Vishwak Sen Adivi Sesh: గూఢచారి టైమ్‌లో కళ్లద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాదే నేటి విశ్వక్ సేన్: అడవి శేష్

Best Web Hosting Provider In India 2024

Adivi Sesh About Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా చేసింది. వి సెల్యులాయిడ్ సమర్పించిన ఈ సినిమాను క్రౌండ్ ఫండ్ ద్వారా నిర్మించారు. గామి మూవీ మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇటీవల గ్రాండ్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ విశేషాలపై లుక్కేద్దాం.

ట్రెండింగ్ వార్తలు

“ఈ వేడుకలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మీకు దినేష్ ప్రసాద్ ఎవరో తెలుసా? 2018లో అన్నపూర్ణ స్టుడియోలో గూఢచారి టెస్ట్ స్క్రీన్ చేస్తున్నాం. ఎవరో ఓ కుర్రోడు వచ్చి ‘బాగా చేసినవ్’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఎవడ్రా వీడు అనుకున్నా. ఆ రోజు కళ్లజోడు పెట్టుకున్న దినేష్ ప్రసాద్.. ఈ రోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న నటుడు విశ్వక్. పరిశ్రమలో నిజాయితీ గల నటుడు. తన నిజాయితీ గల మనసు కోసమే ఇక్కడికి వచ్చాను” అని అడవి శేష్ తెలిపాడు.

“గామి ట్రైలర్ గురించి అందరూ మాట్లాడారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలనిపించడమే కాదు, సినిమా హిట్ అవ్వాలని కూడా కొరుకునేలా ఉంది. విద్యాధర్ ప్యాషన్‌కి హ్యాట్సప్. నా కెరీర్ బిగినింగ్‌లో కర్మ అనే సినిమాని చాలా కష్టపడి చేశాను. దానికి మంచి ఫ్లాట్ ఫామ్ సపోర్ట్‌గా వస్తే బావుటుందని అనుకున్నాను. గామికి అలాంటి ఫ్లాట్ ఫామ్ యూవీ రూపంలో దొరికింది. నరేష్ మ్యూజిక్ చాలా బాగుంది. చాందినీకి అభినందనలు. శివరాత్రి రోజున సినిమా థియేటర్స్‌లోకి వస్తోంది. గామి సినిమాని ఎంజాయ్ చేద్దాం. సెలబ్రేట్ చేద్దాం” అని అడవి శేష్ అన్నాడు.

“గామి చిన్నగా మొదలై పెద్దగా మారింది. మమ్మల్ని నమ్మి క్రౌడ్ ఫండ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. సినిమా ప్రేమికుల వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యపడింది. నిర్మాత కార్తిక్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాతో పాటు ప్రయాణించాడు. నాకు ఒక్క సమస్య కూడా రానివ్వకుండా నేను అనుకున్నది అనుకున్నట్లు తీయడంలో సపోర్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ ఇచ్చిన సపోర్ట్ ఫ్రీడం అద్భుతం. విక్కీ వంశీ గారికి ధన్యవాదాలు” అని డైరెక్టర్ విద్యాధర్ కాగిత తెలిపారు.

“మమ్మల్ని వెరీ బిగినింగ్‌లో నమ్మిన నాగ్ అశ్విన్ గారికి ధన్యవాదాలు. చాందినీ రెమ్యునిరేషన్ గురించి అలోచించకుండా చాల కష్టపడి పని చేశారు. డీవోపీ విశ్వనాధ్, వీఎఫ్ఎక్స్ సునీల్, ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, కంపోజర్ నరేష్ ఇలా అందరూ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. గామి సౌండ్ గూస్ బంప్స్ ఇస్తుంది. నా డైరెక్షన్ టీం అందరికీ ధన్యవాదాలు. విశ్వక్ సింగిల్ సిట్టింగ్‌లో స్క్రిప్ట్ చదివి ఈ సినిమా చేస్తున్నాని చెప్పారు. తను బ్రిలియంట్‌గా నటించారు. గామి ఇంటెన్స్ ఎమోషనల్ ఫిల్మ్. గామి ఓ ఎపిక్. మేము ఒక ఎపిక్ సినిమా తీశామని నమ్ముతున్నాం” అని డైరెక్టర్ అన్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024