 నిమిషాలకు (Sampark Kranti Express 12707) రైలు ప్రారంభంమవుతుంది.
Day 2- Thursday: ఉదయం 08. 15 నిమిషాలకు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడ సాంచి స్తూపాన్ని దర్శించుకుంటారు. తిరిగి భోపాల్ కు చేరుకుంటారు. ఇక్కడ ట్రైబల్ మ్యూజియం, తాజ్ ఉల్ మసీద్ ను చూస్తారు. రాత్రి భోపాల్ లోనే బస చేస్తారు.
Day 3- Friday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత ఉజ్జయినికి బయల్దేరుతారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేస్తారు.
Day 4- Saturday: నాల్గోరోజు ఓంకారేశ్వర్ కు చేరుకుంటారు.(రెండుకొండల మధ్య నుండి ప్రవహించే నర్మదా నది ఇక్కడ ఉంటుంది. ఇక్కడే ఓంకారేశ్వర్ క్షేత్రం ఉంది. ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం అని పేరు. ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ‘ఓం’ అని రాయబడి ఉంటుంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. మహాశివరాత్రి వేళ భక్తులు అత్యధికంగా తరలివస్తారు) ఆ తర్వాత స్థానికంగా ఉన్న పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
Day 5- Sunday: ఐదోరోజు మహేశ్వర్ కు బయల్దేరారు. ఐలాదేవి ఫోర్టును సందర్శిస్తారు. అనంతరం మండు ఫోర్టు చూసిన తర్వాత ఇండోర్ కు బయల్దేరుతారు. అంబేడ్కర్ రైల్వే స్టేషన్ కు చేరుకొని రాత్రి 7 గంటలకు రైలు ఎక్కుతారు.
Day 6- Monday: రాత్రి 10 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ ధరలు
Hyd Madhyapradesh tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 37810 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 21150 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.16390 గా ఉంది. కంఫర్ట్ కేటగిరిలోని AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
టాపిక్