Operation Valentine OTT: నెల‌లోపే ఓటీటీలోకి ఆప‌రేష‌న్ వాలెంటైన్ – వ‌రుణ్ తేజ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Best Web Hosting Provider In India 2024

Operation Valentine OTT: వ‌రుణ్‌తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా ప్ర‌ధానంగా ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ తెర‌కెక్కింది.

ట్రెండింగ్ వార్తలు

తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ సినిమాతో శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యాడు. ట్రైల‌ర్‌, టీజ‌ర్స్ అంచ‌నాల‌ను రేకెత్తించిన క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, గ‌తంలో ఈ బ్యాక్‌డ్రాప్‌లో హృతిక్ రోష‌న్ ఫైట‌ర్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు రావ‌డంతో ఆప‌రేష‌న్ వాలెంటైన్ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో…

థియేట‌ర్ రిజ‌ల్ట్ కార‌ణంగా ఆప‌రేష‌న్ వాలెంటైన్‌ నెలలోపే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ట్లు తెలిసింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. వ‌రుణ్ తేజ్ మూవీ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంద‌ని అంటున్నారు.

ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీ వారం రోజుల్లో తెలుగు, హిందీ భాష‌ల్లో క‌లిపి 8.61 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగు వెర్ష‌న్‌కు 6.95 కోట్ల వ‌సూళ్లు రాగా…హిందీ వెర్ష‌న్ 1.66 కోట్లు మాత్ర‌మే క‌లెక్ట్ చేసింది. వ‌రుణ్‌తేజ్ గ‌త సినిమాల రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ఆప‌రేష‌న్ వాలెంటైన్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగింది.

దాదాపు ప‌దికోట్ల‌కు ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు తెలిసింది. ప‌ద‌కొండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే నాలుగు కోట్లకుపైనే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాల్సివుంది.

ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ మాత్రం భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఈ మూడు హ‌క్కుల‌ ద్వారా నిర్మాత‌లున‌ల‌భై కోట్ల‌కుపైనే రిక‌వ‌రీ అయిన‌ట్లు చెబుతోన్నారు.

ఆప‌రేష‌న్ వాలెంటైన్ క‌థ ఇదే…

అర్జున్ రుద్ర దేవ్ (వ‌రుణ్ తేజ్‌) ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రాన్ లీడ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం రుద్ర చేసిన సాహ‌సం కార‌ణంగా అత‌డి స్నేహితుడు క‌బీర్ (న‌వ‌దీప్‌) ప్రాణాలు కోల్పోతాడు. దాంతో ప్రాజెక్ట్‌ వ‌జ్ర‌ను అధికారులు బ్యాన్ చేస్తారు.

2019 ఫిబ్ర‌వ‌రి 14న క‌శ్మీర్‌లో పుల్వ‌మాలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిపై రివేంజ్ తీర్చుకోవ‌డానికి ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేస్తుంది. ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ను త‌న ధైర్య‌సాహ‌సాల‌తో రుద్ర స‌క్సెస్ చేస్తాడు. ఈ ఎయిర్ స్ట్రైక్ త‌ర్వాత ఇండియాపై ఓ సీక్రెట్ కోడ్ పేరుతో పాకిస్థాన్ దాడి చేసేందుకు ఎలాంటి కుట్ర‌లు చేసింది? ఆప‌రేష‌న్ వాలెంటైన్ ద్వారా పాక్ దాడుల‌ను అర్జున్ ఎలా భ‌గ్నం చేశాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ యాక్టింగ్‌, ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ క‌థ‌లో దేశ‌భ‌క్తిని ర‌గిలించే బ‌ల‌మైన ఎమోష‌న్స్ మిస్స‌వ్వ‌డం మైన‌స్‌గా మారింది.

బాలీవుడ్ బ్యూటీ…

ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీతో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో వింగ్ క‌మాండ‌ర్ క్యారెక్ట‌ర్ చేసింది. న‌వ‌దీప్‌, రుహాణి శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024