Best Web Hosting Provider In India 2024
జనసైనికులు వైయస్ఆర్‌సీపీలో చేరిక
పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన అభిమానులు పెద్దషాక్ ఇచ్చారు. భీమవరంలో పెద్ద ఎత్తున జనసేనికులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. శనివారం భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో జనసైనికులు తోలేరు, వెంకటాపురం ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. గ్రంధి శ్రీనివాస్ అంటే తనకు వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2014లో తన గెలుపు కోసం పనిచేసిన వారు 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి నన్ను విడిచిపెట్టి ఆయనకు మద్దతు పలికారు. ఇందులో తప్పేమీ లేదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు కాబట్టి తిరిగి నా దగ్గరికి రావడానికి జనసైనికులు ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు. జన సైనికులను వైయస్ఆర్ సీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా తుడుచుకుపెట్టి పోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు.
టీడీపీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరిన 50 కుటుంబాలు
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమయంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరాయి. వారికి కండువా కప్పి మంత్రి కాకాణి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి గుర్తు చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలకు ఆకర్శితులై టీడీపీ, జనసేన నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నారని, మళ్లీ వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని పార్టీలో చేరిన నేతలు చెప్పినట్లు మంత్రి తెలిపారు.