TDP Janasena Meeting: మార్చి 17న చిలకలూరిపేటలో జనసేన-టీడీపీ బహిరంగ సభ.. మ్యానిఫెస్టో విడుదల

Best Web Hosting Provider In India 2024

TDP Janasena Meeting: ఎన్నికల పొత్తులు, సీట్ల సర్దుబాటు కొలిక్కి రానుండటంతో ఉమ్మడి ఎన్నికల ప్రచారానికి టీడీపీ-జనసేనలు సిద్ధం అవుతున్నాయి. మార్చి 17వ తేదీన చిలకలూరిపేటలో Chilakaluripet ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 10లక్షల మంది సమక్షంలో భారీ సభ నిర్వహిస్తున్నట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు, జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల ప్రకటించారు.

 

ట్రెండింగ్ వార్తలు

ఉమ్మడి మేనిఫెస్టో తో పాటు, ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను అధినేతలు ప్రకటించనున్నారు. మరోవైపు బీజేపీ కూడా టీడీపీతో జట్టు ఖరారైతే చిలకలూరిపేట సమావేశంలో ఆ పార్టీ కూడా పాల్గొనే అవకాశం ఉంది.

చిలకలూరి పేట సభకు టీడీపీ శ్రేణులు, జనసైనికులు,వీరమహిళలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఇరుపార్టీల నేతలు పిలుపునిచ్చారు. జనసేన, టీడీపీ పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు ఫోన్లు చేసి కేసుల పేరుతో వేధిస్తున్న పోలీస్ యంత్రాంగానికి సమాధానం చెప్పడానికి న్యాయనిపుణులతో 73062 99999 నంబర్ తో టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

వైసీపీ ఓటమి కోసమే పొత్తు…

రాజకీయపార్టీలు సాధారణంగా అధికారం కోసమే పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేస్తాయని, కానీ ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా తెలుగుదేశం-జనసేన పార్టీలు మొదటిసారి ఒక దుర్మార్గుడి పాలనకు వ్యతిరేకంగా, ప్రజలకోసం.. రాష్ట్రం కోసం ఒక్కటయ్యాయని, వైసీపీ బారినించి రాష్ట్రాన్ని కాపాడి, ప్రజలకు అండగా నిలిచి, వారికి మంచి భవిష్యత్ అందించాలనే సదుద్దేశంతోనే రెండుపార్టీలు పొత్తుపెట్టుకోవడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయు డు తెలిపారు.

“ టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయని ఇప్పటికే రెండు పార్టీలు 99 స్థానాలకు తమతమ పార్టీల అభ్య ర్థుల్ని ప్రకటించాయని చెప్పారు.

 

ప్రజల ఆశీర్వాదంతో, వారిబలంతో ముందుకెళ్తున్న టీడీపీ-జనసేనను విడదీయడం వైసీపీ తరం కాదన్నారు. రెండు పార్టీలు తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగసభ నిర్వహించాయని, మంగళవారం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన జయహో బీసీ డిక్లరేషన్ సభకు ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు హాజరయ్యారని చెప్పారు.

టీడీపీ-జనసేన పార్టీల ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో 17వ తేదీన చిలకలూరిపేటలో భారీ బహిరంగసభ ఇరుపార్టీల భవిష్యత్ కార్యాచరణను, ఉమ్మడి మేనిఫెస్టోను సభలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని వివరించారు.

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు సమావేశమైన సందర్భంగా ఇరుపార్టీలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాల నే నిర్ణయానికి వచ్చారని తెలిపారు. ఆ బహిరంగ సభ ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించబోతున్నట్టు చెప్పారు. చిలకలూరిపేట సభ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుందని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. సభలో ఇరుపార్టీ ల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడంతో పాటు, సూపర్ సిక్స్ పథకాలకు సంబం ధించి కీలక ప్రకటన చేయబోతున్నామన్నారు.

టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫె స్టో కూడా ఆ సభలో ప్రకటించబోతున్నట్టు చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మేనిఫెస్టోను ప్రకటిస్తారు. సభకు తెలుగుదేశం-జనసేన నుంచి సుమారు 10 లక్షలమంది కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారు. సభకు తరలివచ్చే జనప్రభంజనంతో నభూతో అన్నరీతిలో రెండుపార్టీల బహిరంగ సభ విజయవం తం అవుతుంది. ప్రజలంతా స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని, రెండుపార్టీల మధ్య చోటుచేసుకొనే చారిత్రక ఘట్టాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. టీడీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను జనాల్లోకి తీసుకెళ్లడానికి జనసేన కూడా పనిచేస్తోందన్నారు.

 

చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని కోరతామని, ఇరుపార్టీల సభకు ఎన్నిబస్సులు కావాలో తెలియచేస్తామని, తాము కోరిన విధంగా గతంలో మాదిరి బస్సులు కేటాయించకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

జగన్ ప్రభుత్వంలో తప్పులు చేస్తున్న అధికారుల మాదిరే ఆర్టీసీఎండీగా ఉన్న అధికారి కూడా తగినమూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. రాజకీయపార్టీలు సభలు పెట్టుకోవడం.. నిబంధనలప్రకారం డబ్బులు చెల్లిస్తే బస్సులు ఇవ్వడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీనే అని కానీ జగన్ సర్కార్ ఏర్పడ్డాకే, ఆర్టీసీ యాజమాన్యం కొత్తపోకడలు పోతోందన్నారు.

WhatsApp channel
 

టాపిక్

 
 
TdpTdp CandidatesTdp ManifestoJanasena CandidatesJanasena ManifestoAndhra Pradesh Assembly Elections 2024Ap Politics

Source / Credits

Best Web Hosting Provider In India 2024