Best Web Hosting Provider In India 2024
NNS 03rd April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఏప్రిల్ 3) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. భాగమతి శరీరంలోకి వెళ్లి అరుంధతి ఆత్మ ఏం చేసింది అన్నది ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. అసలు మొత్తంగా ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
చిత్రగుప్తుడితో అరుంధతి మాట్లాడే సీన్ తో ఎపిసోడ్ మొదలవుతుంది. గుప్తా గారు నేను ఉంగరం ఇస్తే నన్ను మీ లోకానికి తీసుకెళ్దాం అనుకున్నారా.. నేను ఉంగరం ఇవ్వను.. మీరు నిజం చెప్పండి పౌర్ణమి నాడు నాకు రాబోయే శక్తి గురించి మీరు నిజం చెప్పాలి అంటుంది అరుంధతి. ఏంటి బెదిరించుచున్నావు ఇది న్యాయం కాదు అంటాడు గుప్తా.
అరుంధతిగా మారిన భాగమతి
అరుంధతి వెళ్లి గుప్తా ఒంట్లో ప్రవేశిస్తుంది. ఇంతలో భాగమతి వస్తుండగా మిస్సమ్మ మన ఇంట్లో తోటమాలి గుప్తా గారిని చూశారా అని అడుగుతుంది అరుంధతి. అయితే మీరెవరు అంటుంది భాగమతి. గుప్తా అద్దంలో తన బొమ్మను చూసుకొని పరిగెత్తికెళ్లి చెట్టు చాటున దాక్కుంటాడు. గుప్తా గారు ఎందుకు మిమ్మల్ని మీరే వెతుక్కుంటున్నారు.. అచ్చం పక్కింటి ఆవిడలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది భాగమతి.
మిస్సమ్మ.. ఆ గుప్తా కొంచెం తేడా లే రా అంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. అరుంధతి గుప్తా శరీరం నుంచి బయటికి వచ్చి పౌర్ణమి నాడు నాకు రాబోతున్న శక్తి ఇదే అన్నమాట అంటుంది. బాలిక నేను చెప్పుచున్నది నీ మంచి కోసమే.. నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని గుప్తా అంటూ ఉండగా అరుంధతి పరిగెత్తుకెళ్ళి భాగమతి ఒంట్లో ప్రవేశిస్తుంది.
మనోహరికి భాగమతి వార్నింగ్
పౌర్ణమి రోజు అరుంధతి ఆత్మ నుంచి తనను కాపాడుకోవడానికి ఘోరా ఇచ్చిన తాయెత్తును కట్టుకుంటుంది మనోహరి. ఘోరా మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏదో జరగబోతుంది అని భయపడుతుంది. ఏం జరిగినా ఈసారి అమర్‌ని పెళ్లి చేసుకునేది మాత్రం తానే అనుకుంటుంది. ఇంట్లోకి వస్తూనే ఎదురుగా వచ్చిన మనోహరితో మాట్లాడుతుంది భాగమతి రూపంలో ఉన్న అరుంధతి.
మను.. అని పిలవడంతో మనోహరి షాకవుతుంది. తన కుటుంబానికి హాని తలపెట్టాలని చూస్తే ఊరుకోనని మనోహరికి వార్నింగ్ ఇస్తుంది అరుంధతి. ఇంతలో పిల్లలు రావడంతో వాళ్లని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. మిస్సమ్మ ప్రవర్తనకి అమర్ కుటుంబం ఆశ్చర్యపోతుంది. ఏదో చాన్నాళ్ల నుంచి పిల్లల్ని చూడనట్లు ప్రవర్తిస్తున్నావేంటి మిస్సమ్మ అని అడుగుతాడు అమర్.
ఎక్కడ అరుంధతి ఆత్మ భాగమతిలో ఉందనే విషయం అందరికీ తెలిసిపోతుందోనని కంగారు పడుతుంది మనోహరి. అందరం భోజనం చేద్దాం రండి అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అందరూ భోజనానికి కూర్చుంటుంటే.. తానే వడ్డిస్తానంటుంది మిస్సమ్మ. ఒక్కొక్కరికీ ఇష్టమైన వంటలు వడ్డిస్తూ అందరి అలవాట్లని తెలిసినట్లు మసులుకుంటుంది.
ప్రతి విషయంలోనూ తన భార్య అరుంధతిని తలపిస్తున్న మిస్సమ్మని చూసి ఆశ్చర్యపోతాడు అమర్. అరుంధతి అనుకున్నది సాధిస్తుందా? అరుంధతిని ఎదుర్కోడానికి మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 03న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!